గంటాను తొక్కేసేందుకు అయ్యన్న కు ఛాన్స్, ఎలాగంటే... | Ayyanna got opportunity to decreasing power of Ganta.

Ganta ayyanna rift become strong

Minister Ganta Srinivasa Rao, Ayyanna Patrudu Ganta Rift, Kala Venkat Rao Ayyanna Patrudu, Ayyanna Patrudu Ganta Srinivasa Rao, Coastal Andhra Three Ministers, Ayyanna versus Ganta, Minister Ganta Kala Venkat Rao, New Minister Advantage Ayyanna, Ayyanna Patrudu Kala Venkat Rao

AP Cabinet Expansion full Advantage to Ayyanna Patrudu. Kala Venkat Rao will tilt the balance of power politics in the north coastal region in favor of the Ayyanna camp that has been comprehensively sidelined by the ever-increasing power of Ganta Srinivasa Rao.

గంటా వర్సెస్ అయ్యన్న... ఇక మరింత ముదురుతుందా?

Posted: 04/03/2017 12:48 PM IST
Ganta ayyanna rift become strong

మంత్రి వర్గ విస్త‘రణ రంగం’గా మారిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాడు. బుజ్జగింపులతో వర్కవుట్ అవ్వకపోతుండటంతో వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు కూడా. రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు వస్తాయని, అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకునే విస్తరణ జరిగిందని వివరణ ఇచ్చాడు. అయితే కొత్త మంత్రులతో ఫ్యూఛర్ లో పార్టీలో ఇబ్బందులు రావటమే కాదు, పార్టీకి కూడా దెబ్బపడే అవకాశమూ లేకపోలేదన్నది విశ్లేషకుల వాదన. ఇందుకు కిమిడి మృణాళిని స్థానంలో వచ్చిన కళా వెంకట్రావ్ ఉదంతమే ఉదాహరణగా చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న ఇద్దరు మంత్రులు గంటా శ్రీనివాస రావు, అయన్న పాత్రుడు కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పార్టీలో చేరిన వెంటనే గంటాకు మంత్రి పదవి కట్టబెట్టడం, ఆపై ప్రాంతీయ రాజకీయాల్లో డామినేషన్ చేస్తుండటం అయ్యన్నకు మొదట్లోనే ఆగ్రహాం తెప్పించింది. అక్కడి నుంచి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే వస్తోంది. ఇక ఇప్పుడు కొత్తగా  బాధ్యతలు స్వీకరించిన కళా వెంకట్రావ్ అయ్యన్న క్యాంప్ కు చెందిన వ్యక్తే. దీంతో అయ్యన్న బలం ఒక్కసారిగా  పెరిగినట్లయ్యింది.

టెన్త్ ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంపై అసెంబ్లీలో ప్రతిపక్ష ఆరోపణలను సరిగ్గా డీల్ చేయకపోయిన గంటాపై అధిష్టానం గుస్సాతో ఉంది. ఇదే సమయంలో కాస్త అసంతృప్తి రగలిస్తే చాలూ గంటాను పొలిటికల్ సీన్ నుంచి సైడ్ చేయటం పెద్ద పనేం కాదన్నది అయ్యన్న వర్గీయులు చెబుతున్నారు. ఏది ఏమైనా వీళ్ల మధ్య పోరు ముదరక ముందే బాబు సీన్లోకి దిగి పరిస్థితి చక్కదిద్దాలి. లేకపోతే 2019 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో టీడీపీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kala Venkat Rao  New Minister  Ganta Srinivasa Rao  Ayyanna Patrudu  

Other Articles