Suryalanka beach bapatla

Suryalanka Beach, Bapatla, AP, India, Guntur District, Andhra Pradesh, Bay of Bengal, Andhra Pradesh Tourism, Haritha Beach Resort, The Air force station

Suryalanka Beach is located 9 km from Bapatla in Guntur District of Andhra Pradesh. It is located 50 km south of Guntur City. Also known as the Bapatla Beach

సూర్యలంక విశేషాలు

Posted: 06/13/2013 04:58 PM IST
Suryalanka beach bapatla

గుంటూరు జిల్లాలోని బాపట్ల నుండి 9 కి.మీ.ల దూరంలో వున్న సముద్రతీర గ్రామమే సూర్యలంక. అత్యంత విశాలంగా పరుచుకుని వున్న సూర్యలంక బీచ్‌... వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవు రోజుల్లోనూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూవుంటుంది. ఇక్కడికి దూరంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వారి ఎయిర్‌బేస్‌ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ వారి రిసార్ట్‌లు ఉన్నాయి. సూర్యలంక తీరం సముద్ర స్నానానికి ఎంతో అనువైంది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నవిగా వస్తుంటాయి. నవంబర్‌ నెలలో తీరం వెంబడి డాల్ఫిన్‌లు కూడా చూడవచ్చు.

సూర్యలంకకి దాదాపు 16 కి.మీ దూరంలో వాడరేవు బీచ్‌ ఉంది. ఇది సముద్రతీరానికి దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరు. ఆంగ్లేయులు పరిపాలించే కాలంలో ఈ ఊరు ఒక వెలుగు వెలిగింది. ఇక్కడ నుంచే సుమత్రా, జావా, ద్వీపాలకు సరుకులు రవాణా చేసేవారు. అప్పటి గోదాములు కొన్ని 1970 వరకు ఉండేవి. ఇప్పుడు మాత్రం ఎక్కవగా బెస్తవారు నివసిస్తున్నారు. సుమారు రెండువేల కుటుంబాలు చేపల వేట మీద ఆధారపడి ఇక్కడ బతుకుతున్నాయి. ఇక్కడే ఇండియన్‌ టుబాకో కంపెనీ (ఐటీసీ) వారిది ఓ అతిథి గృహం కూడా ఉంది. అందులో ఓ ప్రైవేటు బీచ్‌ కూడా ఉంది. అందులో విదేశాలను తలపించే సౌకర్యాలు ఉన్నాయి.

ప్రత్యేకతలు

సూర్యలంక వద్ద నున్న బీచ్‌ సముద్ర స్నానాలకు అనుకూలంగా ఉండి, పరిసర ప్రాంతంలోని ప్రజలకు విహార కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్నిరోజులు గడిపేందుకు వీలుగా ప్రభుత్వ వసతి గృహం కూడా ఉంది. ఈ బీచ్ కి దగ్గర్లోనే భావనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆ ఆలయం దగ్గరున్న రెండు ఎత్తైన లోహ స్తంభాలు ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంపెక్సులోని స్తంభాల్ని గుర్తుకు తెస్తాయి. బాపట్ల పట్టణంలో మరో చూడదగ్గ ప్రదేశ్ టౌన్ మహల్. సుమారు వందేళ్ళ చరిత్ర గల ఈ హాల్లో మహాత్మగాంధీ 1920, 1929లలో రెండుసార్లు ఇందులో ప్రసంగించాడట.  మొత్తంగా చూస్తే సెలవు రోజుల్లో జాలీగా గడపడానికి ఈబీచ్ అనువైన ప్రదేశం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles