Atchannaidu as AP party Chief.? అచ్చన్నకు కండీషనల్ బెయిల్

Tdp in dilema on appointing mla atchannaidu as state party chief

Atchannaidu, TDP Senior leader atchanna, former minister atchanna, ESI Scam, Tekkali, TDP president, AP TDP president, Kala Venkat Rao, AP High Court, Srikakulam, andhra pradesh, Politics, crime

Former minister and TDP MLA Atchannaidu, who was arrested in the ESI scam is on bail. Now there are rumours that he is appointed as party chief for the state. But the Party is in Dilema as he is facing ESI Scam case.

అచ్చన్నాయుడికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలపై టీడీపీ మల్లగుల్లాలు.?

Posted: 09/04/2020 11:15 PM IST
Tdp in dilema on appointing mla atchannaidu as state party chief

మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చన్నాయుడుకు మరో పదవి దక్కనుందా.? అంటే అవుననే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీలో జోరుగా వినబడుతున్నాయి, అచ్చన్నాయుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అందించాలని ఇప్పటికే ఆయన సహచరులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారని, అయితే అందుకు అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిందన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే నిజంగా ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటుయా.? అని పార్టీ వర్గాల్లో గుసగుసలు కూడా వినబడుతున్నాయి.  

పార్టీ అధికారంలో వున్నా తాము మంత్రులం కాలేకపోయామని, కనీసం నామినేటెడ్ పదవులు కూడా తమకు దక్కలేదని, ఇప్పుడు పార్టీ పదవులు కూడా దక్కే అవకాశం లేదని కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానంపై రుసరుసలు అడుతున్నారని  తెలుస్తోంది, పార్టీ కోసం అహర్నిషలు కష్టపడిన తమకు ఏ పదవులు దక్కకపోయినా తాము ఇన్నాళ్లు పార్టీ ఏజెండాను ముందుకు తీసుకెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని బలపేతం చేశామని.. ఇప్పుడు కూడా పార్టీ తమను గుర్తించకుండా అధికారంలో వుండగా మంత్రి పదవులను ఇచ్చిన వారికే పార్టీ పదవులను కూడా అంటగడితే.. తమ పరిస్థితి ఏంటని.. ఈ విషయంలో పునరాలోచించుకోవాలని కూడా పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కోని అరెస్టయిన అచ్చెన్నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే.. పరోక్షంగా అధికార పార్టీకి తమను విమర్శించే హక్కును కూడా కల్పించినట్టే అవుతుందని మరికొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి, రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదాలో ఆయనను పెడితే అటు పార్టీ తో పాటు అచెన్నాయుడ్ని కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. దీంతో ఆయననకు పార్టీ పగ్గాలను అందించేముందు అధిష్టానం ఈ విషయాలపై కూడా అలోచించాలని అంటున్నారు, ఇక ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండలస్థాయి వరకు పూర్తిచేసిన టీడీపీ.. ఇప్పుడు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ కమిటీలను, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అలాగే, రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తిచేస్తారని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles