Who is responsible for Universities violence

Who is responsible for universities violence

HCU, JNU, Students, University, Srinagar University, Students, Govt, Respond on Students

HCU, JNU and Many more universities are on fire. Students protesting for their rights or some thing. But Govts are not responding properly on universities alligations.

క్యాంపస్ లలో కల్లోలాకు కారణం ఎవరు..?

Posted: 04/06/2016 04:49 PM IST
Who is responsible for universities violence

యూనివర్సిటీలు దేశానకి మేధావులను అందించే కర్మాగారాలు. దేశంలో ఒక్క మేధావి చేసే చిన్న ఆలోచన కూడా దేశ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. అందుకే యూనివర్సిటీలను దేవాలయాలుగా చాలా మంది అభివర్ణిస్తారు. కానీ యూనివర్సిటీల్లో నేడు నిప్పు సెగలు అంటుకున్నాయి. యూనివర్సిటీల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఆ ధ్యాస వదిలి ఉద్యమాలకు నిలయాలకు నిలయాలుగా మారుతున్నాయి. ఉద్యమం అనేది ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన లక్షణమే కానీ అది చదువుల ప్రభావం చూపించేంత మాత్రం ఉండకూడదు. కానీ గతకొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే యూనివర్సిటీల్లో ఎంతటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతున్నాయి. మరి యూనివర్సిటీల్లో పరిస్థితి ఎందుకు అలా మారింది.

దేశంలొ మేధావులు ఎక్కడా అని వెతక్కుండా ఒక్క యూనివర్సిటీ క్యాంపస్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు. మరి నిత్యం మేధావులను తయారు చేసే కర్మాగారాలైన యూనివర్సిటీలు ఎందుకు నిజానికి రాకీయాలకు అతీతంగా కేవలం చదువులే పరమావధిగా ఉండాల్సిన విద్యార్థులు ఎందుకు అలా చేస్తున్నారు అన్న దాని మీద దృష్టిసారించాలి. నిజానికి విద్యార్థి దశలో ఎవరైతే బాగా రాజకీయాల గురించి అవగాహన కలిగి ఉంటారో వారిని తమ పార్టీకి చెందిన విద్యార్థి శాఖకు నాయకులుగా చేస్తూ తమ వైపు తిప్పుకుంటాయి పార్టీలు. అలా ఒక్కో స్టెప్ ముందుకు వేస్తూ. వారికి రాజకీయాలను దగ్గర చేసి.. చివరకు విద్యార్థుల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే విద్యార్థుల అంశం చూద్దాం. అక్కడి విద్యార్థి నాయకులు పార్టీ మూలాలున్న విద్యార్థి సంఘాల్లో చేరి మరో  విద్యార్థి సంఘం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించాడు. అలా చివరకు ఓ చిన్న ఘటన చిలిచిలికి గాలి వానలా మారి... ఓ విద్యార్థి నిండు ప్రాణం పోయింది. ఇక ఆ అంశం అంతకంతకు చిలికి దిల్లీకి చేరింది. ఓ యూనివర్సిటీలో మొదలైన గొడవ కాస్తా.. జాతీయ స్థాయికి చేరింది. దాంతో అంశం మరింత రాజకీయ రంగు పులుముకుంది. అయినా విద్యార్థుల్లో ఇలా విషబీజాలను నాటుతున్నది ఎవరు అంటే మాత్రం చివరకు అదే రాజకీయ పార్టీల వరకు వెళుతుంది.

రాజకీయాల్లో విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. కాబట్టే వారు పుస్తకాలు వదిలి.. ఉద్యమాల బాటలో నడుస్తున్నారు. మరి ఇలాంటి వాటికి పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చెయ్యకపోతే విద్యార్థి దశ నుండే రాజకీయాలు అలవాటుపడి.. రక్తంలో కలిసి మరోపార్టీ వాడు, మరో సంఘం వాడు అంటే వ్యతిరేకత బాగా పెరుగుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. తాజాగా టీమిండియా వర్లడ్ టీ20 సిరీస్ లో ఓడిపోతే అది గొడవగా మారింది. చివరకు అది లోకల్ , నాన్ లోకల్ గొడవగా మారింది. ఇది ఎంత మాత్రం కరెక్ట్..?

విద్యార్థుల విషయంలో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు..
* ముందుగా విద్యార్థులతో, యూనివర్సిటీ సిబ్బందితో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసి.. దానిలో అందరి సమస్యలకు పరిష్కారం దొరికేలా విసి చొరవచూపాలి.
* పార్టీలకు చెందిన జెండాలను, విధానాలను తీసుకురాకూడదు.
*అన్నింటికి మించి రాజకీయ జోక్యం ఉండనట్టుగా చూడాలి
* రాజకీయ నాయకులు ఎవరూ కూడా యూనివర్సిటీల్లో అడుగుపెట్టుకుండా చూడాలి.
* విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా వెంటనే స్పందించే ఓ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఉండాలి. దానికి కొన్ని నిధులను వాడుకునే హక్కును కల్పించాలి.
*అన్ని కమిటీల్లో అన్ని వర్గాల విద్యార్థులకు చోటుకల్పించాలి.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : HCU  JNU  Students  University  Srinagar University  Students  Govt  Respond on Students  

Other Articles