ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆఘమేఘాల మీద మద్యం రేట్లను తగ్గిస్తూ, పెంచుతూ సవరణలు చేపట్టిన విషయం తెలిసిందే. ఉన్నపళంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం చెబుతున్న కారణాలు ఏవైనా.. వాటితో పాటు తెరవెనుక మరో బలమైన కారణం వుందన్నది కాదనలేని వాస్తవం. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్న హామీలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అంచెలవారీగా సంపూర్ణ మధ్య నిషేధం కూడా విధిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్న హామీలను నెరవేర్చుతూనే.. మద్య నిషేధంపై కూడా పలు చర్యలు తీసుకున్నారు.
అందులో భాగంగా మద్యం అమ్మకాల సాగించే దుకాణాలకు లైసెన్సులు జారీ చేసేందుకు వేలం ప్రక్రియను చేపట్టకుండా.. అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఇక ఈ దుకాణాల నిర్వహణ ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాది కల్పించామని కూడా చెప్పుకుంది. ఇక దీనికి తోడు రాష్ట్రంలో ఉన్న మద్యం దుకాణాల సంఖ్యను కూడా గణనీయంగా తగ్గించివేసింది. మండలానికి రెండు మేర ఉన్న దుకాణలను ఒక్కటి అర మేర కుదించింది. ఇక ప్రతీ గ్రామంలో తిష్ట వేసిన బెల్టు షాపులకు పూర్తి స్థాయిలో మంగళం పాడేసింది. ఈ క్రమంలో గ్రామల్లో ఎక్కడపడితే అక్కడ కనిపించే మద్యం బెల్టు షాపుల జాడ అసలు కనిపించకుండానే పోయింది. మండల కేంద్రాల్లో, పట్టణాలు, నగరాల్లో మాత్రమే మద్యం దుకాణాలు దర్శనమిస్తున్నాయి.
అయితే మద్యానికి అలవాటుపడిన గ్రామస్థులను దాని నుంచి తప్పించినట్టు.. ఇక పట్టణాలలోనూ మద్య నిషేధాన్ని అమలు చేఃసేందుకు మద్యం ధరలను ఏకంగా రెండెంతల మేర పెంచేసింది. ఈ విషయంపై మద్యం బాబులు ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్చిలో విధించిన లాక్ డౌన్ నుంచి మద్యం దుకాణాలు మూసివేయడంతో.. మద్యం బాబులు సానిటైజర్లు తాగి ఒంగోలులో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి, అయితే ఇదే విషయాన్ని పేర్కోన్న ప్రభుత్వం రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరిచింది. కాగా, మద్యం దుకాణాలను తెరచిన వెంటనే రెండు పర్యాయాలు మద్యం ధరలను పెంచింది. దీంతో ఏకంగా మద్యం ధర యాభై శాతం పైగానే పెరిగింది.
కాగా, దుకాణాలు తెరచిన ఆనందంలో ధరల విషయం మరిచిన మద్యం బాబులు.. సుమారు డెబై రోజలు మద్యానికి దూరం కావడంతో కొనుగోళ్ల కోసం వెంపర్లాడారు. ఇక నిషా దిగిన వెంటనే తమ మద్యం ధర ఎంత మేర పెరిగిందన్న విషయం తమ జేబుల్లోని డబ్బులు చూసుకున్న తరువాత కానీ తెలియరాలేదు. అయినా ఓ వైపు ప్రభుత్వాన్ని ఇందుకు నిందిస్తూనే మద్యం మాత్రం తాగేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో వున్న మద్యం బ్రాండ్లు కూడా ఎప్పుడూ, ఎక్కడా చూడనివి, విననివని పేర్కోంటూనే మద్యాన్ని తాగేస్తున్నారు. ఇదే అదనుగా భావించిన మద్యం మాఫియా ఏకంగా రాష్ట్రంలోకి బ్రాండెడ్ మద్యాన్ని ఇతర రాష్ట్రాల నుంచి దింపు అదే ధరకు సోమ్ము చేసుకుంటోంది. దీంతో మద్యం మాఫియాపై కూడా నిఘా నేత్రాలు పనిచేసినా.. అప్పడప్పుడు పోలీసుల ప్రాణాలపైకి కూడా వస్తోంది.
ఈ క్రమంలో మద్యం మాఫియాకు చెక్ పెట్టే ఏర్పాట్లు చేస్తుండగానే వారికి అసరాగా నిలిచింది ఓ జీవో. ఏపీ రాష్ట్రవాసులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిన క్రమంలో ఆక్కడి నుంచి అక్రమంగా మద్యం తీసుకురావద్దని పోలీసులు చెక్ పాయింట్లు పెట్టి మరీ తనిఖీలు చస్తుండగా, రాష్ట్రోన్నత న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన తీర్పు రాష్ట్రప్రభుత్వానికి శరాఘాతంలా పరణమించింది. రాష్ట హైకోర్టు ఇటీవల ఈ మేరకు తీర్పును వెలువరిస్తూ.., ఆ జీవో నేపథ్యంలో తమ ఆంక్షలు పనిచేయవని తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది, అసలే అదాయం అంతంతమాత్రంగా వున్న రాష్ట్రం నుంచి మద్యం రూపంలో వచ్చే ఆదాయంలో బీటాలు వారి ఇతర రాష్ట్రాలు దాన్ని తన్నుకుపోకముందే మద్యం ధరలను తగ్గిస్తూ సవరణలు చేసింది.
అసలే ఏపీకి ఇటు హైదరాబాద్, అటు తమిళనాడు, మరోవైపు చత్తీస్ గడ్, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు వుండగా, అయా రాష్ట్రాల్లో బ్రాండెండ్ మద్యం.. తక్కువ ధరకే లభించడంతో ఇక ఆయాల రాష్ట్రాల ప్రజలు అధికంగా అటు చెన్నై, బెంగళూరుతో పాటు ఇటు హైదరాబాద్ నగరాలకు పనులపై నిత్యం తిరుగుతూనే వుంటారు. దీంతో మద్యం తాగని వారు కూడా ఇక్కడ నుంచి మద్యం బాటిళ్లు కొనుక్కుని కొంత అధిక ధరకు రాష్ట్రంలో విక్రయాలు చేసి దానిని సోమ్ము చేసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇన్నాళ్లు దొడ్డిదారిన అక్రమంగా రవాణాకు పాల్పడిన మద్యం మాఫియా కూడా ఇదే జీవోను అడ్డుగా పెట్టుకుని మద్యం అక్రమ రవాణాకు కూడా తెరలేపవచ్చునని భావించిన ప్రభుత్వం మధ్యం ధరలను సవరిస్తూ చర్యలు తీసుకుందని గుసగసలు వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Feb 05 | పార్లమెంటులో ఇటీవల కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆ సందర్భంగా టీమిండియా విజాయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. టీమిండియా కుర్రాళ్ల విజయదాహానికి అస్ట్రేలియా సిరీస్ విజయం ఓ నిదర్శనమని దాని గురించి... Read more
Feb 04 | తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు జోరందుకున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతలు, మంత్రులు ఇక తమ తదుపరి నేత ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అలియాస్ కల్వకుంట్ల తారక... Read more
Feb 03 | ప్రజల సమస్యలను ఎలుగెత్తి చాటేది పత్రిక.. వారి తరపున వాకాల్లా పుచ్చుకుని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వాడే పత్రికా ప్రతినిధి. ఈ విషయం తెలిసినా నీళ్లు వదిలేసిన కొందరు మీడియా పెద్దలు ప్రభుత్వాల తరపున... Read more
Feb 03 | మరో నాలుగు మాసాల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగునున్న నేపథ్యంలో అక్కడ కూడా బలంగా పావులు కదపాలని గత నాలుగేళ్లుగా ఎన్నో ప్రయత్నాలు చేసిన బీజేపి నాయకత్వం.. ఎన్నికల బాధ్యతను మాత్రం తెలంగాణ నుంచి... Read more
Feb 02 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల కోసం తామెంతో చేస్తున్నామని పై ఓ వైపు బడాయిలు చెబుతూనే మరోవైపు వారితో లడాయికి సిద్దమైందా.? అంటే ఔననే చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతుల పక్షపాతి అని..... Read more