ravela susheel says he doesn't know the woman, who alleged molest

Ravela susheel not corperating with telangana police

Ravela susheel, police inerrogation, ravela susheel not corprarting with police, Telangana police, ravela driver ramesh, minority woman, lady teacher, molestation, rape, gangrape, molestation on women, harrassment on women, attrocities on women, rape on women,

Ravela Susheel was earlier arrested for molesting a lady teacher at Banjara Hills, is not corperating with telangana police in case interrogation.

అమాత్యుని కొడుకు అరితేరిన బంటు..?

Posted: 03/10/2016 11:18 AM IST
Ravela susheel not corperating with telangana police

మద్యం మత్తులో మహిళ చేయి పట్టి కారులోకి లాక్కునేందుకు యత్నించాడన్న ఆరోపణలపై స్థానికులు చావచితకోట్టి పోలీసులకు అప్పగించడంతో అరెస్టైన టీడీపీ సీనియర్ నేత, ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని తెలుస్తున్నా.. అతను మాత్రం అరితేరిన నేరగాళ్ల మాదిరిగానే వ్యవహరిస్తున్నాడని తెలుస్తుంది. రావెల సుశీల్ కు న్యాయస్థానం బెయిల్ ను నిరాకరిండం.. రెండు రోజు పోలీస్ కస్టడీకి అప్పగించడంతో ఆయన వైఖరి బయటపడింది.

రావెల సుశీల్ తో పాటు అతని కారు డ్రైవర్ రమేశ్ ను కేసు దర్యాప్తులో భాగంగా బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చంచల్ గూడ్ జైలు నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు వారిద్దరికీ మెడికల్ చెకప్ చేయించి, ఆ తర్వాత నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే న్యాయస్థానం అదేశానుసారం రావెల సుశీల్ ను ఆయన తరపు న్యాయవాది సమక్షంలోనే పోలీసుల విచారించారు.

ఈ క్రమంలో సుశీల్ ను పలు కోణాల్లో విచారించిన పోలీసులు అమ్మె ఇతగాడు అరితేరిన  బంటే అంటున్నారుట. గతంలో చేసిన పాత వాదననే సుశీల్ పోలీసుల ముందు వినిపించడమే ఇందుకు కారణమట. కారులో తాను వెనక సీట్లో కూర్చుని ఉండగా, రమేశ్ కారు నడిపాడని చెప్పాడు. ఇంటి నుంచి తాజ్ బంజారా హోటల్ కు వెళుతున్న క్రమంలో మధ్యలో కిందకు దిగిన తనపై కొంతమంది దాడి చేశారని చెప్పాడు. అంతేకాక తనపై కేసు పెట్టిన మహిళ ఎవరో కూడా తనకు తెలియదని అతడు వాదించినట్లు సమాచారం.

అయితే దేశంలోని అనేక మంది మహిళలపై అత్యాచారాలు, గ్యాంగ్ రేప్ లు జరుగుతున్న క్రమంలో రావెల సుశీల్ అంశం చర్చకు దారితీసింది. మహిళలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న పైశాచిక మృగాలకు వారందరూ తెలుసా..? అన్న ప్రశ్నే చర్చకు దారి తీస్తుంది. అమె ఎవరన్న విషయం తెలియకపోయినా.. అమె వెంట ఎందుకు పడ్డారన్న కోణంలో పోలీసులు ప్రశ్నించినా.. తాను కుక్క పిల్ల కోసమే వెళ్లానని రావెల సుశీల్ తన వాదనను వినిపించారట. తాను ఎలాంటి తప్పు చేయకపోతే తన పరువును బజారున పెట్టుకోవాలని ఏ మహిళ కోరుకుంటుంది..? రోడ్డుపై ఎంతోమంది వెళ్తున్నా.. వారందరినీ వదలి స్థానికులు రావెల సుశీల్ పైనే ఎందుకు దాడి చేశారో మరి..? ఈ విషయైనా తనకు తెలుసోలేదో మరి..!

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ravela susheel  police inerrogation  lady teacher  molestation  Telangana Police  

Other Articles