నితిన్ కు ఆనందీ ఎందుకు హ్యాండిచ్చింది? | Reason behind Nitin Patel out from Gurat CM race.

Why nitin patel out from gujarat cm race

Why Anandiben Patel back step for Nitin, Nitin Anandiben Patel, Nitin Patel name changes in last miniute

Reason behind Nitin Patel out from Gurat CM race.

చివరి క్షణాల్లో ఏం జరిగింది?

Posted: 08/06/2016 12:33 PM IST
Why nitin patel out from gujarat cm race

గుజరాత్ సీఎం మార్పు జరిగిన విధానం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమౌతుంది. మరోసారి రాష్ట్రాన్ని తన గుప్పిట్లోనే ఉంచుకోవాలన్న అమిత్ షా పాచిక పారింది. స్వచ్ఛంద రాజీనామాతో తప్పుకున్న ఆనందీబెన్ పటేల్ వారసుడి ఎంపిక నిన్న అంతా హైడ్రామాగానే నడిచింది. తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించిన అధిష్టానానికి తన సామాజిక(పటేల్) వర్గానికే చెందిన వ్యక్తిని సీఎం చేయాలని ఆనందీ సూచించారంట. కానీ, విధి అమిత్ షా రూపంలో మరోసారి వెక్కిరించింది.

రిజర్వేషన్ల ఉద్యమం వేడి ఇంకా చల్లారని నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా నితిన్ పేరునే ప్రకటించబోతుందన్న వార్త నిన్న ఉదయం నుంచే హల్ చల్ చేసింది. ఆఖరికి అధిష్టానం అనౌన్స్ చేస్తుందన్న రెండు గంట ముందు దాకా ఆయన పేరే వినిపించింది. దీంతో ఆయన పూర్తి వివరాలు సేకరించి, స్పెషల్ బులిటెన్లలతో జాతీయ మీడియాలన్నీ సిద్ధమయ్యాయి. ఆఖరికి నితిన్ భార్యతో కూడా కొన్ని ఛానెళ్లు ఇంటర్వ్యూ తీసుకున్నాయి. అంతా సిద్ధమై సరిగ్గా సాయంత్రం 4.45 కు ప్రకటన వెలువడుతుందని భావించిన నితిన్ శ్రేణులు సంబురాలకు సిద్ధమయ్యాయి. కానీ, అంతా తలకిందులైంది.

ప్రకటన ఓ రెండు గంటలు ఆలస్యంగా వెలువడటమే కాదు, ఆ గ్యాప్ లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. రేసులో రెండో ఆఫ్షన్ గా ఉన్న విజయ్ రూపాని పేరును కాషాయం ప్రకటించింది. దీనికి ఆనందీబెన్ మద్ధతు ఎలా తెలిపిందా అన్న అంశంపై చర్చ జరుగుతుండగా, కొన్ని విషయాలు బయటికి వస్తున్నాయి. ముందుగా నితిన్ అభ్యర్థిత్వాన్ని బలపరచినా, ఆ తర్వాత ఆనందీబెన్ మనసు మార్చుకున్నారంట. నితిన్ కు పటేల్ సామాజిక వర్గంలో మంచి పేరు లేకపోవటంతోపాటు, విజయ్ రూపానీ వివాదరహితుడన్న అమిత్ షా వాదనకు మద్ధతు అంతా మద్ధతు తెలిపారంట. దీంతో ఆలోచనలో పడ్డ ఆనందీబెన్ పటేల్ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ కే ఓటేశారని సారాంశం.

ఇక గుజరాత్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికైన రూపానీకి పార్టీలో ఎలాంటి వ్యతిరేకత లేదు. అంతేకాకుండా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగానూ ఆయన పనితీరు బాగానే ఉందని అమిత్ షా మోదీకి ఫోన్ చేసి వివరించారంట. అందుకే చివరి నిమిషంలో ఏకగ్రీవంగా అంతా ఆయకే ఓటేశారని తెలుస్తోంది. ఇక కేవలం రెండంటే రెండే గంటల్లోనే భవిష్యత్తు తలకిందులు చేసుకున్న నితిన్ డిప్యూటీతో సరిపుచ్చుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitin Patel  Gujarat CM  race  Vijay Rupani  Anandiben Patel  

Other Articles