Rajan in the race for Bank of England governor రఘురామ్ రాజన్ కు కీలక బాధ్యతలు.?

Raghuram rajan as a candidate for top post at bank of england

raghuram rajan, Bank of England, UK, Reserve Bank of India, RBI, central bank, Philip Hammond

London-based Financial Times has listed Raghuram Rajan, former governor of the Reserve Bank of India, as one of the candidates who could be considered for the top job at the Bank of England.

మరోమారు కీలక బాధ్యతలు చేపట్టనున్న రాజన్.?

Posted: 04/23/2018 05:54 PM IST
Raghuram rajan as a candidate for top post at bank of england

భారత అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తన శాయశక్తులా కృషి చేసిన భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్ చేతికి మరో కీలకమైన పదవి అందబోతుందా..? అయన మరోమారు సెంట్రల్ బ్యాంకు బాధ్యతలు చేపట్టే అవకాశాలు వున్నాయా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. అవునండీ అయితే అది మాత్రం మన దేశంలోనే లేక అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం కాదట.

అర్బీఐ గవర్నర్ గా రఘురామ్ రాజన్ పదవి పోడగింపు విషయంలో ప్రధానికి కీలక విషయాల్లో మౌత్ పీస్ గా మారారని విమర్శలు ఎదుర్కోన్న బీజేపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన రాద్దాంతం.. ఆ పిమ్మట కేంద్రం చేసిన తాత్సరంతో తాను ఇక అర్బీఐ గవర్నర్ గా కొనసాగనని తనకుతానుగా వెల్లడించి వెళ్లిపోయిన రాజన్.. ఏకంగా బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్' గవర్నర్ రేసులో వున్నారని సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ప్రస్తుత గవర్నర్ మార్క్ కార్నే పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి గవర్నర్ కోసం యూకే ప్రభుత్వం కొందరు ప్రముఖ ఆర్థికవేత్తల పేర్లను పరిశీలిస్తోంది.

యూకే ట్రెజరీ ఛాన్సెలర్ ఫిలిప్ హామండ్ ఇప్పటికే గవర్నర్ ఎంపిక ప్రక్రియను ప్రారంభించినట్టు సమాచారం. రేసులో మొత్తం ఆరుగురు ఉన్నారని... వీరిలో రాజన్ ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. 2013లో ఆర్బీఐ గవర్నర్ గా రాజన్ బాధ్యతలను స్వీకరించారు. 2014లో ఐఎంఎఫ్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ, తిరస్కరించారు. ఆర్బీఐ గవర్నర్ గా 2016లో పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నాక... అమెరికాలోని ఓ యూనివర్శిటీలో ఆయన ప్రొఫెసర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raghuram rajan  Bank of England  UK  Reserve Bank of India  RBI  central bank  Philip Hammond  

Other Articles