lv subramanyam transferred due to Tadikonda Sridevi ఎమ్మెల్యేపై నివేదికే ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎసరు తెచ్చిందా.?

Former chief secretary lv subramanyam transferred due to tatikonda sridevi

AP CM YS Jagan, YSRCP, Jagan Mohan Reddy, President, Ramnath Kovind, Undavalli MLA, Tadikonda Sridevi, Vinayaka chaturdi celebrations, SC caste, Christain, PM Modi, Andhra Pradesh, Politics

Rumours doing rounds that Andhra pradesh former chief secretary LV Subramanyam was forced to give a report on YSRCP MLA Tadikonda Sridevi stating that she is not a christain. LV refused to do so as the report is orders by the President of India.

ఎమ్మెల్యేపై నివేదికే ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఎసరు తెచ్చిందా.?

Posted: 11/06/2019 05:25 PM IST
Former chief secretary lv subramanyam transferred due to tatikonda sridevi

రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఏరి కొరి తెచ్చుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం పదవి నుంచి ఆకస్మికంగా బదిలీకీ గురికావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ కు జారీ చేసిన షోకాజ్ నోటీసులే ఇందుకు దారితీశాయా.? అన్న అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో అతను కాదని.. దీనంతటికీ కారణం తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవియేనన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి.

తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొన్న జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఉండవల్లి శ్రీదేవి.. గెలిచి గెలవగానే వచ్చిన గణేష్ ఉత్సవాల సందర్భంగా అమెకు పలు చోట్ల పరాభవం ఎదురైంది. టీడీపీ వర్గానికి, ఎమ్మెల్యే శ్రీదేవికి మధ్య వివాదం జరిగింది. తాడికొండ నియోజకవర్గంలోని అనంతవరంలో గణేష్ మండపానికి వచ్చిన ఆమెను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు. తుల్లూరు మండలంలో జరిగిన గణేష్ మండపంలో ఇదే విధంగా వ్యతిరేకించారు. మాజీ సీఎం వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నేరుగా వచ్చిన ఆమెను టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకించి, తిప్పి పంపించారు.

దళితురాలు కాబట్టే తనను గణేష్ మండపానికి రానివ్వడం లేదని అప్పట్లో ఆమె ఆరోపించారు. దీనిపై ఆగ్రహించిన ఆమె తుల్లూరు పోలీసులకు నలుగురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేసింది. జాతీయ ఎస్సీ కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయడంతో రాజకీయమైంది. ఈ విషయమై సీఎం జగన్ కు వివరించారు. ఏపీ డీజీపీని కలిసి కేసును విచారించాలని కోరింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న టీడీపీ నాయకత్వం జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రపతి కు ఫిర్యాదు చేసింది.

శ్రీదేవి హిందువు కాదని, క్రిస్టియన్ అని ఆధారాలతో సహా ఫిర్యాదు సమర్పించింది. దీనిపై వివరాలు అందచేయాల్సిందిగా కొద్ది రోజుల క్రితం రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఏపీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యానికి నోటీసులు వచ్చాయి. శ్రీదేవి క్రిస్టియన్ కాదు, హిందువేనంటూ నిర్ధారించి నివేదిక పంపించాల్సిందిగా సీఎం జగన్ కార్యాలయం సుబ్రహ్మణ్యం మీద ఒత్తిడి తెచ్చింది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి నోటీసులు వచ్చాయని, వాస్తవ నివేదిక పంపించాల్సిన బాధ్యత తనపై ఉందంటూ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

ఒత్తిడి చేసినా తాను ఆ పని చేయలేను అని తేల్చిచెప్పడంతో సీఎం కార్యాలయం.. అతడ్ని బదిలీ చేసిందని తెలుస్తోంది. తమ మాట విననప్పుడు.. క్రీయాశీలకమైన పదవిలో కొనసాగి లాభం ఏంటని భావించిన సీఎం కార్యాలయం ఆయనపై ఆఘమేఘాల మీద బదిలీ వేటు వేశారు. రాష్ట్రపతి కార్యాలయానికి వాస్తవ నివేదిక వెళ్తే ప్రమాదముందనే భావనతోనే తప్పించారంటున్నారు. శ్రీదేవిపై కులం ఆధారంగా వేటు పడితే, అది ఒక్కరితోనే ఆగిపోదని అంటున్నారు. చాలా మంది ఎస్సీ ఎమ్మెల్యేలు తమ పదవులు కోల్పోవడం, ఉప ఎన్నికలు జరగడం ఖాయం. ఎస్సీలు మతం మారితే బీసీలు అవుతారనేది జనంలోకి బలంగా వెళ్తుంది. అయితే కేంద్రం ఈ విషయాన్ని అంత సలువుగా వదిలే పరిస్థితులు లేవని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles