Death mystery of subhash chandra bose

The death of Netaji Subhash Chandra Bose still remains a mystery. Find more on the death of Subhash Chandra Bose

The death of Netaji Subhash Chandra Bose still remains a mystery. Find more on the death of Subhash Chandra Bose

Death Mystery of Subhash Chandra Bose.png

Posted: 08/20/2012 01:22 PM IST
Death mystery of subhash chandra bose

Death_Mystery_of_bose

boseబోస్‌ చిన్న నాటి నుంచే విద్యారంగంలో రాణించారు. తరువాత జాతీయ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. దేశ స్వాతంత్ర్య పోరాటం లో పాలుపంచుకున్నారు. ఆయన శ్రీ ఆర్యా పత్రికలో సంపాద కుడిగా రాసే వ్యాసాలు స్వాతంత్ర సమరంలో పాల్గొనే వీరులకు ఉత్సాహాన్ని ఏర్పరచాయి. 1919వ సంవ త్సరం తత్వశాస్త్రంలో డిగ్రీని సంపాదించారు. తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్ళి 1920లో ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుడ య్యాడు. 1921వ సంవత్సరం ఐసీ ఎల్‌ను ముగించిన బోస్‌ ఐసీఎల్‌ అధికారిగా బాధ్య తలు వహించకుండా ... స్వాతంత్ర సమరం లో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ సమయంలో పంజాబ్‌లోని అమృత సర్‌లో జలి యన్‌ వాలా బాగ్‌ సంఘటన చోటుచేసుకుంది.

వెల్స్‌ క్యూస్‌ భారత్‌ రాకకు వ్యతిరేకంగా చిత్తరం జన్‌తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్టయ్యారు. ఆ తరువాత 20 సంవత్సరాల్లో 11 సార్లు బ్రిటీష్‌ ప్రభుత్వం అరెస్టు చేసింది. కాంగ్రెస్‌ పార్టీ1929లో లాహోర్‌ లో జరిగిన బహిరంగ సభలో నేతాజీని కాంగ్రెస్‌ కార్మికసంఘ ఆధ్యక్షుడిగా నియమిం చింది. 1938వ సంవ త్సరంలో బోస్‌ 41 ఏట అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మళ్ళీ రెండవ సారి 1939లో జరిగిన ఎన్నికల్లో గాంధీజీ మద్ద తుతో ఎన్నికల బరిలోకి దిగి మన తెలుగువాడు పట్టాభి సీతారామయ్యపై గెలుపొందారు. అయితే అసింసా మార్గం అంగ్లేయులకు అర్థంకాని భాషని తెలుసు కున్న బోస్‌... 1941లో హౌస్‌ అరెస్ట్‌ అయ్యారు. ఆ సమయంలో బ్రిటీష్‌ ప్రభుత్వ కళ్ళ లో మట్టిగొట్టి కలకత్తా నుంచి మాయయ్యారు. అక్కడి నుండి జర్మనీ చేరుకున్నారు.

అక్కడ బోసుకి ఎటువంటి మర్యాద ఇవ్వాలనే విషయం లో జర్మనీ అధికారుల్లో సందిగ్ధత ఏర్పడింది. జర్మనీలో యావత్‌ భారతీయులతో కలిసి స్వతంత్ర భారత కేంద్రా న్ని స్థాపించారు. దీంతో బోసు స్థాపించిన కేంద్రానికి జర్మనీ రాయబార కార్యాల య హోదా ఇచ్చి గౌరవిం చింది. బోస్‌ కార్య కలా పాలకు జర్మనీ ప్రభుత్వం కొంత రుణాన్ని ఇచ్చిం ది. అక్కడ భారత యుద్ధ ఖైదీలను రక్షించేం దుకు బోస్‌ చేసిన ప్రయ త్నాలు తిప్పికొట్టాయి. ఈ లోపుల రెండవ ప్రపంచయుద్ధం మొదల య్యింది. రెండో ప్రపంచయుద్ధం సమ యాన్ని సద్వినియోగం చేసుకుని జర్మన్‌, ఇటలీల సహాయంతో హిట్లర్‌తో చర్చలు జరి పారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. అక్కడి నుంచి బయట పడటానికి జర్మనీకి చెందిన ఓ జలంతర్గా మిని ఉపయోగించుకున్నారు.

bose-familyజర్మనీలోని ఓ జలాంతర్గామిలో 90 రోజులు ప్రయాణించి ఆఫ్రికాను ప్రదక్షి ణం చేసి హిందూ మహాసముద్రం మీదుగా జపాన్‌ చేరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నావికా చరిత్రలో సుభాష్‌ చేసిన ఈ బెర్లిన్‌ టు టోక్యో సాహస యాత్ర అనేక విధాలా చారిత్రాత్మకమైనదే. మహాసముద్రాలను దాటి మొత్తం 26వేల కిలోమీటర్ల దూరం రావటానికి బోసుకు 18వారాల సమయం పట్టింది.ఆయుధాలతో యుద్ధాన్ని ప్రారంభించదలచిన బోస్‌ 1943వ సంవత్సరం జనరల్‌ మోహన్‌సిం గ్‌ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్‌, మలేషి యాల్లోని భారత జాతీయ సైనిక దళానికి జీవం పోశారు. 1943లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌)కి సర్వసైన్యాధిపతిగా నాయకత్వం వహించారు.

1944వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీ బర్మా రాజధాని రాంకూస్‌ నుంచి భారత్‌ సరిహద్దులకు భారత్‌ సైన్యం ప్రయాణమైంది. భారత్‌ జాతీయ సైనిక దళ దాడుల ధాటిని తట్టుకోలేక బ్రిటీష్‌ సైన్యం కుదేలయింది. సరిగ్గా రెండేళ్ల తర్వాత నేతాజీకి దేశాభిమానాన్ని ఆలవరిచిన శ్రీ అరవిం దర్‌ పుట్టిన రోజైన ఆగస్టు 15వ తేదీన భారత్‌కు స్వతంత్య్రం లభించింది. 1945వ సంవత్సరం ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరిం చిన జపాన్‌ సైనిక దళాలు బ్రిటీష్‌ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 1945 ఆగస్టు 22న నేతాజీ పయనించిన యుద్ధ విమానం ఫార్మోసా దీవుల్లో ప్రమాదానికి గురైందని జపాన్‌ రేడియో ప్రకటించింది. ఈ ప్రకటనను ఇంతవరకూ ఎవరూ ధృవీకరించలేదు. నేతాజీ మరణం నేటికీ అనుమానాస్పదంగానే ఉంది.

బోస్‌ వివాహం

జర్మనీలో ఉన్నప్పుడు సుభాష్‌ ఎమిలీ షంకెల్‌ అనే యువతిని ప్రేమించి పెల్లి చేసుకున్నాడు. ఆశయ పథంలో ఆమె సుభాష్‌కు సహచరే. తాను జర్మనీ చేరుకున్న సమయంలో ఎమిలీనే బోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేది. వారి ప్రేమ పెళ్ళికిదారితీసింది. అక్కడ వారికి ఓ పాప జన్మించింది ఆమెకి అనిత అని పేరు పెట్టారు. తన యుద్ధ బాటలో వారు అడ్డుకాకూడదని వారిని తన సోదరుడివద్దకు చేర్చాలని నిర్ణ యించుకున్నారు బోస్‌. జర్మనీ నుంచి బయలుదేరే ముందు తనకు సంబంధించిన రహస్య సమాచా రాన్ని కాల్చేశారు సుభాష్‌ చంద్రబోస్‌.

bose-wifeబోస్‌ మరణంపై వాస్తవాలు వైరుధ్యాలు

బోసు విమాన ప్రమాదంలో చనిపోయారని వార్తలు ఉన్నా... ఆ తరువాత కూడా ఆయన కనిపించారని వార్తలు, కీలక ఆధారాలు ఉన్నాయి. 1945 ఆగస్టు 18న తైవాన్‌ సమీపంలో టైహోకూలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారని గతంలో భారత ప్రభుత్వం తెలి పింది. కానీ, తైవాన్‌ ప్రభుత్వం ఎలాంటి విమాన ప్రమాదం జరగలేదని నిర్థారించింది. మరోవైపు నేతాజీ అస్థికలు టోక్యోలోని రెంకోజీ దేవాలయంలో ఉంచినట్లు నేతాజీ సన్నిహితుడు కల్నల్‌ హబిబుర్‌ రహమాన్‌ తెలిపారు. కానీ అవి బోస్‌వి కావని నేతాజీ భార్య ఎమిలి షెంకెల్‌ చివరి వరకూ విశ్వసించారు. 1980లో అయోధ్య సమీపంలో గుమ్‌నామ్‌బాబా అనే సాధువు రూపంలో నేతాజీ తిరుగుతున్నాడని అనుకునేవారు. ఓ వైపు అస్తికలు, అయోధ్య ప్రాంతంలో తిరిగిన సమయంలో దాచిన వస్తువులు మిస్టరీగానే ఉంది.మరో కథనంలో నేతాజీ కొంతకాలం జపాన్‌లో ఉన్నారని, ఆ తరువాత రష్యాకు ఖైదీగా వెళ్లారనే ఆధారాలు ఉన్నట్లు కొందరు చెబుతున్నారు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రష్యాకు భారత రాయబారులుగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌, విజయలక్ష్మీ పండిట్‌లు పనిచేశారు. వీరు ఇరువురికీ నేతాజీ రష్యాలో జీవించి ఉన్నారన్న విషయాలు తెలిసినప్పటికీ వారి నోళ్లను నెహ్రూ మూయించారనే అనుమానం ప్రచారంలో ఉంది. దీనికీ బ్రిటీష్‌ మీడియా ఆధారాలు చూపించింది. 1964 మే 28న నెహ్రూ అంత్యక్రియలకు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ హాజరైనట్లు ఫొటోలు, వీడియోలు ఆధారం. నెహ్రూ అంత్యక్రియల డాక్యుమెంటరీ ఫిలిం నెం.816బిగా ఉంది. దాన్ని ఆ తరువాత సమాచార ప్రసారాల శాఖ నిషేదించింది. మే 29న నేతాజీ హాజరైన ఫొటోలు ఇటు భారత్‌, బ్రిటీష్‌ మీడియా ప్రముఖంగా ప్రచురించింది.నేతాజీ స్వామీజీ అవతారంలో వచ్చి ఆయనకు నివాళులర్పించి సంతాప సందేశం పుస్తకంలో నెహ్రూ గురించి రాశారు. నెహ్రూ మరణించే నాటికి నేతాజీ వయస్సు 67 సంవత్సరాలు. ఆయన స్వామీజీ రూపంలో వచ్చిన విషయం తెలిసినా, నేతాజీ మృతిపై మూడు కమిషన్లు నియమించినా ఇంకా ఆయన మరణ రహ స్యం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇటీవల మరణించిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ కూడా నేతాజీ విమాన ప్రమా దంలో మరణించలేదని అనేక సార్లు మీడియాకు చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవం ఏది?

బోస్‌ మారు పేర్లు

సుభాష్‌ చంద్రబోస్‌ ఎక్కడికి అక్కడ మారువేషం, మారుపేర్లే. ఇండియా నుంచి జర్మనీకి చేరుకోవడానికి అనేక దేశాల సరిహద్దుల నుండి వెళ్ళారు. ఆయా సమయాలను అనుసరించి పేర్లు మార్చుకునేవారు. జర్మనీలో ఆయన పేరు ఒర్లాండో మజొట్టా. అక్కడ ఇటాలియన్‌ రాయబారి బోస్‌. ఆఫ్ఖన్‌ సరిహద్దుల్లో ప్రవేశిస్తున్నప్పుడు బోస్‌ కాబూలీ వేషంలోకి మారారు. పెషావర్‌లో ట్రైన్‌ నుంచి తప్పించు కున్నప్పుడు అతడి పేరు మహమ్మద్‌ జియా ఉద్దీన్‌. ఆ సమయంలో అతడొక మాల్వీ ఆకారంలో ఉన్న ఇన్సూరెన్స్‌ ఏజంట్‌. కలకత్తాలో అతిని పేరు సుభాష్‌ చంద్రబోస్‌. ఆజాద్‌ హింద్‌ సైనిక శ్రేణులకి విప్లవ నాయకుడు నేతాజీ.

ప్రొఫైల్

జననం          : 23.01.1897
మరణం          : నిర్థారణ కాలేదు
జన్మస్థలం       : కటక్‌, ఒరిస్సా
తల్లిదండ్రులు    : జానకీనాథ్‌ బోస్‌, ప్రభావతీదేవి
సోదర,సోదరీమణులు : 14మంది (బోస్‌ 9వ సంతానం)
భార్య            :  ఎమిలీ షెంకల్‌
సంతానం        : అనితా బోస్‌ ఫాప్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  American space legend neil armstrong
Brunei kampong air water village  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles