prathipati pulla rao all set to join ysrcp party వైసీపీ పార్టీలోకి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.?

Prathipati pulla rao all set to join ysrcp party amid cases and it raids

Prathipati Pulla Rao to join YSRCP, Former Minister prathipati pulla rao, TDP Senior leader Prathipati Pulla Rao, Ruling party YSRCP, Prathipati Pulla Rao, YSRCP, TDP, Prathipati Sarath, Avexa Corporation, IT Raids, Insider Trading, Amaravthi, lands, andrha pradesh, politics

Former minister and senior TDP Leader Prathipati Pulla Rao all set to join the present ruling party YSRCP party amid cases and it raids fear against him and his son companies. After facing the heat from the leading party and facing the pressure.

వైసీపీ పార్టీలోకి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.?

Posted: 06/13/2020 04:58 PM IST
Prathipati pulla rao all set to join ysrcp party amid cases and it raids

మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నాయకుడు పత్తిపాటి పుల్లారావు త్వరలో టీడీపీ పార్టీకి షాకివ్వనున్నారా.? అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలానే కనబడుతున్నాయి. గుంటూరు జిల్లా నుంచి టీడీపీకి పార్టీ తరపున మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆయన తనయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ వద్ద కూడా ప్రతిపాటికి మంచి నమ్మకమే ఉంది. అయినా ఆయన ఈ తరుణంలో పార్టీ మారడానికి గల కారణమేంటి.?

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వున్నా ప్రత్యర్థి పార్టీని దెబ్బ కొట్టాలన్నదే వారి ప్రథమ లక్ష్యంగా మారుతోంది. అయితే ప్రతిపక్షంలో వున్నప్పుడు కొంత భిన్నంగా వ్యవహరించిన ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ.. అధికారంలోకి వచ్చి రాగానే అదే పంథాను కొనసాగిస్తోంది. అయితే శాసనసభకు ప్రాతినిథ్యం వహించే వారితో ఒకలా.. ఓటమి చెందిన నేతలతో మరోలా వ్యవహరిస్తూ.. ప్రజలకు తామంటే ఏంటో అర్థంకానీ ఒరవడిలో పయనిస్తోంది. అయితే ప్రజలు మాత్రం అన్ని తెలిసినా.. ఐదేళ్ల వరకు ఆగి అప్పుడు వచ్చే అవకాశం కోసం ఎదురుచూడటం తప్ప మధ్యలో ఎవరెంత చెబితే అంత.. అంతే అంతే అన్న పంథాను కొనసాగిస్తారన్నది తెలిసిన విషయమే.

గత ఏడాది ఏపీ శాసనసభకు జరిగిన ఎన్నికలలో అధికార వైసీపీ పార్టీకి వీచిన గాలి మామాలుగా లేదు. ఏకంగా రాష్ట్ర శాసనసభలోని 175 స్థానాల్లో 153 స్థానాలను గెలుచుకుని తమ సత్తా ఏంటో నిరూపించుకుంది. అయితే వరుస పరాజయాల తరువాత అందివచ్చిన విజయం నేపథ్యంలో గర్వంతో కాక అచితూచి అడుగులు వేస్తూ.. ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టే విషయంపై కూడా ఇప్పట్నించే మేధోమథనం సాగిస్తోంది. ఇందులో భాగంగా తమ గాలి వీచిన క్రమంలోనూ సత్తా చాటుకున్న ప్రత్యర్థి పార్టీ నేతలను తమ పార్టీలో కలుపుకునేందుకు పావులు కదుపుతోంది. అందుకు అవసరమైతే సామ, దాన, బేధ, దండోపాయాలను కూడా వినియోగిస్తోందని తెలుస్తోంది.

వీరితో పాటు పరాజయం పాలైన ప్రజాబలం వున్న ప్రత్యర్థి పార్టీ నేతలను కూడా ఎంచుకుని ప్రత్యర్థి పార్టీకి ఎన్ని రకాలుగా చెక్ పెట్టవచ్చో.. అన్ని రకాలుగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే.. ప్రత్యర్థి పార్టీలకు అందులోనూ టీడీపీ పార్టీకి కొలుకోలేని విధంగా దెబ్బకొట్టవచ్చో.. అన్ని రకాలుగా అస్త్రాలను, శస్త్రాలను సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ సునామీ నేపథ్యంలో కేవలం రెండు వందల ఓట్ల మెజారిటీతో పరాజయం పాలైన ప్రత్తిపాటి పుల్లారావును వైసీపీ టార్గెట్ చేసిందని, ఆయనను తమ పార్టీలోకి రప్పించేందుకు తెరవెనుక అస్త్రశస్త్రాలు సిద్దం చేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం అధికార పార్టీ అధికారాన్ని కూడా వినియోగించిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటికే శిద్దా రాఘవరావును తమ పార్టీలోకి కలుపుకున్న వైసీపీ.. త్వరలోనే ప్రత్తిపాటి భుజంపై కూడా తమ కండువాను కప్పేందుకు రంగం సిద్దం చేస్తోందని రాజకీయవర్గాల టాక్జ్. అయితే ఇందుకోసం తెరవెనుక పెద్దఎత్తున కథ నడిచిందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రత్తిపాటి పుల్లారావు మంత్రిహయాంతో పాటు అంతకుముందు కూడా కొనుగోలు చేసిన ఏపీ రాజధాని అమరావతి భూముల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఇస్ సైడర్ ట్రేడింగ్ పేరిట తెల్ల రేషన్ కార్డుదారులు కొన్న భూములకు భినామీ ఓనర్లుగా మాజీ మంత్రి నారాయణతో పాటు ప్రతిపాటి పుల్లారావులను తేల్చింది. ఇందుకు సంబంధించిన కేసులు గత కొంతకాలంగా మౌఖిక అదేశాలతోనే సీఐడితో సైడ్ ట్రాక్ చేయించిన ప్రభుత్వం.. ఆ తరువాత నేతలను టార్గెట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పటికే ప్రత్తిపాటిని టార్గెట్ చేసిన ప్రభుత్వం ఆయన తనయుడు ప్రత్తిపాటి శరత్ హైదరాబాద్ బంజారాహిల్స్ లో నిర్వహిస్తున్న ఎవెక్సా కార్పోరేషన్ ను కూడా టార్గెట్ చేసింది. ఈ సంస్థ మాటున అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని ఆదాయపన్ను శాఖకు లేఖ రాసింది. దీంతో ఐటీ అధికారుల సంస్థపై ఈ ఏడాది ఫిబ్రవరి 6,7 తేదీల్లో దాడులు కూడా చేశారు. ఇక ఇదే సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసులపై కూడా ప్రభుత్వం కదపాలని చూస్తోంది. దీంతో ఈ కేసుల నుంచి బయటపడేందుకు తాను అధికార పార్టీలో చేరడం ఒక్కటే మార్గమని తలచిన ప్రత్తిపాటి ఈ మేరకు నిర్ణయం తీసుకునేలా ఒత్తిడిని తీసుకుంచ్చింది. అయితే వైసీపీ గేమ్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యి త్వరలోనే ప్రత్తిపాటి టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖతో షాకిస్తారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles