రికమండేషన్ పంపిన ఆ తెలంగాణ మంత్రికి అధికారులిచ్చిన షాక్ ఏంటంటే... | Telanagana Ministers power dominated by that family.

Ts genco officials reject minister recommendation

Telanagana Ministers, Telanagana Government, KTR and Kavita Domination, Telangana Minister Insult, Telangana , State of Affairs in Telangana

All the Ministers of Telangana are mere dummies. There are some contract jobs available in the electricity department of Telangana i.e TS Genco. Naturally, these postings are given only on the basis of recommendation. Recently, a Senior Minister of Telangana, had recommended a candidate strongly by sending a letter of endorsement on his official letter head with seal and signature. However, the candidate was rejected. Officials said that recommendations from only two people would be entertained by the Chairman of TS Genco.

తెలంగాణ మంత్రికి అధికారుల వద్ద చేదు అనుభవం

Posted: 02/01/2017 12:38 PM IST
Ts genco officials reject minister recommendation

పేరుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ పవర్ మొత్తం గులాబీ బాస్ కుటుంబం చేతిలోనే కేంద్రీకృతమై ఉంటుందనేది రాజకీయ వర్గాల వాదన. ఎంతలా అంటే చివరకు మంత్రుల విషయాల్లోకి కూడా జోక్యం కలగజేసుకునేంతలా. అయితే జూనియర్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ, పార్టీలో సీనియర్లుగా ఉన్నవారి నిర్ణయాలకు కాస్త కేసీఆర్ గౌరవమిస్తాడనే టాక్ కూడా ఉంది.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా పరిస్థితులు మారిపోయాయి. మంత్రులు కేవలం పేపర్ పులులుగానే మారిపోయారు తప్ప ఎక్కడా యాక్టివ్ గా కనిపించటం లేదు. కీలకమైన వ్యవహరాల్లో కూడా వారి జోక్యం భారీగా తగ్గిపోయింది. తమకు శ్రమ తగ్గింది లే అనుకున్న వాళ్లు కూడా గప్ చుప్ గా ఉండిపోయారు. ఇంతదాకా బాగానే ఉన్నప్పటికీ ఓ సీనియర్ మంత్రికి జరిగిన అవమానం నెమ్మదిగా బయటికి పొక్కింది.

తెలంగాణ జెన్ కో లో కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఈ మధ్య నోటిఫికేషన్ జారీ అయ్యింది. సాధారణంగానే ఇలాంటి వాటిల్లో రికమండేషన్లు నడుస్తుంటాయి. పెద్దన్న పొజిషన్ లో ఉన్న సదరు మంత్రి కూడా తనకు బాగా కావాల్సిన వ్యక్తులను రికమండ్ చేస్తూ అధికారులకు ఆదేశాలు పంపాడు. అయితే కేవలం హై రికమండేషన్ లేఖలను మాత్రమే తాము చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామంటూ అధికారులు ఆదేశాలను సింపుల్ గా వెనక్కి తిప్పి పంపారంట. దీంతో పాపం ఆ మంత్రివర్యులు తనకు ఆ మాత్రం కూడా పవర్ లేదా? అంటూ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Government  Ministers  Insult  Officials  

Other Articles