ration shops to turn as money vending shops.? ’’డబ్బు వితరణ కేంద్రాలుగా చౌకధర దుకాణాలు..?’’

Ration shops to turn as money vending shops in telangana

ration shops, fair price shops, bpl, below poverty line, money vending shops, essential commondities, TRS Govt, Telangana

ration shopsm the shops meant to give the eligible people the essential commondities such as sugar, kerosene, rice, pulses on fair prices.. to turn as money vending shops in Telangana.?

’’డబ్బు వితరణ కేంద్రాలుగా చౌకధర దుకాణాలు..?’’

Posted: 10/27/2017 02:53 PM IST
Ration shops to turn as money vending shops in telangana

చౌక ధరల దుకాణాలు తమ ఉనికిని కోల్పోనున్నాయా..? ఈ దుకాణాల ఏర్పాటు వెనుకనున్న సదుద్దేశ్యాన్ని మర్చిపోయిన నేతలు ఖాజానా ఖాళీ అవ్వకుండా.. కాసింత డబ్బులతో గలగలలాడాలని భావిస్తున్నాయా..? చౌకధర దుకాణాలు తమ పేరును త్వరలోనే మార్చుకోనున్నాయా..? ఇటు నిరుద్యోగ యవతకు ఉపాధి అటు పేద ప్రజలకు నిత్యావసర సరుకులను చౌక ధరలకే అందించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడిన దుకాణాలు ఇక తమ ఉనికిని కోల్పుతున్నాయా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి.

ఇక దేశవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలకు నగదు బదిలీ పథకం విస్తరిస్తున్న వేళ, రేషన్ లబ్దిదారులకూ ఇదే పథకాన్ని వర్తింపజేయాలని కేంద్రం భావిస్తున్న క్రమంలో ఈ అలోచనతో ముందుకు సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా జోడుకడుతుంది. బియ్యానికి డబ్బు అంటూ ఒక్కదానినే చూపే ప్రభుత్వం ఇతరాత్ర నిత్యావసర సరుకులకు దాని పేరుతోనే మంగళం పాడనుంది. ఇప్పటికే చక్కర పంఫిణీని చౌకధర దుకాణాల్లో నిలపేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బియ్యాన్ని నగదు బదిలీకి బదిలీ చేసి.. చౌకధరలపై ఇచ్చే ఇతరాత్ర సరుకులకు కూడా ముగింపు పలకనుందా..? అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.  

గత ఎన్నికలకు ముందు రేషన్ దుకాణ డీలర్లతో సమావేశమైన సందర్భంలో వారికి ఎన్నికల హామీలను గుప్పించిన కేసీఆర్ సర్కార్.. వాటిని నిలబెట్టుకోవాలని డీలర్లు డిమాండ్ చేస్తున్న క్రమంలో వారి ఉనికినే దెబ్బతీసే యత్నాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు. రేషన్ డీలర్లలో అత్యధికంగా కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు వున్న నేపథ్యంలో వారికి ప్రధాన అదాయవనరుగా నిలిచిన రేషన్ దుకాణాలను పూర్తిగా రద్దు చేసి.. వినియోగదారుల బ్యాంకు అకౌంట్లకు ఆ డబ్బును పంపితే చాలునన్న భావనకు కేసీఆర్ సర్కార్ వచ్చినట్లుంది.

రేషన్ దుకాణాల్లో ఇస్తున్న బియ్యం పక్కదారి పడుతుందని వివిధ వర్గాల నుంచి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఇక వాటికి బదులుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బునే జమ చేస్తే ఎలా వుంటుందన్న యోచన చేస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగరంలోని అర్హులైన వారందరి ఇళ్లకు వెళ్లి సర్వే చేసిన సర్కారు అధికారులు.. ప్రభుత్వానికి తమ నివేదిక కూడా ఇచ్చినట్లు తెలిపారు. ఇడ్లీ, దోశలు వేసుకునేందుకు తప్ప, తినడానికి అత్యధికులు మొగ్గు చూపడం లేదని ఈ బియ్యాన్ని పది లెక్కన దుకాణాలకు అమ్మి సొమ్ముచేసుకుంటున్న వారూ కూడా వున్నారని అధికారులు తేల్చారు.

ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, చండీగఢ్, దాద్రానగర్ హవేలీల్లో ఇప్పటికే రేషన్ బియ్యం స్థానంలో నగదు బదిలీ అమలు చేస్తున్నారు. ఇదే పథకాన్ని అమలు చేయాలని కేంద్రం గతంలోనే తెలంగాణ సర్కారుకు లేఖ రాయగా, ఈ పథకం ఓటు బ్యాంకుతో ముడిపడి వుండటంతో ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. అయితే లోతుగా అధ్యయనం చేసిన తరువాత.. దీనిపై అధికారులతో సర్వే చేయించింది తెలంగాణ ప్రభుత్వం. కిలో బియ్యానికి రూ. 26.66 చోప్పున డబ్బు ఇస్తే ప్రతీ మనిషికి నెలకు రూ. 160గా ఇవ్వాలని కూడా నిర్ణయానికి వచ్చింది. ఈ డబ్బులను వారి అకౌంట్లలోకి జమ చేసి.. వాటిని తమ ఘనతగా అటు బీజేపి ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వాలు చెప్పుకుని ప్రజల మెప్పుపోందాలని చూస్తున్నాయి.

అయితే ఇదే కనక జరిగితే యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆహారభద్రతా బిల్లుకు చిల్లు పడినట్లే. ఇవాళ మార్కెట్లో రూ.30 కిలో బియ్యం లభ్యమవుతున్నాయా అదే ధర కాస్త రూ.50 లేదా 60కి చేరకుంటే.. అప్పుడు కూడా కేంద్రం ప్రజలకు రూ.26.66 లేక్కనే కట్టిస్తే.. అహార భద్రతా చట్టం అమలుకు నోచుకోకుండా దేశ ప్రజలలో పేదలందరూ అర్థాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అయ్యే ప్రమాదముంది.  అలా కాకుండా కేంద్రం ఏ పదో, పరకో డబ్బును పెంచినా.. వాటితో రోజుకు రెండు పూటలా చేయాల్సిన బోజనం రోజుకో పూటగానే మారిపోయే అవకాశముంది.

నగదు బదిలీ సముచితమే కానీ రేషన్ దుకాణాల్లో లభించే నిత్యావసర సరుకులకు మాత్రం డబ్బులు ప్రత్యామ్నాయం కాదన్న వాదన ప్రజల నుంచి కూడా బలంగా వినబడుతుంది. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు సుదూర లక్ష్యాలను ఎంచుకుని వాటికి అనుగూణంగా పనిచేయాలే తప్ప.. ఖజానాకు అదనపు భారం పడుతుందని అలోచనలో పడితే మాత్రం ఇక ప్రజలకు చేకూరాల్సిన మేలు ఎలా చేకూరుతుందన్న వాదన కూడా తెరపైకి వస్తుంది. కిలో బియ్యానికి రూ.26.66 ఇచ్చే ప్రభుత్వం.. లీటరు వంటనూనేకు, ప్యాకెట్ అప్పడాలకు, కిలో చక్కరకు, ఒక్కో సబ్బుకు, కిలో పప్పుకు, కిలో గోధుమలకు ఇలా అన్నింటికీ కలపి ఎంతెంత ఇస్తాయన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

రావాణా చర్జాలను తగ్గించుకునేందుకేనా..?

కేసీఆర్ సూచించినట్టుగా రేషన్ బియ్యం బదులుగా నగదును లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ఖజానాలకు భారీ మొత్తంలో డబ్బు మిగులుతుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. వాస్తవానికి బియ్యం కొనుగోలు నుంచి దాన్ని రేషన్ షాపులకు చేర్చడం వరకూ కలిపి, చౌక ధరల దుకాణాల వ్యవస్థ నిర్వహణకు రూ. 5,954.25 కోట్ల వ్యయం అవుతుంది. ఇక రాష్ట్రంలోని రేషన్ లబ్దిదారులను లెక్కించి ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం చొప్పున నగదు జమ చేయాలంటే ఏకంగా వందల కోట్లు రూపాయలు మిగులుతుంది.

నగదు బదిలీ పథకంతో ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 5,270 కోట్ల భారం పంచుకోవాలి. ఇందులో కేంద్రం వాటా రూ. 3,487.45 కోట్లు కాగా, రాష్ట్రం వాటా 2,466.90 కోట్లు. ఈ పథకం అమలు చేస్తే, బియ్యాన్ని కొనడం నుంచి రేషన్ షాపులకు తరలించేంత వరకూ పెడుతున్న రూ. 683.72 కోట్లు మిగులుతాయని అధికారులు లెక్క తేల్చారు. ఇక పథకం అమలుకు బ్యాంకు ఖాతాల అనుసంధానమే కీలకమని, దానికి కనీసం 9 నెలల సమయం పడుతుందని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సూచించినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles