What is the important significance of kumkum or sindoor

important is kumkum, sindoor, traditional hindu society, married hindu woman, significance of sindoor

what is the Important Significance of Kumkum or Sindoor ?

మన ఉనికిని అన్వేషించే ప్రయత్నం చేద్దామా

Posted: 05/10/2013 03:27 PM IST
What is the important significance of kumkum or sindoor

ఆధునికత పేరుతో , ప్రతీ రోజు మన జీవన శైలి దగ్గరనుండి వేషధారణ వరకు , ఎన్నో మార్పులు చేసుకుంటున్నాం . మంచిదే ... అయితే ఈ క్రమం లో మన ఉనికిని చాటే కుంకుమని మాత్రం పూర్తీ గా మర్చిపోయాం ... సాంప్రదాయంగా తయారయ్యే వారిని, ముద్దుగా 'ఆంటీ' అని కూడా పిలుస్తున్నాం.

అసలు కుంకుమ కి ఉన్న ప్రాధాన్యం ఏంటి ? ఏ విధంగా ఇది మన ఉనికిని చాటుతుంది ??? కుంకుమ బొట్టును లక్ష్మీదేవిగా భావిస్తారు. ముఖాన సిందూరం ఉంటే దృష్టి సోకదని, రోజంతా సాఫీగా సాగిపోతుందని చెప్తారు. నుదుట తిలకం లేకపోతే ముఖం కళ తప్పి బోసిగా ఉండటమే కాదు, మంచిది కాదని పండితులు ఉద్బోధించారు. కనుక కుంకుమ కేవలం సౌందర్య చిహ్నం కాదని, నర దృషి సోకకుండా ఉంటుందని అంటారు.

కుంకుమ లేదా తిలకం ఎర్రగా ఉంటుంది. ఎరుపు సూర్యునికి సంకేతం. నుదుట ధరించే సిందూరం సూర్యుని వేడిమి తాకకుండా చేస్తుంది. ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే, శరీరంలోని అన్ని నాడులనూ కలుపుతూ, మెదడుకు సంకేతస్థానమై, ఎప్పుడూ చైతన్యంగా

ఉండే అతి కీలకమైన "సుషుమ్న" నాడి ఉండేది లలాటం మీదనే. దాన్నే "జ్ఞాననేత్రం" అంటారు. ఈ జ్ఞాననేత్రానికి ఇతరుల దృష్టి సోకకుండా, సూర్యతాపం దానిమీద పడకుండా చేసేందుకు సిందూరం పెట్టుకునే ఆచారం జనించింది. అంటే రక్త ప్రసరణ వల్ల, ఆలోచనల వెల్లువ వల్ల కలిగే వేడి జ్ఞాననేత్రానికి తగలకుండా అది సురక్షితంగా ఉండేందుకు గానూ ఎప్పుడూ కుంకుమ ధరించి ఉండాలి అన్నారు.

స్త్రీలే ఎందుకు సిందూరం ధరించాలి అనే సందేహం కలగడం సహజం. ఆది నుండి ఇప్పటివరకూ పురుషుల ఆధిక్యతే నడుస్తోంది కదా! కనుక ఏ రకంగా నైనా స్త్రీలే ఎక్కువగా వత్తిడికి గురౌతారు. పురుషుల కళ్ళే స్త్రీలమీద పడతాయి, పురుషులే స్త్రీలను లోబరచుకోవాలని చూస్తారు. కనుక మగవారి దృష్టి పడకుండా, ఏ రకమైన వత్తిడికి గురవకుండా ఉండేందుకు మహిళలు నుదుట కుంకుమ ధరిస్తారు.

ముఖాన సిందూరం లేకపోతే అశుభం అని, నుదుట కుంకుమ ధరించిన స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుందని అంటారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు లాంటి శుభకార్యాలకు కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానించడం ఆచారంగా, ఆనవాయితీగా వస్తోంది. ఏ శుభ కార్యానికైనా సిందూరం నాంది. కుంకుమతో ఆహ్వానించడాన్ని శుభ సూచకంగా భావిస్తారు. ఇంట్లో ఏ శుభం జరిగినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు తీర్చిదిద్దుతారు. పెళ్ళిళ్ళు తదితర శుభ లేఖలకు పసుపు కుంకుమలు అద్దుతారు.

ఖరీదైన దుస్తులు లేకపోవచ్చు.. కానీ చిటికెడు కుంకుమ లేని ఇళ్ళు ఉండవు. ఆ కుంకుమే అమూల్యమైంది. అపూర్వ కళను తెచ్చిపెడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles