Mythological History Of Nainital Which is popular hill station in India | Telugu Puranas

Nainital popular hill station mythology history skand puranas

Nainital news, Nainital history, Nainital tourism, Nainital mythology history, skand puranas, indian hill stations, popular hill stations india, Nainital mythology, Nainital tourist places

Nainital popular hill station Mythology History Skand Puranas : The Mythological History Of Nainital Which is popular hill station in India state of Uttarakhand and headquarters of Nainital district in the Kumaon foothills of the outer Himalayas.

‘స్కందపురాణం’లో నైనితాల్ ప్రాంతం విశిష్టత

Posted: 05/06/2015 07:59 PM IST
Nainital popular hill station mythology history skand puranas

నైనితాల్.. భారతదేశపు సరస్సుల జిల్లాగా పిలువబడే అద్భుతమైన ప్రదేశం. హిమాలయ శ్రేణులలో ‘కుమావొన్ హిల్స్’ మధ్య భాగంలో వున్న ఈ ప్రాంతం అందమైన సరస్సులను కలిగి వుంది. నైనీతాల్ పేరులోని నైనీ అంటే నయనం.. తాల్ అంటే సరసు. భారతదేశంలో నైనీతాల్ ప్రసిద్ధ హిల్ స్టేషనే కాకుండా పుణ్యా క్షేత్రాలలో ఒకటిగా ప్రఖ్యాతి గాంచింది. ఇది సముద్రమట్టానికి 2084 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తున ఉంది. నైనీతాల్ కంటి ఆకారం కలిగిన ఉన్న పర్వతశిఖరాల మద్యనున్న ప్రదేశంలో ఉపస్థితమై ఉంది. ఈ ప్రాంతానికి ‘నైనితాల్’ అనే పేరు రావడం వెనుక వున్న చరిత్ర ‘స్కందపురాణం’లో పొందుపరచబడింది.

పేరువెనుక చరిత్ర :

‘స్కందపురాణం’లోని మానస ఖండ్ లో నైనితాల్ ను  ‘ముగ్గురు ఋషుల సరస్సు’ లేదా ‘ముగ్గురు ఋషుల సరోవరం’ అని అంటారు. ఆ ముగ్గురు ఋషుల పేర్లు అత్రి, పులస్త్య, పులాహ. వీరు ముగ్గురు తమ దాహం తీర్చుకునేతందుకు నైనితాల్ వద్ద ఆగారు. ఈ ప్రాంతంలో నీరుకోసం ఎంత వెదికినప్పటికీ వారికి దొరకలేదు. దీంతో వారు ముగ్గురు కలిసిన వెంటనే ఒక పెద్ద గొయ్యి తవ్వడం ప్రారంభించారు. దానిలోకి ‘మానస సరోవరం’ నీటిని నింపి వారు తమ దాహం తీర్చుకున్నారు. ఆ విధంగా నైనితాల్ సరస్సు సృష్టించబడింది. మరో కథనం ప్రకారం ఇక్కడ శివుడి భార్య అయిన సతి ఎడమ కన్ను పడి.. ఆ ప్రాంతంలో నైని సరస్సు సృష్టించబడింది.

మరికొన్ని ఆసక్తికర విశేషాలు :

- భూతల స్వర్గంలా తలపించే ఈ నైనితాల్ ఎంతో ఆకర్షణీయంగా వుండటంతోపాటు ప్రశాంత వాతావరణాన్ని కలిగివుంటుంది. బ్రిటిష్ వ్యాపారి అయిన ఫై.బర్రోన్ అనే వ్యక్తి ఈ ప్రాంత అందాలకు ముగ్ధుడై 1839లో ఒక బ్రిటిష్ కాలనీ స్థాపించి దానిని ప్రసిద్ధి చేశాడు. ఆంగ్లో నేపాలీ యుద్ధం (1814-1816) తరువాత ఈ ప్రాంతం కుమాన్ హిల్స్ బ్రిటిష్ పాలనలోకి వచ్చింది. అయినప్పటికీ 1841 తరువాతనే నైనీతాల్ అభివృద్ధిచేయబడింది.

- 1846లో బెంగాల్ సైన్యానికి చెందిన కేప్టన్ ఆర్టిల్లరీ నైనీతాల్‌ను దర్శించాడు. ఆయన మాటలలో ‘దాదాపు సముద్రమట్టానికి 7,500 అడుగులు (2,300 మీటర్లు) ఎత్తువరకు నివాసగృహాలు వ్యాపించి ఉన్నాయి’ అని వర్ణించాడు. తరువాత కాలంలో అటవీప్రాంతంలో సెయింట్ జాన్ చర్చ్ నిర్మాణం జరిగింది.

- నైనిటాల్ సందర్శనకు ప్రణాళిక చేసే వారు ఇక్కడే కల హనుమాన్ ఘర్ కూడా తప్పక చూడాల్సిందే! దీంతోపాటు ఇండియాలోని 51 శక్తి పీఠాలలో ఒకటైన నైనా దేవి టెంపుల్ కూడా తప్పక చూడాలి.

- షాజాన్‌పూరుకు చెందిన చక్కెర వ్యాపారి పి.బారన్ యురేపియన్ హౌస్ (భక్తుల వసతి గృహం) నిర్మాణంతో ఇక్కడ మొదటి నిర్మాణం ఆరంభం అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nainital  Indian Hill stations  Skand Puranas  

Other Articles