Vijayashanthi sets ground to joins Sasikala camp పయనించే ఓ చిలుకా.. ఎగిరిపో పాడై పోయేను..

Vijayashanthi sets ground to joins sasikala camp

vijaya shanti to join tamil politics, vijaya shanti to join aiadmk, vijaya shanti ale naredndra, vijaya shanti bjp, vijaya shanti talli telangana, vijaya shanti telangana, vijaya shanti, aidmk, sasikala, dinakaran, andhra pradesh, telangana, tamilnadu, politics

Politician cum actress Vijayashanthi comes to make some sound in the Tamil Nadu political arena. It is said that Vijayashanthi will be joining AIADMK soon as talks are going on.

పయనించే ఓ చిలుకా.. ఎగిరిపో పాడై పోయేను..

Posted: 06/09/2017 01:41 PM IST
Vijayashanthi sets ground to joins sasikala camp

తమిళనాట ఆసక్తికరంగా మారిన రాజకీయాలను అందిపుచ్చుకునేందుకు నాటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రెడీ అయ్యిందా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అంతేకాదు విజయశాంతి త్వరలోనే అన్నడీఎంకే పార్టీలో చేరుతారని.. పార్టీలో క్రీయాశీలకంగా కూడా వ్యవహరిస్తారని వార్తలు తమిళనాట చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. మరణంతో మూడు ముక్కలుగా చీలిపోయిన అధికార అన్నాడీఎంకే పార్టీలో విజయశాంతి తన గ్లామర్తో పాటు.. తన రాజకీయ అనుభవాన్ని కూడా రంగరించి పార్టీ పటిష్టతకు కృషి చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయన్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.

బీజేపి పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి, ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి, తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి, తరువాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. అన్నాడీఎంకేలో చేరబోతున్నారన్న కథనాలు వినబడుతున్నాయి. ఇందుకు అక్కడి రాజకీయ విశ్లేషకులు అందిన బలమైన సమాచారం కూడా వుంది. టీటీవీ దినకరణ్ బెయిల్ పై విడుదలైన తరువాత, 5న బెంగళూరులోని పరస్పనా అగ్రహార కోర్టులకు వెళ్లి అక్కడ శశికళను కలుసుకున్నారు. అదే రోజున ములాఖాత్ సమయం ముగిసిన తరువాత విజయశాంతి కూడా వెళ్లి శశికళతో అకస్మాత్తుగా ములాఖాత్ అయ్యారు.

విజయశాంతికి ఉన్న ఫాలోయింగ్‌, ఆమె రాజకీయ అనుభవం అన్నాడీఎంకేకు కలిసివస్తాయని భావించిన దినకరన్‌.. ఆ మేరకు శశికళను ఒప్పించినట్లు తెలిసింది. రజనీకాంత్‌ పొలికట్‌ ఎంట్రీ కంటే ముందే విజయశాంతిని అన్నాడీఎంకేలోకి చేర్చుకోవడం ద్వారా లబ్దిపొందొచ్చన్నది దినకరన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇటీవల రద్దైన అర్కే నగర్ ఉప ఎన్నికల సమయంలోనూ అమె అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థికి దినకరణ్ కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో విజయశాంతి అన్నాడీఎంకేలో చేరనున్నార్న వార్తలు తమిళనాట జోరందుకున్నాయి.

అయితే తెరపై లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా ఎదిగిన విజయశాంతి రాజకీయాలలో మాత్రం అంతగా తన ముద్రను వేసుకోలేకపోతున్నారన్న విమర్శలు వున్నాయి. 1998లో బీజేపీలో చేరడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత ‘తల్లి తెలంగాణ’ పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. 2014 వరకు టీఆర్ెష్లో కొనసాగిన అమె.. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ లో చేరారు. ఇక తాజాగా అన్నాడీఎంకే వైపు తన దృష్టిని కొనసాగిస్తున్నారు. దీంతో అమెపై నెట్ జనులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాలలో అమె ఏ ఒక్క పార్టీలో స్థిరంగా వుండరని.. నిత్యం కప్పదాల్లు వేస్తునే వుంటారని.. ఇరవై ఏళ్లలో నాలు పార్టీలు మారిన విజయశాంతిని.. పయనించే ఓ చిలుగా.. ఎగిరిపో పాడై పోయేను గూడు అంటూ సెటైర్లు విసరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayashanti  aidmk  sasikala  dinakaran  andhra pradesh  telangana  tamilnadu  politics  

Other Articles