The story of coober pedy city which is built in underground

coober pedy city, coober pedy city news, coober pedy history, coober pedy story, coober pedy wikipedia, coober pedy wiki, coober pedy houses, coober pedy city photos, coober pedy location, coober pedy, the underground city, coober pedy underground city

the story of coober pedy city which is built in underground

భూగర్భంలో అందమైన స్వర్గం!

Posted: 11/05/2014 04:43 PM IST
The story of coober pedy city which is built in underground

సాధారణంగా పట్టణాలన్నీ నేలపై వుంటే... ఆ పట్టణం భూగర్భంలో స్వర్గంలా మెరుస్తూ వస్తుంది. ప్రపంచంలో ఏ పట్టణానికి లేనంత ప్రత్యేకతను అది సంతరించుకుంది. ఆ పట్టణంపేరు ‘‘కూబర్ పెడీ’’. ప్రపంచంలోనే భూగర్భంలో ఏర్పడిన ఏకైక పట్టణంగా పేరుతెచ్చుకున్న కూబర్.. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ కి దగ్గరలో వున్న ఎడారి నేలల కింద ఏర్పడింది. సాధారణ పట్టణంలానే అందులో కూడా అద్భుతమైన రోడ్లు, ప్రార్థనాలయాలు, పాఠశాలలు, ఈతకొలనులు, గ్రంథాలయాలు.. ఇంకా ఇతరత్ర అవసరమైనవన్నీ అందుబాటులో వుంటాయి. ఈ పట్టణంలో సుమారు 3000 మంది వున్నారు. దీనిని చూడటానికి దేశవిదేశాల నుంచి ఎంతోమంది పర్యాటకులు నిత్యం వస్తూనే వుంటారు. దాంతో ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది కూడా!

ఉనికి :

ఆస్ట్రేలియాలోని స్టువర్ట్ హైవేలో గల అడిలైట్ నుంచి ఉత్తరంగా 846 కి.మీ. దూరంలో వుంది. 2011 లెక్కలప్రకారం ఈ నగరంలో జనాభా 1,695 (953 పురుషులు,742 స్త్రీలు మరియు 275 ఇండిజెనస్ ఆస్ట్రేలియన్లతో కలిపి) వుండేది. అయితే ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతంలో రానురాను జనసంచారం పెరుగుతూపోతోంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ విలువైన స్ఫటికాల గనులు ఎక్కువగా వుండటంతో దీనిని ప్రపంచ స్ఫటిక రాజధానిగా పిలుస్తారు. అసలు ఇది భూగర్భంలో ఎందుకు నిర్మించబడిందంటే.. పగటంపూట దహించే ఉష్ణం నుంచి రక్షించుకోవడం కోసం!

ఎలా ఏర్పడింది :

1915 ప్రాంతంలో విల్లీ హషిన్సన్ అనే వ్యక్తి... అక్కడ అత్యంత విలువైన ‘‘ఒపెల్’’ అనే రాళ్లు అధికంగా ఉన్నట్లు గుర్తించాడు. అతను చెప్పినట్లుగానే ఆ రాళ్లు అక్కడున్నట్లు కొన్ని పరిశోధనల ద్వారా నిర్ధారించారు. వీటిని మొదట 1915 ఫిబ్రవరి 1వ తేదీన గుర్తించారు. అప్పటి నుంచి ఈ నగరం ప్రపంచానికి విలువైన వజ్రాలను, నాణ్యతగల రాళ్లను అందిస్తూ వచ్చింది. 1916 నుంచి తవ్వకాలు మొదలుపెట్టిన ఈ ప్రాంతాన్ని 1999నాటికి ప్రదేశమంతా డ్రిల్ చేసి, ఒపెల్ రాళ్లను తవ్వేశారు. ఆ దెబ్బతో అక్కడ దాదాపు 15 మీటర్లు లోతుగల పెద్దపెద్ద గోతులు మిగలాయే తప్ప గనులు తరిగిపోయాయి. అయితే తర్వాతి కాలంలో ఆ గోతులే నేడు నివాస స్థలాలుగా మారాయి. అలా ఆ విధంగా ఈ కూబర్ పెడీ ప్రాంతం ఏర్పడి.. అభివృద్ధి చెందుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

మరికొన్ని విషయాలు :

కూబర్ పెడీ పట్టణంలో వున్న జనాలలో 90 శాతం మంది భూగర్భ గృహాల్లోనే (డగౌట్స్) నివసిస్తుంటే.. మిగతావారికి అక్కడ నివసించడం ఇష్టంలేక కొంచెం దూరంలో నేలమీద ఎంతో అద్భుతమైన, విలాసవంతమైన, ఆధునిక పరిజ్ఞానంతో గృహాలను నిర్మించుకుని నివసిస్తున్నారు. ఈ నగరంలో మానవ జీవనశైలికి అవసరమయ్యే పరికరాలు, ఆహారపదార్థాలు, ఇతర సౌకర్యాలు అన్నీ అందుబాటులో వుంటాయి. అయితే ఇక్కడ వారానికొకసారి పక్కనున్న పట్టణం నుంచి కూరగాయలు, పాలు, మాంసం వంటి ఆహారపదార్థాలను తీసుకోవడానికి మాత్రమే అందరూ ఒకేసారి బయటకు వస్తారు. మితిమీరిన ఉష్ణోగ్రత వల్లే వాళ్లందరూ ఇలా భూగర్భంలో నివసిస్తున్నట్లు పేర్కొంటున్నారు.

అయితే ఇక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి వుంటుంది. ఏదైనా ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే మిగిలిన ఇళ్లు కూడా త్వరగా ప్రభావితమవుతాయి. అంతేకాదు.. చెత్త ఎక్కడబడితే అక్కడ పారేయకూడదు. నేలమీద కేటాయించిన స్థంలోనే పారబోస్తారు. ఇదలావుండగా.. 2006లో ఇక్కడ ఒపల్ డ్రీమ్ అనే చిత్రాన్ని తీశారు. దాంతో ఈ ప్రాంతం మరింత పాపులర్ అయిపోయింది. అప్పటినుంచి ఇక్కడ జనసంచారం మరింత పెరిగి, పర్యాటక ప్రదేశంగా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles