ప్రపంచ భూభాగంలో నమ్మశక్యం కాని ఎన్నో చమత్కారాలు చోటు చేసుకున్నాయి. వాటి వెనుకున్న కథనాలు, రహస్యాలు అందరినీ అబ్బురపరుస్తుంటాయి. అలాంటి విచిత్రమైన వ్యవహారాల్లో ‘తిమ్మమ్మ మర్రిమాను’ కూడా ఒకటి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి 35 కి.మీ దూరంలో గూటిబయలు గ్రామంలో ఈ మర్రిమాను వుంది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వృక్షంగా పేరుగాంచిన ఈ చెట్టు.. దాదాపు 5 చదరపు ఎరకాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి వుంది. 1989లో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందింది. ఈ చెట్టుకు ‘తిమ్మమ్మ’ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు. అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఓ కథనం కూడా వుంది.
నేపథ్యం :
బుక్కపట్నానికి చెందిన వెంకటప్ప, మంగమాంబ దంపతులకు తిమ్మమాంబ అనే కుమార్తె వుండేది. గూటిబైలుకు చెందిన బాలవీరయ్యతో తిమ్మమాంబకు వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు వీరి సంసారజీవితం బాగానే కొనసాగింది. అయితే.. కొంతకాలం అనంతరం వీరయ్య మరణించాడు. ఆరోజుల్లో సతీసహగమనం ఆచారం కొనసాగుతుండేది కాబట్టి... భర్తమరణంతో తిమ్మమాంబ సతీసహగమనానికి సిద్ధమైంది. అప్పుడు చితిలోకి దూకేందుకు ఎత్తుకోసం నాలుగు ఎండిన మర్రి గుంజలను (కట్టెలు) నాటారు. ఆ నాలుగింటిలో ఈశాన్య దిశలో నాటిన గుంజ... చిగురించి అది మహావటవృక్షంగా ఎదిగింది. అందుకే.. ఈ చెట్టుకు ‘తిమ్మమ్మ’ అనే పేరు పెట్టారు. ఈ చెట్టును ప్రపంచపుటల్లో స్థానం కల్పించేందుకు 1989లో సత్యనారాయణ అరియర్స్ అనే వ్యక్తి ఎంతో కృషిచేశారు. ఆయన తీసుకున్న కృషితోనే ఈ చెట్టు గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. 1355 వూడలతో వుండే ఈ మర్రిమానుకు దాదాపు 660 సంవత్సరాలు నిండాయి.
మరికొన్ని విశేషాలు :
అనంతపురం జిల్లాలో నీటి కొరత ఎక్కువగా వున్నప్పటికీ.. తిమ్మమ్మ మర్రిమాను ఆకాశం కనిపించనంత గుబురుగా పెరిగి, పచ్చని ఆకులతో చూపరులను ఆశ్చర్య చకితుల్ని చేస్తుంది. మర్రిమానును 1992లో అటవీ శాఖ ఆధీనంలోకి తీసుకుంది. మర్రిమాను అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ రూ.34 లక్షలతో అతిథి భవనం, అటవీశాఖచే వన్యప్రాణుల సంరక్షణ షెడ్డు, రూ.12 లక్షలతో శివఘాట్ నిర్మించారు.
ఈ చెట్టు క్రింద ‘తిమ్మమ్మ’ గుర్తుగా చిన్న గుడి వుంది. అక్కడ వున్న శిలా ఫలకం మీద ‘తిమ్మమ్మ 1394లో శెట్టి బలిజ శెన్నాక్క వేంకటప్ప, మంగమ్మ లకు జన్మించింది. 1434లో సతీ సహగమనం చేసింది’ అని చెక్కబడింది. పిల్లలు లేని దంపతులు ఇక్కడ పూజ చెయ్యడం వల్ల పిల్లలు కలుగుతారని భక్తులు భావిస్తారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. ఈ వృక్షము పై ఏ పక్షీ మల విసర్జన చెయ్యదని చెపుతారు. అంతేకాదు.. సాయంత్రం ఆరు గంటలకల్లా పక్షులేవీ ఈ చెట్టు పై ఉండవట!
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more