Arnab Channel Special Story on YCP-BJP-Merger | ఆర్నాబ్ ఛానెల్ జగన్ పై చెప్పింది నిజమేనా?

Bjp ysrcp merger in discussions

YSRCP BJP Merge, YSRCP NDA Partner, AP Politics, Andhra Pradesh Politics, Arnab Goswami YS Jagan, Arnab Goswami BJP, Arnab Goswami Republic TV, Republic TV YRSCP BJP, BJP NDA YSRCP, AP Politics Republic TV, NDA Alliance YSRCP Confirm

Arnab Goswami's Republic TV channel, hints YSRCP and BJP Merge. YS Jagan Mohan Reddy is keen to join hands with the saffron party and G Janardhan Reddy of Bharatiya Janata Party is holding the mediation talks between two parties.

ఎన్టీయేలోకి వైసీపీ! నమ్మొచ్చా?

Posted: 08/21/2017 11:18 AM IST
Bjp ysrcp merger in discussions

ఆంధ్రా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? బీజేపీతో చేతులు కలిపేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెడీ అయ్యారా? అంటే అవుననే అంటోంది జాతీయ మీడియా. ప్రముఖ పాత్రికేయుడు, రాజకీయ విశ్లేషకుడు ఆర్ణబ్ గోస్వామికి చెందిన ‘రిపబ్లిక్ టీవీ’ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. అంత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అంటూ అర్ణబ్ ఛానెల్ జగన్ బీజేపీతో చేతులు కలపడానికి సర్వం సిద్ధమైందని పేర్కొంది.

ఇందుకోసం కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి నిర్వహించిన మధ్యవర్తిత్వం ఫలించిందని తెలిపింది. జగన్‌ను ఆయన బీజేపీలోని ముగ్గురు ముఖ్యనాయకుల వద్దకు తీసుకెళ్లి చర్చలు జరిపారని వివరించింది. ఎన్డీయేలో చేరికకు జగన్ తన పూర్తి సంసిద్ధతను వ్యక్తం చేశారని చానల్ పేర్కొంది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి జగన్ బేషరతుగా మద్దతు ఇవ్వడం, ప్రత్యేక హోదాపై కిమ్మనకుండా ఉండడం, ఇవన్నీ అందులో భాగమేనని ‘రిపబ్లిక్ టీవీ’ తన కథనంలో పేర్కొంది.

వచ్చే ఎన్నికల్లో ఎవరితో వెళ్లాలనేది ఎన్నికలప్పుడే నిర్ణయిస్తామని బీజేపీ కూడా చెబుతోంది. జగన్‌పై ఉన్న అవినీతి ఆరోపణలను తేలిగ్గా తీసుకున్న ఓ బీజేపీ నేత మాట్లాడుతూ ఈ విషయంలో ఎలా వ్యవహరించాలో తమకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చే వారితోనే ఏపీలో కలిసి వెళ్తామని చెప్పడం ఈ వార్తకు మరింత ఊతమిస్తోంది. తమది పక్కా రాజకీయ పార్టీ అని, చంద్రబాబుతో లాభం ఉందనుకుంటే ఆయనతో కలిసి వెళ్తామని, లేదంటే మరో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

బీజేపీలో జగన్ చేరికకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మరుసటి రోజే ఈ కథనం వెలువడినట్టు చెప్పుకుంటున్నారు కూడా. బీజేపీ కరడు గట్టిన మద్ధతు దారుడు అర్నబ్ ఛానెల్ నుంచే ఇలాంటి వార్త వెలువడటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Republic TV  YS Jagan  BJP  NDA Alliance  

Other Articles