Vijayashanti likely to join in TDP soon

Vijayashanti takes you turn to politics

Vijayashanti, Vijayashanti TDP, Vijayashanti YSRCP, Vijayashanti Political Carrier, Vijayashanti New Party, Vijayashanti Telangana, Vijayashanti New Movie, Vijayashanti Rumour, Vijayashanti Revanth Reddy

Actress, Former MP Vijayashanti may join TDP soon. Not officially confirmed by her.

టీడీపీలోకి విజయశాంతి?

Posted: 05/19/2017 02:09 PM IST
Vijayashanti takes you turn to politics

త్వరలో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుని సినిమాలతో బిజీ అయిపోతానని ఆ మధ్య చెప్పిన విజయశాంతి మళ్లీ వెంటనే మాట మార్చేసింది. కళ కళేనన్న ఆమె ఇంకోవైపు రాజకీయ ప్రస్థానం కూడా కొనసాగిస్తానని చిరు టైపులో ఓ డైలాగు వదిలింది.మరోపక్క ఫిజికల్ గా ఫిట్ గా మారేందుకు ఇప్పటికే ట్రీట్ మెంట్ కూడా చేయించుకుంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి రాజకీయంగా మాత్రం ఆమె పయనం ఏంటన్నదానిపై మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ లేకుండా పోయింది.

గులాబీ గూటి నుంచి బయటికి వచ్చేశాక కాంగ్రెస్ పంచన చేరిన ఆమె తర్వాత పాత పార్టీ  బీజేపీలోనే చేరుతుందనే ఊహాగానాలు ఆ మధ్య వినిపించాయి.కానీ, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దన్న సన్నిహితుల నిర్ణయంతో ఆగిపోయిందంట. ఇప్పుడు కొత్తగా చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే... ఆమె త్వరలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకోబోతుందని. పునాదులు లేకుండా పోతున్న పార్టీకి బలం చేకూరాలంటే టీఆర్ఎస్ లో పని చేసి బలహీనతలు తెలిసి, బలంగా వాయిస్ వినిపించే విజయశాంతి లాంటి వాళ్ల అవసరం ఉందని కొందరు సీనియర్ నేతలు అభిప్రాయపడతున్నారంట.

అదే సమయంలో తెలంగాణలో అంతగా ప్రబావం లేని పార్టీ, పైగా  రేవంత్ రెడ్డి లాంటి జూనియర్ నేత డామినేషన్ ఉన్న పార్టీలో సెకండ్ స్థాయి లీడర్ గా కొనసాగేందుకు రెబల్ రాములమ్మ ఇష్టత చూపించకపోవచ్చేనే చెబుతున్నారు. ముఖ్యంగా   తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని, అందులోని నేతలను ఏకిపడేసిన విజయశాంతిని పక్కన పెట్టుకోవటం మంచింది కాదనే కొందరు వాదిస్తున్నారంట. ఏదిఏమైనా రాములమ్మ కమ్ బ్యాక్ గురించి ఇప్పుడు తెలుగుదేశం వర్గాల్లో బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayashanti  Political Carrier  TDP  Telangana  

Other Articles