Which holds upper hand in TRS seniority or inheritance ఉద్యమ పార్టీలో పైచేయి నాయకత్వనిదా.? వారసత్వానిదా.?

Seniority vs inheritance which holds upper hand in trs party for cm race

Etela Rajender, Cheruku Sudhakar, BC Leadership, SC candidate, TRS, KCR, Kalvakuntla ChandraShekar Rao, KTR, KT RamaRao, CM Candidate, Harish Rao, Koppula Eshwar, Telangana Movement, telangana inti party, Telangana, Politics

As TRS suppoters and Ministers praising that KTR has capability to become Cheif Minister of Telangana and news comming out all the steps are being taken in this regard, questions from different sectors arasie which hold the upper hand in the TRS party, weather its Seniority or Inheritance.

ఉద్యమ పార్టీలో పైచేయి నాయకత్వనిదా.? వారసత్వానిదా.?

Posted: 02/04/2021 06:38 PM IST
Seniority vs inheritance which holds upper hand in trs party for cm race

తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు జోరందుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, మంత్రులు ఇక తమ తదుపరి నేత ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక రామారావేనని అంటున్నారు. ఈ క్రమంలో పలువురు మంత్రులు ఏకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు అన్ని అర్హతలు వున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గోనేందుకు ఆయన అమెరికాలోని తన ఉన్నత ఉద్యోగాన్ని వదిలివచ్చారని అంటున్నారు. ఇక రాష్ట్ర మంత్రిగా గత ఏడేళ్ల కాలంలోనూ ఆయన తన శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని కితాబిస్తున్నారు. దీంతో ఆయనకు సీఎం పగ్గాలను అప్పగించడంలో తప్పేమీ లేదని టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న కేసీఆర్.. అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలను తన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించేలా చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా నగరంలో నడిరోడ్డుపై కూర్చోని నిరసనలు చేపట్టి ఉద్యమంలో పాల్గోన్నారు. తమ పదవులను తృణప్రాయాలుగా వదులుకున్న కొండా సురేఖ లాంటి కాంగ్రెస్ నేతలు వున్నారు. సీనియర్ల నుంచి అందరూ తమ స్థాయిలో తెలంగాణ కోసం పోరాడారు. పార్టీలు.. జెండాలను పక్కనబెట్టి మరీ.. తమందరి అజెండా ఒక్కటేనని.. అదే తెలంగాణ రాష్ట్ర సాధన అని చాటి.. సాధించారు.

అయితే ఉద్యమంలో ఎంతో మంది సమిధలుగా మారారు. మరెందరో అమరువీరులయ్యారు. శ్రీకాంత్ చారి సహా యాదగిరి వరకు ఎందరెందరో తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ ప్రజలను మరింత ఉద్దృతంగా ఉద్యమించేలా చేశారు. ఎందరో విద్యార్థులు పోలీసుల లాఠీల దెబ్బలు తిన్నారు. ఎందరెందరో యువకులు జైళ్లకు వెళ్లారు. అలె నరేంద్ర, విజయశాంతి. గద్దర, ఇన్నారెడ్డి, విమలక్క సహా ఎందరెందరో నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఎందరో ఉద్యోగులు జీతాలను, ఉద్యోగాలను కూడా కోల్పోయారు. అర్టీసీ కార్మికుల నుచి ఆటో డ్రైవర్ల వరకు సకల జన సమ్మెలో పాల్గోని తెలంగాణ ఆకాంక్షను బలంగా కేంద్రంలోని యూపీఏకు వినిపించి.. రాష్ట్రాన్ని సాధించారు.

అయితే ఇది అంత్యదశ. రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎన్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఆకాంక్ష. కానీ కేసీఆర్ టీడీపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన నాటి నుంచి వైఎస్ మరణం వరకు సాగిన మలిదశ ఉద్యమ ఆరంభంలో టీఆర్ఎస్ పార్టీని... కేసీఆర్ ను నమ్మి ఆయన వెంట నడిచిన నాయుకులు కొందరే. అలాగని కార్యకర్తలు.. పార్టీ శ్రేణుల సంఖ్య తక్కువేం కాదు. ఆయన పార్టీ స్థాపన తరువాత రాష్ట్రంలో వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో తెలంగాణలో తన ఉనికి చాటుకుంది టీఆర్ఎస్ పార్టీ. ఇది ఇక్కడి ప్రజల్లో నిగూఢంగా వున్న తెలంగాణ అకాంక్షకు నిదర్శనం. తొలి దశ పోరాటంలో అణివేతకు గురికాబడిన తెలంగాణ గొంతులు.. ఒక్కసారిగా పైకి లేచి మలిదశ రాజకీయ ఉద్యమానికి పిడికిలి బిగించాయి.

కొందరు నేతలలో హరీశ్ రావు, ఈటెల రాజేందర్, జగదీశ్ రెడ్డి, కోప్పుల ఈశ్వర్, ఇలా వేళ్ల మీద లెక్కబెటుకునే నేతలు మాత్రమే. ఈ క్రమంలో ఆయనతో నడిచి మధ్యలో వీడిన నేతలు కూడా లేకపోలేదు. జగ్గారెడ్డి, శారారాణి, మందాడి సత్యనారాయణ, బాబురావు, సంతోష్ రెడ్డి, లింగయ్య, ముకుంద్ రెడ్డిలు కేసీఆర్ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ హయాంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి వీడిపోయారు. అయితే అప్పటి టీఆర్ఎస్ మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీలో వారు చేరారు. ఇక మరికోందరు నేతలపై టీఆర్ఎస్ అధిష్టానమే వేటు చేసింది. తమ అదేశాలను పక్కనబెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో తాము నిర్ధేశించిన సభ్యులకు కాకుండా ఇతరులకు ఓటు వేశారని అప్పటి కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, సిర్ పూర్ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఎనుగు రవిందర్ రెడ్డీలపై వేటు వేసింది.  

ఇలా ఉద్యమపార్టీకి అన్ని తామై తెలంగాణ నేతలు ప్రజలు ముందకు నడిపిస్తున్న క్రమంలో ఉద్యమంలోకి వచ్చారు కేసీఆర్ తనయుడు. ఆ వెంటనే మరో పంథాతో ఉద్యమంలోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన తనయ కవిత. విదేశాలలో ఉద్యోగాలను వదులుకుని వచ్చారని ఆయనకు సిరిసిల్ల నుంచి బరిలోకి దింపి టీడీపీ మద్దతుతో ఎమ్మెల్యేను చేయడంలో విజయం సాధించిన కేసీఆర్.. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రంలోనూ పలు కీలక మంత్రిత్వ శాఖలను ఇచ్చి మంత్రివర్యులను చేశారు టీఆర్ఎస్ అధినేత. ఇక అంతర్గత పవర్ పాలిటిక్స్ లోనూ ఇటు హరీశ్ రావు, అటు ఈటెలతో పాటు అది నుంచి ఉన్న పలువురు నేతలను వెనక్కు తోస్తూ ముందకుసాగారు.

ఈ క్రమంలో కేసీఆర్ గజ్వెల్ ఫామ్ హౌజ్ లోనూ ఈ అంశంమై కేసీఆర్ నిర్వహించిన అత్యంత రహస్య సమావేశంలో హరీశ్ రావును రాష్ట్ర రాజకీయాలలో పెద్దగా జోక్యం చేసుకోవద్దని, ఆయను కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం కావాల్సిందిగా అదేశించారు పార్టీ పెద్దలు. కొండా లక్ష్మణ్ బాపూజీ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో పార్టీని అవిర్భవించిన నాటి నుంచి.. తన మామ కేసీఆర్ పార్టీ స్థాపించిన మరుక్షణంలో వచ్చిన ఉప ఎన్నికల నుంచి జెండాలు మోస్తూ.. ఆ తరువాత వచ్చిన ఎంపీటీసీ, జడ్సీటీసీ ఎన్నికలలోనూ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని బాధ్యతలను తనపై వేసుకుని చూసుకున్న హరీశ్ రావు పార్టీలో కేసీఆర్ తరువాత అంతటి సీనియర్ నేత. కేసీఆర్ తరువాత ఆ పదవికి నిజంగా అర్హులైన టీఆర్ఎస్ నేత హరీశ్ రావు.

నగరంలోని తెలంగాణ భవన్ అనువనువూ తెలిసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. అయితే కేటీఆర్ ను సీఎం పదవిలో కూర్చోబెట్టడంలో రాని ఇబ్బందులు హరీశ్ రావును కూర్చోబెడితే వస్తాయని ఎవరూ మాత్రం అనగలరు. ఆయనను కూడా కేసీఆర్ కుటుంబవ్యక్తిగా పరిగణించే పక్షంలో ఆయన తరువాత అంతటి సీనియార్టీ, ప్రజాకర్షణ, కార్యదీక్ష, చిత్తశుద్ది వున్న నేత ఈటెల. ఇలా మరికొందరు సీనియర్ నేతలు కూడా ఉద్యమ పార్టీలో అవిర్భవం నుంచి కొనసాగిన వారు వున్నారు. అయితే ఇప్పుడు వీరందరినీ విస్మరించి.. ఉద్యమ పార్టీలో కల్వకుంట్ల తారాక రామారావుకు ఎందుకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు.. అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓ వైపు బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరోవైపు తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ లతో ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లోనూ ఇలాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

కేసీఆర్.. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తే.. పార్టీలోని సీనియర్ నేతలతో సమావేశమై వారి నిర్ణయం మేరకు అడుగులు వేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంక్ష నేపథ్యంలో ఉద్యమ పార్టీగా అవిర్భించిన పార్టీని.. రాష్ట్ర సాకారం కావడంతో దళితుడ్ని ముఖ్యమంత్రి చేసి.. తాను కాపాలాదారుగా వుంటానన్న కేసీఆర్.. అప్పుడు తప్పిన మాటను కనీసం ఇప్పుడు నిలబెట్టుకోవాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఈటెల రాజేందర్ లాంటి బీసి నేతనో లేక అది నుంచి ఉద్యమబాటలో నడిచిన కోప్పుల ఈశ్వర్ లాంటీ సీనియర్లను సీఎం పీఠంపై కూర్చోబెట్టి.. పార్టీ పగ్గాలను మాత్రం కేటీఆర్ కు అందించాలన్న వినతులు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cheruku Sudhakar  Etela Rajender  Harish Rao  BC Leadership  TRS  KCR  KTR  telangana  trs  telangana inti party  Telangana  Politics  

Other Articles