పార్లమెంటులో ఇటీవల కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ సందర్భంగా టీమిండియా విజాయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. టీమిండియా కుర్రాళ్ల విజయదాహానికి అస్ట్రేలియా సిరీస్ విజయం ఓ నిదర్శనమని దాని గురించి ప్రస్తావించారు. అయితే తాజాగా వచ్చిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రకటించిన ప్రజాస్వామ్య సూచీలో భారత ర్యాంకు దిగిపోవడానికి సంకేతమేమిటో కూడా అమె పార్లమెంటులో చెబుతారా.. లేక మీడియా ముఖంగా దేశ ప్రజలకు చెబుతారా.? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
భారత్ దేశంలో ఎన్డీయే ప్రభుత్వం దేశ పౌరుల కోసం అనేక సరికొత్త విధానాలను అవలంభిస్తూ అనేక మార్పులు తీసుకువచ్చిందని నిత్యం గోప్పలు చెప్పే కేంద్రమంత్రులు, బీజేపి సహా ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల నేతలు.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా బాసిల్లుతున్న భారత్ లో ప్రజాస్వామ్య సూచీ ఎందుకు తగ్గిందో చెప్పగలరా.? గడచిన 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఏ ప్రభుత్వం చేయలేని పనులు సాధించామని బీరాలు పోతున్న నేతలు.. క్రమక్రమంగా దేశంలో దేశపౌరులకు ప్రజాస్వామ్యం కల్పించిన స్వేచ్ఛ కూడా హరించుకుపోతున్నదన్న విషయం అసలు తెలుసా.?
అధికారంలో వుంటూ అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్న అధికార పక్షం నేతలకు.. గ్రామీణ ప్రజల నుంచి నానాటికీ హరించుకుపోతున్న స్వేఛ్ఛా స్వతంత్రాల గురించి..ఏం తెలుస్తుందన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. 2014లో 7.92 పాయింట్ల స్కోరుతో ప్రపంచంలోనే 27వ స్థానంలో ఉన్న భారత్ కేవలం ఏడేళ్ల కాలంలో ఎందుకు 53వ స్థానానికి దిగజారిందన్న వివరణను బీజేపి పెద్దలు కానీ.. కేంద్రప్రభుత్వ అధికారులు కానీ.. కనీసం కేంద్రమంత్రులైనా వివరించగలరా.? అసలు ఈ అంశంపైన వారు అసలు దృష్టి సారించారా.?.
ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పార్లమెంటులో తొలిసారిగా అడుగుపెడుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ శిరస్పు నేలకు తాకించి మరీ మొక్కారు. అయితే అదే దేవాలయంలో కోలువైన దేవుడు దేశవ్యాప్తంగా ప్రజలల్లో వుంటాడన్న విషయం కూడా ఆయనకు తెలియంది కాదు. ప్రజల సుఖసంతోషాల్లో.. ప్రజాస్వామ్య దేవాలయానికి కొత్త వెలుగులు వస్తాయని, అదే వారు కష్టనష్టాల్లో ఉంటే అందుకు వ్యతిరేక ఫలితాలు వుంటాయన్న విషయం కూడా తెలుసు. అన్ని తెలిసిన పెద్దలు ఇప్పటికే దిగజారిన ప్రజాస్వామ్య సూచిని ఇకనైనా మెరుగుపరుస్తారో.? లేదో వేచిచూడాల్సిందే.!
(And get your daily news straight to your inbox)
Feb 04 | తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు జోరందుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, మంత్రులు ఇక తమ తదుపరి నేత ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక... Read more
Feb 03 | ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేది పత్రిక.. వారి తరపున వాకాల్లా పుచ్చుకుని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వాడే పత్రికా ప్రతినిధి. ఈ విషయం తెలిసినా నీళ్లు వదిలేసిన కొందరు మీడియా పెద్దలు ప్రభుత్వాల తరపున... Read more
Feb 03 | మరో నాలుగు మాసాల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో అక్కడ కూడా బలంగా పావులు కదపాలని గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపి నాయకత్వం.. ఎన్నికల బాధ్యతను మాత్రం తెలంగాణ నుంచి... Read more
Feb 02 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల కోసం తామెంతో చేస్తున్నామని పై ఓ వైపు బడాయిలు చెబుతూనే మరోవైపు వారితో లడాయికి సిద్దమైందా.? అంటే ఔననే చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతుల పక్షపాతి అని..... Read more
Feb 02 | 2016 నవంబర్ అందరికీ గుర్తుండిపోయే నెల. అందులోనూ ఇక ప్రత్యేకంగా 8వ తేదీ అనగానే దానిని తలుచుకుని బాధపడే కుటుంబాలు అనేకం. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఆర్థిక ఎమర్జెన్సీగా పేర్కోనాల్సిన రోజు అది.... Read more