Bank of america

Bank of America Corp, Bank of America customer,Bank of America 6 Month CD Rates, Six-Month LIBOR, world banking system adopted the LIBOR

Bank of America Corp

Bank of America Corp.GIF

Posted: 12/12/2011 04:50 PM IST
Bank of america

BANKOFAMERICA

రానున్న రోజుల్లోనూ గడ్డుకాలం కొనసాగవచ్చని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్‌లించ్ అంటోంది. ‘వచ్చే ఆరు నెలలూ మార్కెట్లకు కష్టకాలమే. సెన్సెక్స్ 14,500 స్థాయి వరకూ పడొచ్చని అంచనా వేస్తున్నాం. ప్రధానంగా వృద్ధి రేటు మందగమనం ఆందోళనలే ఇందుకు కారణం. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీరేట్లు తదితర అంశాలు ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ తగ్గిపోయేందుకు కారణమవుతోంది’ అని తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. భారత్ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది అత్యంత దుర్భర పనితీరును కనబరిచాయని, అయితే, ఈ నెల మిగిలిన రోజుల్లో సంవత్సరాంతపు ర్యాలీ గురించి మాట్లాడుతూ... సాధారణంగా మార్కెట్లు డిసెంబర్‌లో పటిష్టంగానే కనబడతాయని వ్యాఖ్యానించింది.
 2012 మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే మార్కెట్లకు కొంత సానుకూలంగా ఉండొచ్చని, ఏడాది చివరకు సెన్సెక్స్ 19,000 స్థాయికి వెళ్లే అవకాశాలున్నాయనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా. ఆర్‌బీఐ భారీగా రేట్ల తగ్గింపు చర్యలు చేపట్టడం, ప్రభుత్వం పాలసీ పరమైన నిర్ణయాలను వేగవంతం చేయడం వంటివి జరిగితే పెట్టుబడులను జోరందుకునేలా చేయొచ్చని ఇది సెన్సెక్స్‌ను కోలుకునేలా చేస్తుందని అభిప్రాయపడింది. సంస్కరణలు పుంజుకోకుంటే తప్ప నిలకడైన ర్యాలీ సాధ్యం కాదని కూడా నివేదిక హెచ్చరించింది. ఈ ఏడాది సెన్సెక్స్ దాదాపు 22 శాతం పతనం కాగా, ఇదే కాలంలో ఇన్వెస్టర్ల సంపద(స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ) 500 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.25 లక్షల కోట్లు) మేర ఆవిరైనట్లు అంచనా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ambani family drama ends
Reliance industries  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles