నంద్యాల పోల్.. పవన్ కామ్ గా ఉంటేనే బెటరా? | Pawan kalyan Nandyala By Poll Support

Pawan support to nandyala by poll

Pawan kalyan, PK Nandyala By Poll, Pawan kalyan Nandyala By Poll, Nandyala Pawan kalyan Campaign, Nandyala By Poll TDP, TDP Nandyala Election,

Pawan Kalyan Janasena stand in Nandyala By Poll. Pawan Maintain suspense on Nandyala By Poll issue. Previously After Uddanam Meet with CM Chandrababu Naidu he said within two days his party will announced support but not yet declared.

నంద్యాల పోల్.. పవన్ డెసిషన్ పై సస్పెన్స్

Posted: 08/03/2017 05:22 PM IST
Pawan support to nandyala by poll

టీడీపీ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఎన్నికకు సొంత నేత కాటం వద్దంటున్నా వైసీపీ అధినేత జగన్ పోటీకి సిద్ధమయ్యాడు. రాజకీయ చతురతను ఉపయోగించి అసంతృప్తిలో ఉన్న శిల్ప బ్రదర్స్ ను సక్సెస్ ఫుల్ గా లాగేశాడు. అదే సమయంలో ప్రజల్లో క్రేజ్ ఉన్న జనసేన అధినేత పవన కళ్యాణ్ మద్ధతు కీలకంగా మారింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఉప ఎన్నిక జరుగుతున్నందున రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించాడు.

2019 ఎన్నికల ముందు వస్తున్న ఈ ఎన్నికలో గెలుపు ఇటు టీడీపీకి, అటూ వైకాపాకు రెండు పార్టీలకూ కీలకమే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఇరు పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పవన్ నంద్యాల ఎన్నికలపై స్పందించడం ఇరు పార్టీల్లోనే కాక, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కులం ఆధారంగా ఓటు బ్యాంక్ ఇక్కడ కీలకం కానుంది. నియోజకవర్గంలో బలిజలు, ముస్లింలు, ఆర్య వైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ ఓటర్లు ఉండగా, వీరిలో దాదాపు 42వేల మంది బలిజ(కాపు) ఓటర్లే ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎవరికైనా మద్దతు ప్రకటిస్తే, ఈ సామాజికవర్గంపై ఓట్లు తీవ్ర ప్రభావం చూపే ఆస్కారం ఉంది.

ఇక మరో 25 వేల నుంచి 35 వేల మంది పవన్ కల్యాణ్ అభిమానులు (కులాలకు సంబంధం లేకుండా), సేవాదళ్ సాధారణ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ ఆశయ సాధన సమితి సభ్యులు ఉన్నారు . వీరు పవన్ ఏది చెబితే దాన్ని పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ మద్ధతు కీలకం కానుంది. టీడీపీకే మద్ధతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావింస్తుండగా, మరోవైపు నాగిరెడ్డి తనయ, మంత్రి భూమా అఖిలప్రియ పవన్ కల్యాణ్ తో పీఆర్పీ ఉన్న సమయం నుంచే తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉందని చెప్పటంతో మద్ధతు ఇచ్చే విషయంలో సానుకూలతతోనే ఉన్నాడా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే టీడీపీ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ, నంద్యాల ఎన్నికకు పవన్ దూరంగా ఉండటం (తటస్థం) ఉంటేనే మంచిదని విశ్లేషకులు చూసిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వేసే వలలో పవన్ పడతాడా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandyala Election  TDP  Pawan Kalyan  YSRCP  

Other Articles