భారత ఉప రాష్ట్రపతిగా ఈఎస్ఎల్ నరసింహన్..? Governor Narasimhan To Be India's VP?

Governor narasimhan to be india s vp

ESL Narasimhan, Telangana Governor, AP Governor, Vice President of India, Telangana, Andhra Pradesh, Hamid Ansari, Intelligence Bureau Chieftrending, trending news

Telugu states Governor ESL Narasimhan's name is being heard in Delhi for the position of Vice-President if all goes as per the reports.

భారత ఉప రాష్ట్రపతిగా ఈఎస్ఎల్ నరసింహన్..?

Posted: 04/04/2017 12:31 PM IST
Governor narasimhan to be india s vp

తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులైన వ్యక్తి త్వరలో భారత ఉప రాష్ట్రపతి పదవికి అధికార బీజేపి పార్టీ తరపున బరిలో నిలవనున్నారా..? అంటే అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి. ఇంతకీ ఎవరాయన..? అంటారా.. అయన మరెవరో కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా అత్యంత సునాయాసంగా పరిష్కరించి.. గవర్నర్ పదవికి వన్నె తెచ్చిన మన గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. ఏంటీ నమ్మశక్యంగా లేదా..? అయితే అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మాత్రం ఇదే తప్పక జరగొచ్చు అంటున్నాయని విశ్వసనీయ వర్గాలు.

ఉపరాష్ట్రపతి పదవికి గవర్నర్ నరసింహన్ పేరు పరిశీలనలో వున్నట్లు ఢిల్లీ వర్గాల్లు కూడా అనధికారికంగా ఉప్పందిస్తున్నాయి. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తన రెండో పర్యాయం పదవీకాలం ఈ ఏడాది అగస్టులో ముగియనుంది. దీంతో ఉపరాష్ట్రపతి పదవికి నరసింహన్ పేరును తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. ఇందుకు కూడా అనేక కారణాలు వున్నాయిని సమాచారం. మరీ ముఖ్యంగా స్వతహాగా ఐపీఎస్ అయిన నరసింహన్.. దాయాధి పాకిస్థాన్ పై ఇండియన్ ఆర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ దాడుల నేపథ్యలో నరసింహన్ ఇచ్చిన పలు సూచనలతో ప్రధాని మన్ననలను కూడా అందుకున్నారని సమాచారం.

అంతేకాక ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య కొరకరాని కోయ్యగా వున్న అనేక సమస్యలకు ఆయన తన అనుభవంతో సునాయాసంగా పరిష్కరించి.. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర పెద్దల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆయన సత్తా, చతురతను పరిగణలోకి తీసుకున్న ఎన్డీఏ ప్రభత్వం.. యూపీఏ ప్రభుత్వం నియమించిన గవర్నర్లలో దేశవ్యాప్తంగా ఎవరూ లేకపోయినా అయనను మాత్రం కొనసాగిస్తుంది. ఈ క్వాలిటీలే అర్హతగా ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి బీజేపి ప్రభుత్వం పరిశీలిస్తుందని సమాచారం.

రానున్న మే నెల 3న ఆయన పదవీకాలం ముగియనుండటంతో కేంద్రం ఆయన సేవలను వినియోగించుకునే క్రమంలో ఆయనను ఉపరాష్ట్రపతి పదవికి పదోన్నతి కల్పించాలని భావిస్తుందని తెలుస్తుంది. ఇక ననసింహన్ సన్నిహితుడైన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ కూడా ఉపరాష్ట్రపతి పదవికి నరసింహన్ పేరును పరిశీలించే విధంగా దోహదపడ్డారని సమాచారం. ఇక ఈ విషయమై తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ మంత్రివర్యులు కూడా ఈ విషయమై సంకేతాలను ఇచ్చారు. అన్ని అనుకూలిస్తే త్వరలోనే నరసింహన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికవుతారు. మరెందుకు అలస్యం ముందుగానే మనం అల్ ది బెస్ట్ చెప్పేద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ESL Narasimhan  Telugu states Governor  Vice President of India  Hamid Ansari  

Other Articles