Rudramadevi biography who is belongs to kakatiya kingdom and named as veeravanitha

rudramadevi biography, rudramadevi news, rudramadevi kakatiya kingdom, rudramadevi kakatiya dynasty, rudramadevi life story, rudramadevi life history, rudramadevi movie, princess rudramadevi life history

rudramadevi biography who is belongs to kakatiya kingdom and named as veeravanitha

కాకతీయవంశానికి పేరుప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన వీరవనిత

Posted: 11/04/2014 04:34 PM IST
Rudramadevi biography who is belongs to kakatiya kingdom and named as veeravanitha

భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి ఒక అరుదైన ఘనత వున్న విషయం తెలిసిందే! ఆ వంశం నుంచి ఎంతోమంది రాజులు, రాణులు తమ కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించి, తమ రాజ్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అటువంటి సామ్రాజ్యం నుంచి వచ్చిన రుద్రమదేవి.. కాకతీయుల వంశంలో ఒక ధృవతారగా వెలిగింది. కాకతీయ వంశానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ఆమె... దేశచరిత్రలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించింది. భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమదేవి ఒకరు. నిజానికి ఈమె అసలు పేరు రుద్రాంబ! అయితే ఈమె తండ్రి గణపతిదేవుడికి పుత్రసంతానం కలగకపోవడం వల్ల ఆమెను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశారు. అలా ఆ విధంగా ఆమె పేరు రుద్రమదేవిగా మారింది.

సామ్రాజ్య విశేషాలు :

కాకతీయవంశంలో అగ్రగణ్యుడిగా పేరొందిన గణపతిదేవుడు దాదాపు 62 సంవత్సరాలవరకు రాజ్యాన్ని పాలించిన అనంతరం... తన కూతురు రుద్రమదేవికి 1262లో ‘‘రుద్రమహారాజు’’ అనే బిరుదుతో కాకతీయ సింహాసనాన్ని అధిష్టించారు. అయితే ఆమె ఒక మహిళాపాలకురాలు కావడంవల్ల జీర్ణించుకోలేని అనేకమంది సామంతులు ఆనాడు తిరుగుబాటు చేశారు. ఒక మహిళకు సింహాసనాన్ని ఎలా అప్పగిస్తారంటూ నిరసనలు చేపట్టారు. అదే సమయంలో పాండ్యులు నెల్లూరు ప్రాంతాన్ని, గొంకరాజు మొదటి నరసింహుడు వేంగి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమ ప్రాంతాలను అధీనంలో తీసుకోవడం వల్ల పాకనాటి కాయస్థ అంబదేవుడు, కళింగ నరసింహుని కుమారుడు వీరభానుడు వారికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు. అదే సమయంలో రుద్రమదేవి వారికి మద్దతుగా తన సేనాలతో కలిసి ఆ తిరుగుబాట్లన్నిటినీ విజయవంతంగా అణిచివేసింది.

రుద్రమదేవి ఎదుర్కొన్న దండయాత్రలన్నిటిలో దేవగిరి యాదవరాజుల దండయాత్ర అతి పెద్దది.. ఎంతో కీలకమైనది. ఆనాడు యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లును ముట్టడించాడు. అది తెలుసుకున్న రుద్రమదేవి ఆ యాదవలను ఓడించి.. దేవగిరి దుర్గం వరకూ తరిమి కొట్టింది. వేరేదారి లేని మహదేవుడు సంధికి దిగివచ్చి... యుద్ధ పరిహారంగా మూడుకోట్ల సువర్ణాలు చెల్లించాడు. రుద్రమ తానే స్వయంగా కాయస్త రాజ్యంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. Chandupatla (నల్గొండ) శాసనం ఆధారంగా కాయస్త అంబదేవునితో జరిగిన యుద్ధాలలోనే మరణిచినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈమెకు రాయగజకేసరి, ఘటోదృతి అని బిరుదులున్నాయి.


జీవిత నేపథ్యం :

గణపతిదేవుడు తన కుమర్తె రుద్రమదేవిని నిరవద్యపుర (నిడదవోలు) ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాళుక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె అయిన ముమ్మడమ్మ, మహాదేవుని భార్య. వీరి పుత్రుడే ప్రతాప రుద్రుడు. రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది. ప్రతాపరుద్రునకు అన్నమదేవుడు అనే తమ్ముడు ఉండేవాడని స్థానిక గాథ. బస్తర్ రాజ్య చివరి పాలక వంశంవారు అన్నమదేవుని తమ వంశకర్తగా చెప్పుకున్నారు. రుద్రమదేవి రెండవ కుమార్తె రుయ్యమ్మను ఇందులూరి అన్నలదేవునికిచ్చి వివాహం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : princess rudramadevi  kakatiya kingdom  indian princess  telugu veeravanitha  

Other Articles