Care of working women in offices

working-woman problem, care of women, woman takes care of family, women problems,

Care of working women in offices

అమ్మాయిలున్నారు....జాగ్రత్త

Posted: 06/04/2013 11:56 AM IST
Care of working women in offices

ఆఫీసుల్లో మగవారు ఉన్నారు జాగ్రత్త .. అంటూ ఇంట్లో పెద్దవారు తరుచుగా చెబుతుంటారు. అయితే ఈసారి సీన్ రివర్సయింది. ఆఫీస్లుల్లో ఆడవాళ్లున్నారు .. జాగ్రత్త? అనే మాటలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి ఇదేంటి...ఆడవారితో మగవారికి వచ్చే ప్రమాదమేంటి? ఇంకేముందీ...సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ...చేస్తున్నాడని తోటి మహిళా కొలీగ్‌ నుండి వచ్చే ఆరోపణలు! ఒకవేళ అతని వ్యక్తిత్వం అలాంటిదే అయితే తరువాత వచ్చే పరిణా మాలను చచ్చినట్టు ఎదుర్కోవాల్సిందే. కానీ అది కేవలం ఏ అపార్థమో, మరో రకమైన ప్రతీ కారం కారణంగా వచ్చిన నిందో అయితే మాత్రం....ఆ పురుషుడి పట్ల సానుభూతి చూపాల్సిందే. అలాంటి సందర్భాల్లో ఇరుక్కున్న అమాయక చక్రవర్తుల కోసమే ఈ సూచనలుబాస్‌ స్థానంలోనో, తోటి కొలీగ్‌ స్థాయిలోనో ఉండి మహిళలను వేధించేవారు ఆఫీసుల్లో తరచుగా తారసపడుతూనే ఉంటారు.

అయితే ఒక ఆడా, మగా మధ్య ఎలాంటి విభేదా లున్నా, ఒకరికారణంగా ఒకరు నష్టపోతున్నా, మానసిక వేదనకు గురవుతున్నా ముందుగా దానికి లైంగిక వేధిం పుల ముద్ర పడే అవకాశాలే హెచ్చుగా ఉంటాయి. సాధారణంగా మహిళలు ఎంతటి ఉన్నత హోదాలో ఉన్నా, ఎంతటి ప్రతిభా సామర్ధ్యాలున్నా తాము మహిళల మన్న స్పృహని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోరు. తమ గౌరవాన్ని కాపాడుకోవటం అనేది వారికి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగానే ఉంటుంది. ఇక ఆఫీసుల్లో పరిచయాలు, గంటలకొద్దీ కలిసి పనిచేయడాలు, ఒకే పనిని విభజించుకుని చేయాల్సిన పరిస్థితులు, కలిసి ప్రయాణించడం...ఇలాంటివన్నీ సర్వసాధారణంగా ఉంటాయి.

ఒక వ్యక్తికి తప్పుగా అనిపించని విషయం మరొకరికి తప్పుగా కనిపించే అవకాశాలూ ఉంటాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నపుడు అపార్ధాలూ, అనుకోకుండా జరిగే పరి ణామాలూ సర్వ సాధారణం. ఏది ఏమైనా అక్కడ ఉన్నది ఆడయినా, మగయినా అనవసరంగా నిందా రోపణలకు గురయినపుడు ముందు ఆశ్చర్యం గానూ, తరువాత ఆవేశం, కోపం, భయం, బాధ లాంటి భావోద్వేగాల న్నింటికీ గురవటం మామూలే.

ఇలాంటి సమయంలోనే అనవసరమైన ఆందోళనలకు గురికాకుండా చాలా సంయమనంతో వ్యవహ రించాలంటున్నారు కెరీర్‌ కౌన్సె లర్లు. ఆరోపణ ఎలాంటిదైనా అది రుజువు కాకుండా ఆ వ్యక్తి నేరస్తుడు కాడు. అప్పుడే ఉద్యోగం పోయినట్టుగా, జైలుశిక్ష పడిపోయినట్టుగా కంగారు పడాల్సి న అవసరం లేదు. మరేం చేయాలి..ఒక ప్రముఖ

కెరీర్‌ కోచ్‌ అందిస్తున్న సలహాలు, సూచనలు మీకోసం-

ముందు ఒక దీర్ఘశ్వాస తీసుకుని ఆవేశాన్ని తగ్గించుకుని ఏం జరిగిందో, ఏం జరుతుందో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరు కంప్లయింట్‌ చేశారు? ఏమని ఫిర్యా దు చేశారు? ఏ విషయం గురించి చేశారు? ఆ ఫిర్యాదు మీ ఒక్కరిపైనేనా, అందులో ఇతర సహోద్యోగులెవరైనా ఉన్నారా? కంప్లయింట్‌ రాత పూర్వకంగా వెళ్లిందా? అది కంపెనీ అంత ర్గత వ్యవహారంగా పరిగణించబడుతుందా, లేదా అందులో బలమైన హింసారోపణలు న్నాయా?

  • కంపెనీలో ఇలాంటి నిందా రోపణలు వచ్చినపుడు ఎలాంటి విధానాలు పాటి స్తున్నారో వివరాలు సేకరించండి. సంబం ధిత కంపెనీ పుస్తకాల ను చదవండి. దీనిని ఎవరు విచారిస్తారు, ఎవరెవరు ఈ విషయంలో జోక్యం చేసుకుంటారు. ఈ సమస్య తేలడానికి ఉన్న మార్గాలు, ఎంత కాలం పడుతుంది, దీనిని బహిరంగంగా వెల్లడిస్తారా, రహస్యం గా ఉంచుతారా- తదితర వివరాలు తెలుసుకోవాలి. తరువాత ఈ విషయంలో కంపెనీకి మీనుండి పూర్తి సహకారం అందాలి. కంపెనీ తరపున ఈ వ్యవహారాలు చూసే వ్యక్తితో మీకు వృత్తి పరంగా దగ్గరి సంబంధం ఉంటే ఈ విషయం తేలే వరకు ఆ వ్యక్తితో కలసే అవసరం లేకుండా మీ పనివిధానంలో సవరింపులు చేసుకుంటే మంచిది. అయితే ఈ విషయం మీద న్యాయపరమైన సలహాల కోసం ఆత్రు త పడాల్సిన అవసరం అప్పుడే ఉండ వపోవచ్చు.
  • ఇక ఆ తరువాత ఏం జరిగిందో నిశితంగా ఆలోచించండి. ఏ విభేదాలు, అపా ర్థాలు, పనివి ధానాలు ఇందుకు దారి తీసి ఉంటాయో ఊహిం చండి. తరువాత మీరు చెప్పదలచుకున్నది ఏమిటో వివరంగా పేపరుమీద పెట్టండి. ఎంతవీల యితే అంత వివరంగా పూసగుచ్చినట్టుగా రాయాలి. మీ తప్పులేదని తెలిపే ఆధారాలు ఏమున్నాయో వాటన్నిం టినీ సేకరించండి. రాతపూర్వకంగా ఉన్న నివేదికలు, టెలిఫోన్‌ రికార్డులు, ప్రయాణాలు చేసిన ఆధారాలు లాంటివి ఏవీ వదలకూడదు.
  • కంపెనీ పాలసీని దృష్టి లో ఉంచుకుని మీ బాస్‌తో నూ, ఈ విషయాన్ని విచారిస్తున్న ఇతర అధికారులను కలిసి మీరు చెప్ప దలచుకున్నది మొత్తం చెప్పండి. అలాగే ఇంట్లో వారికి కూ డా పూర్తి వివరాలు తెలియజేయండి. ఒకవేళ ఈ విషయం బయటకు పొక్కి నలుగురిలో ఎదుర్కొనాల్సి వస్తే ఇంట్లో వారి అండ చాలా ముఖ్యం.

ఒకవేళ ఇదంతా కచ్ఛితంగా అపార్థం వల్లనే వచ్చిందనే నమ్మకం ఉంటే ఇద్దరికీ ఆమో దయోగ్యమైన మూడో వ్యక్తి సమక్షంలో మీరు చెప్పదలచుకున్నది ఆరోపణలు చేస్తున్న వ్యక్తికి వినిపించవచ్చు. అవతలి వ్యక్తి యాంగిల్‌ లో కూడా ఆలోచించి చూడండి. విషయాన్నిత క్కువ చేసి నిర్లక్ష్యం మాత్రం చేయకూడదు. ప్రశాంతంగానూ, మాట తూల కుండా ఉండాలి. ఈ అపార్ధంలో ఈ పాత్ర ఉంటే నిజాయితీగా ఒప్పుకోండి. భవిష్య త్తులో మళ్లి ఇలా జరగకుండా ఏం చేయ వచ్చు అనే విష యాన్ని సైతం చర్చించవచ్చు.

 ముందు జాగ్రత్తలూ ముఖ్యమే...

ఒక్క లైంగిక వేధింపులనే కాదు, పని ప్రదేశాల్లో రకరకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు నేడు మరింతగా పెరుగుతున్నాయి. అందుకే కొన్ని ముందు జాగ్రత్తలూ అవసరమే.

వివిధ ప్రాంతాలు, దేశాలనుండి వచ్చినవారూ, భిన్న కులాలు, మతాలు, జాతులకు చెందిన వారు ఒకచోట కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఎవరినీ నొప్పించకుండా పనిచేసుకుకోవటం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన కళ.

  • పని ప్రదేశాల్లో కలిసి పనిచేయటం అత్యవసరం. సమాన స్థాయిలో ఉన్న సహోద్యోగులతో అనుబంధాలు త్వరగా అపార్థాలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ పరిధి, పరిమితులు తెలుసుకుని మసలాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మహిళల విషయంలో...అనుకోకుండా వారి శరీర భాగాలను తాకినట్టుగా అనిపిస్తే- వెంటనే సారీ చెప్పటం మంచిది. ఈ విషయాన్ని మరింత సున్నితంగా తీసుకునే స్త్రీలతో చిక్కులు రావచ్చు.
  • కొన్ని సార్లు మగవారికి సాధారణంగా అనిపించే మాటలు ఆడవారికి ఇబ్బందికరంగా ఉంటాయి. కావాలని తామున్నపుడు అలాంటి మాటలు అన్నాడు- అనే అభిప్రాయం ఏ మహిళకైనా కలిగే ప్రమాదం ఉంది. మహిళలు ఉన్నపుడు మాటలు, బాడీ లాంగ్వేజ్‌ విషయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి.
  • కంపెనీలు కూడా ఈ విషయంలో తమ విధానాలు ఏమిటో చాలా స్పష్టంగా తెలపాలి. వేధింపులకు నిర్వచనాన్ని సరిగ్గా ఇవ్వాలి. వాటి పరిష్కార విధానాలూ కంపెనీ పాలసీల్లో స్పష్టంగా ఉండాలి.
  • చాలా కంపెనీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఏంచేయాలనే విషయంలో ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఉంటాయి. విషయాన్ని నిశితంగా చూడగల పరిజ్ఞానం, నైపుణ్యం గల వ్యక్తుల కొరత ఉంటుంది. కొన్ని సున్నిత అను బంధాల్లో అపార్థాలు వచ్చినపుడు కూడా అవి లైంగిక హింస ముసుగులో ఉండవచ్చు. అందుకే ఏది హింస, ఏది అపార్థం, ఏది గౌరవభంగం లాంటి అంశాలను విడదీసి చూడగలగాలి. ఇలాంటి సమయంలో నిందారోపణ చేసిన వ్యక్తి, అందుకు గురయిన వ్యక్తీ ఇరువురి హక్కులు, స్వేచ్ఛను కాపాడాల్సి ఉంటుంది. అది నిజమైతే ఏంచేయాలి, అబద్దంగా నిరూపితమైతే ఏం చేయాలి- అనే అవగాహన సైతం ఉండాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles