అబ్బా... చంద్రబాబుది ఎంత పెద్ద త్యాగమో! | Chandra babu on PM post sacrifice.

Chandrababu naidu at india today conclave

Chandrababu Naidu speech, AP chief Minister Chandrababu Naidu, India Today Conclave, Chandrababu PM dream, India Today Conclave Chandra Babu

AP chief Minister Chandrababu Naidu speech at India Today Conclave. PM post sacrifice for Andhra Pradesh development.

ఆ పదవి అవసరం లేదని మోడీకి చెప్పాడా?

Posted: 01/11/2017 05:49 PM IST
Chandrababu naidu at india today conclave

తన పరిధికి మించి ఊహించేసుకోవటం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కొత్తేం కాదు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం సంగతి ఏమోగానీ, ఇప్పటికీ ఛాన్స్ దొరికితే హైదరాబాద్ గురించే డప్పు వాయించుకుంటూ ఉంటుంటాడని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించటం చూశాం. అయితే తాజాగా మళ్లీ ఆయన చేసిన కామెంట్లు వింటే ఎవరికైనా బాబు అతి చేస్తున్నాడా? అనిపించకమానదు.

ప్రముఖ దిన పత్రిక ఇండియా టుడే చెన్నైలో సదస్సును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దానికి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యాడు. అయితే అయ్యాడు కానీ, అక్కడ బాబుగారు ఇచ్చిన ఉపన్యాసం గురించే అసలు డిస్కషన్ మొదలైంది. గతంలో తనకు రెండు సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందని, కానీ, కేవలం ఏపీ(అప్పుడు ఉమ్మడి రాష్ట్రం) కోసమే వాటిని రెండు సార్లు వదిలేశానని చెప్పుకొచ్చాడు.

హెచ్ డీ దేవగౌడ, ఐకే గుజ్రాల్ (ఇద్దరు ఎంతో కాలం పాలించలేదు) ప్రధానులుగా అయ్యే సమయంలో తనను ప్రధాని కావాలంటూ విజ్నప్తి చేశారని, అయితే ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నంబర్ 1 గా చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను దానిని తృణప్రాయంగా వదిలేశానని చెప్పుకోచ్చాడు. ఒకవేళ ఇప్పుడు కూడా అలాంటి అవకాశమే వచ్చినా తాను అస్సలు పట్టించుకోనంటూ మరో స్టేట్ మెంట్ కూడా చేశాడు. పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపాలని, లేదంటే తనకు ఈ పదవి (ముఖ్యమంత్రి) అవసరం లేదని తాను ప్రధాని నరేంద్ర మోడీకి తేల్చి చెప్పానని కూడా చెప్పటం విశేషం.

అంతా బాగానే ఉంది కానీ, తొమ్మిదేళ్ల పరిపాలనలో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారన్న ప్రశ్నకు మాత్రం ఆయన నీళ్లు నమలాల్సి వచ్చింది. అయినా ప్రధాని అయ్యే అర్హతలున్న వ్యక్తిని ప్రజలు (2004, 2009 ఎన్నికల్లో) ఎందుకు తిరస్కరించారు చెప్మా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM Chandra Babu  India Today Conclave  PM Post  

Other Articles