Kim Jong-un appears in public amid health rumors ప్రజల ముందుకొచ్చినా.. కిమ్ విషయంలో తెరపడని అనుమానాలు.?

N korea s kim jong un appears in public amid health rumours

Pyongyang, Korean Central News Agency, Rodong Sinmun, coronavirus, covid-19, global rumors, North Korea, Politics

North Korean leader Kim Jong Un made his first public appearance in 20 days as he celebrated the completion of a fertilizer factory near Pyongyang, state media said Saturday, ending an absence that had triggered global rumors that he may be seriously ill.

ప్రజల ముందుకొచ్చినా.. కిమ్ విషయంలో తెరపడని అనుమానాలు.?

Posted: 05/02/2020 01:31 PM IST
N korea s kim jong un appears in public amid health rumours

ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతిపై ప్రపంచదేశాల మీడియాకు అనుమానాలు వీడటం లేదు. పలు దేశాల మీడియా ఆయన అరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మరణించాడంటూ ఓ వీడియో కూడా నెట్టింట్లో చక్కర్లు కోట్టింది. అయితే వీటిని తీవ్రంగా ఖండించిన ఉత్తర కొరియా ఆయన ప్రజల ముందుకు వచ్చిన ఫోటోలను, వీడియోలను కూడా ప్రసారం చేసింది. అయినా కిమ్ పై పలు దేశాల మీడియాకు నెలకొన్న అనుమానాల్లో కించింత్ ప్రభావాన్ని కూడా చూపలేకపోతున్నాయి.

ప్రజల మద్యలోకి వచ్చినా.. మూడు వారాలుగా వస్తున్న వార్తలకు తెరపడుతుందని బావించగా.. అందుకు విరుద్దంగానే ప్రచారం జరుగుతోంది. కిమ్ ఏప్రిల్‌ 11 నుంచి అధికారిక కార్యక్రమాల్లో కనిపించకపోయే సరికి ఆయన ఆరోగ్యంపై రకరకాల అనుమానాలు రేకెత్తాయి. కోమాలోకి వెళ్లిపోయాడని అందువల్లే ఏప్రిల్‌ 15న కిమ్‌ తన తాత 108వ జయంతి కార్యక్రమానికి హాజరు కాలేదంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ అపోహలన్నింటికీ తెరదించుతూ కిమ్‌ ప్రజల ముందుకు వచ్చినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా కేసీఎన్‌ఏ వెల్లడించింది. ఇదే అసలు అనుమానాలకు కారణమవుతోంది.

అదెలా అంటే.. రాజధాని ప్యాంగ్యాంగ్‌ సమీపంలోని సన్ చాన్‌ ప్రాంతంలో ఓ ఎరువుల కంపెనీ ప్రారంభోత్సవ వేడక కార్యక్రమానికి కిమ్‌ హాజరైనట్లు కేసీఎన్‌ఏ తెలిపింది. ఈ వేడుకలకు కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా హాజరైనట్లు పేర్కొంది. ఇంతవరకు బాగానే వున్నా.. ఈ కార్యక్రమానికి ఉత్తర కొరియా అధికారిక మీడియా మినహాయించి ఇతర పాత్రికేయులు హాజరయ్యేందుకు అనుమతిని ఇవ్వలేదు. దీంతో కేసీఎన్‌ఏ ప్రచురించిన కథనాన్ని, విడుదల చేసిన ఫొటోలను అంతర్జాతీయ మీడియా సంస్థలు ధ్రువీకరించలేకపోయాయి.

దీంతో కిమ్‌ ఆరోగ్యంపై విభిన్న వార్తలు వస్తునే వున్నాయి. దీంతో ప్రజల ముందుకువచ్చిన తరువాత కూడా కిమ్ అరోగ్యం విషయంపై ఇంకా అనుమానాలు వెన్నాడుతూనే వున్నాయి. ఇక ఈ విషయాన్ని అటుంచితే.. కిమ్ అరోగ్యం నేపథ్యంలో చైనా కూడా ఒక వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఉత్తరకొరియా పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న అగ్రరాజ్యం అమెరికా కూడా ఓ కన్నువేసింది. కిమ్‌ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా పేర్కొన్నడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles