Does RBI blames Indian citizens for cash crunch..? ఆ డాటాతో ప్రజలను బద్నామ్ చేస్తున్న అర్బీఐ.?

Does rbi blames indian citizens for cash crunch

cash crunch, RBI, Rama Rao, panjagutta, dlf, bank ATM, Axis Bank ATM, Reserve Bank of India (RBI), Demonetisation, Notes ban, currency shortage, cash shortage, currency circulation, ATMs cash crunch, Indian citizens, middle class people, black money, business man

Reserve Bank of India which in last week said lack of currency printing paper leads to cash crunch, has taken U turn and blames indian citizens for cash crunch with new released data.

ఇళ్లలో డబ్బు పెట్టుకుని ఏటీయంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతారా.?

Posted: 04/26/2018 04:36 PM IST
Does rbi blames indian citizens for cash crunch

2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు చేసి అవినీతికి, బ్లాక్ మనీకి చరమగీతం పాడమని. దీంతో పాటు ఉగ్రవాద చర్యలకు అందే సహాయాన్ని కూడా అడ్డుకున్నామని కేంద్రప్రభుత్వం చెప్పుకుంటున్నా.. ఇది అనితర సాధ్యమైన సాహసోపేత నిర్ణయమని, ప్రధానిని బీజేపి నేతలు కీర్తిస్తున్నా.. నోట్ల రద్దు జరిగిన 19 నెలల తరువాత కూడా పరిస్థితుల్లో మార్పు మాత్రం రావడం లేదన్నది వాస్తవం. ప్రజలు ఇప్పటికే నోట్ల రద్దు కష్టాలను వాడవాడలా వున్న ఏటీయం కేంద్రాలు గుర్తుచేస్తూనే వున్నాయి. అది చాలదన్నట్లు బ్యాంకులు కూడా అనాటి పరిస్థితులు ఉత్పన్నం చేసేట్లు నగదు విత్ డ్రాలకు అంక్షలను పెడుతున్నాయి. ప్రభుత్వం చెప్పుకుంటున్న గోప్పలు కూడా ఆచరణలో సాధ్యం కాకపోగా.. దేశ ప్రజలు మాత్రం ఏటీయం కేంద్రాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.

ఇక కేంద్రం చెప్పుకున్నట్లు భారత దేశాన్ని కరెన్సీ రహిత దేశంగా మారుస్తామని చెప్పినా.. అది ఆచరణలో సాధ్యమయ్యే పనికాదు. ఇక పైపెచ్చు.. డిజిటల్ మనీ, క్యాస్ లెస్ ట్రాన్సాక్షన్స్ అంటూ ఊదరగొట్టిన కేంద్రం.. ఆ దిశగా నోట్ల రద్దు తొలినాళ్లలో తీసుకున్న చర్యలు.. కల్పించిన ప్రోత్సాహకాలు.. క్రమంగా తొలగించింది. దీంతో పరిస్థితి మళ్లీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర అర్థిక శాఖ మంత్రి కరెన్సీ కష్టాలు ఎక్కడా లేవని వ్యాఖ్యలు చేయగా, అర్బీఐ మాత్రం తొలుత నోట్లు ముద్రించే పేపర్ కొరత వల్ల ఈ కొరత ఏర్పడించదని మరో వారం రోజుల వ్యవధిలో అన్ని సర్థుకుంటాయని చెప్పింది.

ఇంతవరకు బాగానే వున్నా ఇక్కడే వుంది అసలు తిరకాసు. తన వ్యాఖ్యల నుంచి యూ-టార్న్ తీసుకున్న భారతీయ రిజర్వు బ్యాంకు.. తాజాగా ఈ కష్టాలకు దేశ పౌరులే కారణమంటూ కరెన్సీ కష్టాల కారణాలను ప్రజలపైనే నెట్టింది. అందుకుగాను తాజాగా విడుదల చేసిన గణంకాలను అధారాలుగా చూపే ప్రయత్నం చేసింది. ఏప్రిల్ మాసంలో ఏకంగా 59.52 వేల కోట్ల రూపాయల నగదును తాము బ్యాంకులకు పంపగా, అదంతా విత్ డ్రా అయ్యిందని పేర్కోంది. ప్రజలు ఇంకా పాత పద్దతుల్లో డబ్బును ఇళ్లలో నిల్వచేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని తన నివేదికలో అర్బీఐ ప్రస్తావించింది.

* ప్రజల అవసరాల మేరకు డబ్బును ఏటీయం కేంద్రాలు, బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకోవడం కూడా తప్పేనా.?
* ప్రజల అవసరాలకు అనుగూణంగా నోట్లను ముద్రించడం, వాటని సకాలంలో బ్యాంకులకు పంపడం అర్బీఐ బాధ్యత కాదా.?
* ఇక ఏప్రిల్ లోని మూడు వారాల్లోనే ఇంత డబ్బును ప్రజలు ఇళ్లలో నిల్వ పెట్టుకున్నారంటే.. ప్రజల వద్ద ఎంతో డబ్బుందని అర్బీఐ అర్థమా.?
* ప్రజల వద్ద డబ్బు పెట్టుకుని వారు పనిమాల ఏటీయం కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని అర్థమా..?
* అసలు ఎన్ని రూ. రెండు వేల నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చారు.. వాటిలో ఎన్ని బ్యాంకులకు వస్తున్నాయి.? ఎన్ని నల్లకుబేరుల కబంధహస్తాల్లోకి వెళ్లాయి.?
* ప్రజల అవసరాల కోసమే తీసుకువచ్చిన కరెన్సీ నోట్లను.. వారు ఒకటో రెండు దాచిపెట్టగలరు కానీ.. అంతా ఎలా సాధ్యం.?
* మధ్యతరగతి ప్రజలకు ఏ ప్రభుత్వాలు ఏమీ చేయకున్నా.. అన్నింటికీ వారి టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం.?

ఇప్పటికైనా అర్బీఐ దేశ ప్రజలను మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ.. చేసిన వ్యాఖ్యలపై పునరాలోచన చేయాల్సి వుంది. మధ్య తరగతి వారిని నిందించడం కన్నా నల్లకుబేరుల వద్ద కొత్తగా వచ్చిన పెద్ద కరెన్సీ రూ.2000 నోట్లను తిరిగి చెలామణిలోకి తీసుకువచ్చే ఉపాయాలను అలోచించడం అత్యంత అవసరమన్న సూచనలు తెరపైకి వస్తున్నాయి. కరెన్సీ పేపర్ నిల్వ లేదన చెప్పిన అర్బీఐ.. తాజాగా వెల్లడించిన గణంకాలు మాత్రం దేశ ప్రజలను వారి డబ్బును కూడా వాడు వినియోగించుకోకుండా చర్యలు తీసుకుంటున్నాయన్న అపర్థాలు వ్యాప్తి చెందేలా చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles