social media criticises smriti irani in yamuna express highway accident

On twitter users mock hrd minister with smriti hit and run

president pranab mukharjee, yamuna expressway accident, Victim son, Court to move over Yamuna Expressway deaths, smriti irani, smriti irani accident, yamuna expressway accident, Yamuna Expressway deaths, victim's family claims Smriti didn't help, HRD Ministry denies charge

Union HRD Minister Smruthi Irani was critisiced by netzens as she moves ths spot mercylessly, After a doctor ramesh nagar, who died in an accident on Yamuna expressway.

స్మృతి ఇరానీ అమానవీయ చర్యపై విమర్శలు

Posted: 03/14/2016 06:31 PM IST
On twitter users mock hrd minister with smriti hit and run

యావత్ దేశాన్ని, పార్లమెంటును తన ఉద్విగ్ధ ప్రసంగంతో కట్టిపడేసి.. విపక్షాల నోట మాట రానీయకుండా చేసిన కేంద్ర  మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తాజాగా విమర్శలు ఎదుర్కోంటున్నారు. పార్లమెంటు శివ్వంగి, అపరకాళీ అని నెట్ జనుల కితాబులు అందుకున్న అమె ఇప్పుడు అదే సోషల్ మీడియాలో విమర్శల పాలవుతున్నారు. దేశభక్తి విషయంలో అమెను ఆకాశానికి ఎత్తిన నెట్ జనులు.. తాజాగా అమె ఎదుర్కెన్న ప్రమాద విషయంలో మాత్రం అమెను తూర్పార బడుతున్నారు.

ప్రమాదాల బారిన పడి తప్పించుకున్నా.. నెట్ జనుల విమర్శలను మాత్రం తప్పంచుకోలేని బీజేపి మహిళా నేతలలో అమె రెండవ వారు. ఈ జాబితాలో బీజేపి ఎంపీ హేమామాలిని తొలి స్థానం అక్రమించారు. ప్రమాదం బారిన పడిన తరువాత.. అమె కారు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై మొదట అమె కూతుళ్లు స్పందించి బాధిత కుటుంబానికి సాయం చేస్తామని ప్రకటించారు. ఈ ఘటనలో గాయాల పాలైన హేమామాలిన కోలుకున్న అనంతరం స్వయంగా మీడియాతో మాట్లాడతూ.. మరోలా స్పందించడంపై నెట్ జనులు తీవ్ర విమర్శలు గుప్పించారు.

సరిగ్గా అదే మాదిరిగా తాజాగా యమునా ఎక్స్ ప్రెస్వేపై ఈ నెల 5న రాత్రి జరిగిన ప్రమాదంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కోంటున్నారు. బాధిత కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు కేంద్ర మంత్రి కాన్వాయే ప్రమాదానికి కారణమని అరోపిస్తున్నా.. అమె కాన్వాయ్ రెండు పర్యాయాలు తమ తండ్రి వాహనాన్ని ఢీ కొనిందని అందువల్ల వైద్యుడైన తమ తండ్ర మరణించాడని మృతుడి తనయ, తనయుడు అరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఈ ప్రమాదానికి కేంద్ర మంత్రి కాన్వాయ్ కి ఏమాత్రం సంబంధం లేదని కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది.

కేంద్ర మంత్రి హోదాలో స్మృతి ఇరానీ పోలీసులపై ఒత్తడి తీసుకువచ్చి, ఈ మేరకు కేసును తారుమారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా బాధిత కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు. కాన్వాయ్ లోని తమ తండ్రిని ఢీ కొన్న వాహనం నెంబరును తాము స్వయంగా పోలీసులకు ఇచ్చినా వారు పిర్యాదులో దానిని పొందుపర్చడం లేదని అరోపించారు. ఈ మేరకు మృతుడి కుమారుడు రాష్ట్రపతికి కూడా లేఖ రాశాడు. మంత్రి కాన్వాయ్ తమ తండ్రి వాహనాన్ని ఢీకోనక పోతే ఆ కాన్వయ్ డ్రైవర్ అక్కడి నుంచి ఎందుకు పరారయ్యాడని నెట్ జనులు ప్రశ్నిస్తున్నారు.

ఘటనను చూసేందుకు కారు దిగిన స్మృతి ఇరానీని ఈ దుర్ఘటనలో గాయపడ్డ ఇద్దరు చిన్నారులు.. తమ తండ్రిని కాపాడాలని చేతులు జోడించి దీనంగా అర్థించినా..  వారిని పట్టించుకోకుండా మంత్రి వెళ్లిపోయిందని. సకాలంలో సాయం అందివుంటే.. తమ తండ్రికి వైద్యం అంది బతికేవాడని, మృతుడి పిల్లలు చేసిన వాదనను కేంద్ర మంత్రి ఖండించారు. తాను వారిని వదిలేసి వెళ్లలేదని, అంబులెన్స్ కు ఫోన్ చేసి, వారికి వైద్యం అందించాలని కూడా అస్పత్రికి ఫోన్ చేశానని అమె కార్యాలయ వర్గాలు తెలిపాయి.

అయినా కేంద్ర మంత్రి అమానవీయంగా వ్యవహరించారని నెట్ జనులు విమర్శలు గుప్పించారు. తన కాన్వాయ్ లోని ఒక్క వాహనంలో బాధితుడిని అస్పత్రికి పంపినా.. అతడు బతికే అవకాశాలు వుండి వుండవచ్చునేమోనని అంటున్నారు. ఇదే సమయంలో ప్రతి అంశంలో రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని మాట్లాడే మంత్రిగారు.. ఆయన ఇటీవల అమేధికి వెళ్తుండగా, ఇలానే ఓ ప్రమాదం జరిగితే తన కాన్వాయ్ లోని ఓ వాహనంలో బాధితుడిని అస్పత్రికి పంపారని అదే మానవత్వమని కూడా పలువురు చురకలంటించారు. ఇక మరికోందరైతే తమ అధికారంలో వున్న నేతలకు మానవత్వం కూడా వుండదా, అధికారం మానవత్తాన్ని కూడా సమాధి చేస్తుందా..? అని విమర్శల వర్షం కురిపించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : smriti irani  president pranab mukharjee  yamuna expressway accident  

Other Articles