Srisailam bhramarambha mallikharjuna swami devasthanam

srisailam mallikarjuna swamy, sri mallikarjuna swamy, mallikarjuna swamy temple, srisailam temple places, lord mallikarjuna, lord shiva and parvati

Srisailam Bhramarambha Mallikharjuna Swami Devasthanam

శ్రీశైల క్షేత్రంలో శివుని రాక గురించి మీకు తెలుసా ???

Posted: 05/11/2013 12:35 PM IST
Srisailam bhramarambha mallikharjuna swami devasthanam

ఈ జగత్తుని శాసించే పరమశివుడు , సృష్టికే మూలం . 'ఇందుగలడందులేడన్న' చందం గా , ఆ పరమశివుడు అన్ని చోట్లా , అన్ని వేళలా , సకల జీవరాసుల్లో కొలువై ఉన్నాడు . ఎన్నెన్నో ప్రదేశాలలో జ్యోతిర్లింగం గా వెలసి , ఆ ప్రదేశాలను పుణ్య క్షేత్రాలుగా మార్చాడు . అందులో ముఖమైనది శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం ... మన ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లలో నల్లమల పర్వతశ్రేణుల సమీపంలో ఈ పుణ్య క్షేత్రం నెలకొంది . మల్లికార్జునుడిగా వెలసిన పరమశివుడిని ఈ పుణ్య క్షేత్రం లో మనం ఎన్నో సార్లు దర్సిన్చుకున్నాం . ఈ రోజు ఈ పుణ్య క్షేత్ర ప్రాముఖ్యతని 'అన్వేషిద్దాం ';

శ్రీశైల మందు దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి . అక్కడ కొలువై ఉన్న మల్లికార్జున స్వామీ సంసార సాగరానికి వారదివంతివాడు. ఈ స్వామిని భక్తి విశ్వాసాలతో పూజిస్తే లభ్యం కానిది ఉండదని నమ్మకం .

మల్లికార్జున జ్యోతిర్లింగము శ్రీ పర్వతమందు ఆవిర్భవించింది . ఈ క్షేత్రము గురించి పురాణాల్లో ఎంతో మహత్తరంగా వివరించారట . శ్రీశైల క్షేత్రమందు అమ్మవారి పేరు భ్రమరాంబికాదేవి .

దేవతల ప్రార్ధన మేరకు , అగస్త్య మహర్షి వింధ్య పర్వతము గర్వము పోగొట్టడానికి కాశి నుండి లోపాముద్ర సమేతముగా శ్రీసైలమును దర్శించారు . క్రుతయుగమున హిరణ్యకశ్యపుడు , త్రేతాయుగమున సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి , ద్వాపరయుగం లో ద్రౌపదీ సమేతముగా పాడవులు , శ్రీశైల క్షేత్రాన్ని దర్శించారని ప్రతీతి . ఇక కలియుగంలో శంకరాచార్యులవారు శ్రీశైల క్షేత్రం లో తపస్సు చేసారు .

ఇక స్థల పురాణం లోకి వెళితే , పార్వతీ పరమేశ్వరులు తన కుమారులు వినాయకునికి కుమారస్వామికి గణాది పత్యం ఇచ్చి వివాహం చేయాలని సంకల్పించారు . వారు పిల్లలను పిలిచి భూప్రదక్షిణ చేసి రామన్నారు . ఎవరు ముందు వస్తే వారికి గాణాధిపత్యంతో పాటు వివాహం చేస్తామని చెప్పిరి .

కుమారా స్వామీ తన వాహనం నెమలి మీద భూప్రదక్షిణకు బయలుదేరాడు .

మరి విఘ్నేస్వరుడేమో , తన భారీ శరీరంతో కదలలేక , తల్లితండ్రులను మించిన దైవము లేదని తలచి , అంతేకాక సృష్టికి మూలాధారమైన పార్వతీ పరమేశ్వరులను మించినడేది లేదని , భక్తీ విస్వాసములతో వీరి చుట్టూ ప్రదక్షిణ చేయ్యసాగాడు .

పార్వతీ పరమేశ్వరులు వినాయకుని నిశిత బుద్ధికి సంతోషించిరి . అందుచేత కుమారస్వామి ఎక్కడకు వెళ్ళినా ముందుగా విఘ్నేశ్వరుడు అతనికి కనిపించాసాగాడు . అందుకు కుమారస్వామి ఆశ్చర్యపోయాడు కూడా .

వినాయకుడు మొట్టమొదట భూప్రదక్షిణ చేసినవాడుగా గుర్తింపబడ్డాడు . తక్షణమే అతనికి గాణాధిపత్యంతో పాటు , సిద్ధి , బుద్ధి అను ఇద్దరు ముద్దుగుమ్మలనిచ్చి వివాహం చేసిరి . ఆ సమయమున కుమారస్వామి బాధపడి అలిగి కైలాసమును వదలి క్రౌంచ పర్వతంపైకి వెళ్ళిపోయాడు .

కుమారస్వామిని వదిలి ఉండలేక పార్వతీమాత అతనిని వెతుకుతూ అక్కడకు వెళ్ళింది . అమెననుసరించి శివుడు వెళ్ళాడు .

ఈ విధంగా శ్రీశైలం వెళ్ళిన పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ , మల్లికార్జునుల పేర్లతో ప్రాచూర్యం చెందారు .

శివుని ఆజ్ఞ్య లేనిదే చీమైనా కుట్టదు అంటారుగా ... మరి మీ సంకల్పం సిద్ధించాలంటే , ఆ శివుని కటాక్షం ఆజ్ఞ్య పొందితే చాలు , అసంభవం అనేది ఉండదు ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles