Why IT dept doesn't conduct raids in nandhyal bypoll నంద్యాల ఉపఎన్నికలలో ఐటీ అధికారులేరయా.?

Why ec and it dept doesn t interupt and cancels nandhyal bypoll

nandyal by-elections, YSRCP, IT Department, nandyal assembly constituency, green tokens, vitiating effect, luring voters, shilpa mohanReddy, bhuma bramhananda reddy, Election Commission, Corruption, gifts

When IT dept conduct raids in RK puram bypoll on the basis of vitiating effect created by the distribution of money and gift items to lure the voters, what are the same officials doing in lieu of nandyal by-elections.

నంద్యాల బైపోల్స్ లో ఐటీ, ఈసీ అధికారులేరయా.?

Posted: 08/17/2017 05:13 PM IST
Why ec and it dept doesn t interupt and cancels nandhyal bypoll

తమిళనాడులో తమ ఉనికి చాటుకునేందుకు కేంద్రంలో అధికారంలో వున్న బీజేపి పార్టీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి.. స్వయంగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహించిన అర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనదైన ప్రతాపాన్ని చాటి అక్కడి రాజకీయ నేతల వెన్నులో వణుకు పుట్టించింది. కలసి వచ్చే కాలం అన్నట్లుగా ఏకంగా ఎన్నికల కమీషన్ కే లంచం ఇవ్వజూసిన కేసులో అర్కే నగర్ అభ్యర్థి దినకరణ్ పై కూడా కేసులు నమోదై అయన బెయిలుపై బయటకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అక్కడ ఓటర్లను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న సమాచారంలో ఏకంగా మంత్రి విజయ్ కుమార్ నివాసంపై అదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అతని నివాసంతో పాటు అతని బంధువులు, స్నేహితుల ఇళ్లపై కూడా దాడులు నిర్వహించారు. దీంతో భారీ మొత్తంలో డబ్బు, ఇతర కీలక డాక్యూమెంట్లను స్వాధీనం చేసుకున్నారు అదాయపన్ను శాఖ అధికారులు. అయితే మిత్ర ధర్మం అంశాన్ని బలంగా ఫాలో అవుతున్న కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం.. తమ మిత్రుడే ముఖ్యమంత్రిగా వ్వవహరిస్తున్న ఏపీలో మాత్రం ఏం జరిగినా పట్టించుకోదా..? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కాగా నంద్యాలలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఏకంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎన్నికల సంఘం అధికారులను కలసి విన్నవించినా.. నంద్యాల ఉప ఎన్నికలలో మాత్రం ఈ అంశంపై ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. అయితే ఎన్నికలు ఇంకా దూరంగా వున్నాయన్న తరుణంలోనే ప్రచారానికి తీసుకువచ్చిన కార్యాకర్తలకు నోట్లకు బదులు టోకన్లను ఇచ్చి తరువాత వాటిని గుట్టుచప్పుడు కాకుండా క్యాష్ చేయించుకుంటున్నారన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి.

ఇక ఈ ఉప ఎన్నికలలో ఎన్నూడూ ఏ ఉపఎన్నికలకు జరుగని రీతిలో హై వోల్టేజీ స్థాయిలో ముమ్మర ప్రచారం జరుగుతుంది. అధికార టీడీపీ,. ప్రధాన ప్రతిపక్షం వైసీసీకి చెందిన అగ్రనేతలు నంద్యాలలోనే తిష్ట వేశారు. గత వారం రోజులుగా వైసీసీ అధినేత జగన్ నంద్యాలలో తిష్టవేసి ప్రచారాన్ని చేస్తుండగా, టీడీపీ మంత్రులు కూడా అక్కడే తిష్టవేశారు. ఈ క్రమంలో చంద్రబాబు వియ్యంకుడైన సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ టీడీపీ పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రె్డ్డికి మద్దుతుగా చేశారు. అయితే ఎక్కడో చాటుమాటుగా చేసే పనులను ఆయన ఏకంగా బహిరంగంగానే తమ రోడ్ షోకు వచ్చిన వారికి రూ. వంద నోట్లను పంచారు.

ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓ సినిమా నటుడిగా కొనసాగుతూ.. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. అన్ని తెలిసిన బాలకృష్ణ ఏకంగా నోట్లను పంచుతుంటే ఎన్నికల సంఘం అధికారులు, అదాయపన్ను అధికారులు ఎందుకు మౌనం వహించారన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ఎలాగో తమ పార్టీ అభ్యర్థి గెలవడన్న నిర్ణయానికి వచ్చేసిన బాలయ్య.. ఇలా డబ్బులను పంచుతూ ఓటర్లకు మచ్చిక చేసుకుని ఎన్నికలపై వాటి ప్రభావం పడేలా చేస్తున్నాడా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి.

బహిరంగంగా డబ్బులు పంచుతూ కెమెరాలకు చిక్కిన బాలకృష్ణపై తక్షణం ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ల కూడా పెరుగుతున్నాయి. ఇక అదాయపన్ను శాఖ అధికారులు ఈ డబ్బులు ఎవరిచ్చారు..? ఎక్కడి నుంచి వచ్చాయి..? బాలకృష్ణ స్వయంగా ఈ డబ్బుతో వచ్చారా..? లేక నంద్యాలలో అధికార పార్టీ నేతలకు ఆయనకు ఈ డబ్బును అందించారా..? అన్న విషయాలపై వెంటనే రంగంలోకి దిగి.. అన్వేషన్ చేపట్టాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

ఇదిలావుండగా, టీడీపీ అందుకున్న కొత్త పల్లవిని పరిశీలిస్తే.. వారే బాలకృష్ణ డబ్బులు పంచుతున్న ఫోటోలను ఈసికి పంపించి ఎన్నికలు వాయిదా పడేట్లు చేయాలని యత్నిస్తున్నాయా..? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. నంద్యాల ఎన్నికలను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని తెరపైకి తీసుకువచ్చి.. అందుకోసం తమను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించడం వెనుక మర్మమిదేనా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి,

అయితే రంగంలో దిగిన ఎన్నికల పరిశీలకులకు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో ఈసీకి ఎలాంటి పిర్యాదులు చేయలేదు. పైపెచ్చు.. అదాయ శాఖ అధికారులు కూడా అర్కే నగర్ ఉప ఎన్నికల తరహాలో వ్యవహరించడం లేదు. డబ్బును యధ్దశ్చగా ఓ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పంచుతున్నా పట్టించుకోలేదు. కోట్లను కుమ్మరిస్తేనే ఎన్నికలను ప్రభావితం చేసినట్లా... వందలు పంచితే కాదా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరి నిజానిజాలు ఏంటో.. ఏం జరుగుతుందో..? వాటిపై ఎలా స్పందించాలో ఎన్నికల కమీషన్ కే ఎరుక.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles