Smriti Irani links knee with bald head on cabinet collegue letter

Irking remarks of union minister smruti irani

Bandaru Dattatreya, Dalit student, Dalit scholar suicide, HRD Minister, Hyderabad Central University (HCU), P Appa Rao, Dalit professors, Rohith Vemula, Smriti Irani, suicide, Vice Chancellor

Irking remarks of Union HRD minister Smriti Irani, dalit professors says she links knee with bald head in cabinet collegue bandaru dattatreya letter

మోకాలికి బోడిగుండికి లింకెట్టిన మినిట్టరమ్మ..!

Posted: 01/21/2016 05:44 PM IST
Irking remarks of union minister smruti irani

హైదరాబాద్  సెంట్రల్ యూనివర్సిటీలో యువ మేధావి రోహిత్ వేముల మరణంపై మూడు రోజుల తరువాత స్పందించిన కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరాని అగ్గిరాజేశారు. క్రితం రోజు సాయంత్రం నిర్వహిచిన ప్రెస్ మీట్ లో అమె చేసిన వ్యాఖ్యలు ఏకంగా మోకాలికి బోడిగుండుకి లింకు పెట్టినట్లు వున్నాయని విమర్శలు వస్తున్నాయి. వాస్తవాలు తెలియకుండా మాట్లాడకూడదని అంటూనే అవాస్తవాలను నిజమని నమ్మించే యత్నం చేశారన్న విమర్శలు వినబడుతున్నాయి. కేంద్ర మంత్రి హోదాలో అమె చేసిన వ్యాఖ్యలు అగ్గికి అజ్యం పోసినట్లుగా మారాయి. అమె వ్యాఖ్యల నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్న 10 మంది దళిత ప్రోఫెసర్లు ఆ భాధ్యతల నుండి తప్పుకున్నారు. కేవలం అధ్యాపక బాధ్యతల ను మాత్రమే నిర్వహిస్తామని ప్రకటించారు.

కేంద్రమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ప్రోఫెసర్ ఉద్యోగాలకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని దళిత ప్రోఫెసర్లు నిర్ణయించుకోగా, తాము అలాంటి నిర్ణయాలను తీసుకుంటే విద్యార్థుల తరపున తమ గళాన్ని వినిపించే అవకాశాన్ని కూడా కోల్పోవాల్సి వస్తుందని వారు ఆ నిర్ణయాన్ని మానుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి చెప్పిన పలు విషయాలను కూడా ప్రోఫెసర్లు ఖండించారు. అంతేకాదు కేంద్రమంత్రి బండారు దత్తత్రేయ లేఖ రాయడం, దానిపై ఐదు పర్యాయాలుగా కేంద్ర మానవ వనరుల శాఖ నుంచి లేఖలు రావడంతోనే రోహిత్ అత్మహత్య జరిగిందని అరోపించారు.

తమ సహచర మంత్రిని కాపాడుకుని అతనిపై ఎలాంటి అపవాదు రాకుండా స్మృతి ఇరానీ చేసిన ప్రయత్నాలను కూడా వారు తిప్పికోట్టారు. బండారు దత్తాత్రేయ లేఖకు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు లేఖతో ముడిపెట్టడంపై కూడా వారు విమర్శలను గుప్పించారు. ఈ వ్యవహారంలో మోకాలికి బోడిగుండుకి లింకు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలని విహెచ్ రాసిన లేఖతో విద్యార్ధులపై చర్యలు కోరుతూ రాసిన లేఖకు ఎలా పోలిక పెడతారన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నాయి.

ఇక దళిత ప్రోఫెసర్లు యూనివర్సిటీ బోర్డు కమిటీలో సభ్యలుగా వున్నారన్న మంత్రి వ్యాఖ్యలుపై అవాస్తవాలను వాస్తవాలుగా మసిపూపి మారేడు కాయ చేసిన చందంగా వున్నాయన్న విమర్శలు వినబడుతున్నాయి. హెచ్ సీ యు చరిత్రలో ఇప్పటి వరకు దళిత ప్రోఫెసర్లకు బోర్డు కమిటీ సభ్యులుగా అవకాశమే రాలేదని విషయం కూడా తెలియకుండా కేంద్రమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తున్నారని, అబద్దాలను నిజాలుగా దేశప్రజలకు చెప్పే ప్రయత్నాలను మానుకోవాలన్న సూచనలు వినబడుతున్నాయి. ఇక విద్యార్ధులను సస్పెండ్ చేసిన కమిటీలో సభ్యులుగా వున్న దళిత ప్రోఫెసర్లు.. వారిని సస్పెండ్ చేశారన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై కూడా దుమారం రేగుతుంది. అసలు కమిటీలో దళిత ప్రోపెసర్లే లేరన్నది వాస్తవం.

అయితే కేంద్ర మంత్రికి తప్పుడు సమాచారం ఇచ్చారా..? లేక ఒక్క యూనివర్సిటీకి చెందిన అంశాన్ని దేశంలోని అన్ని యూనివర్సిటీ విద్యార్థులకు తెలియదు కాబట్టి.. అబద్దాలనే కేంద్ర మంత్రి చెప్పారా..? ఘటన జరిగిన తరువాత మూడు రోజులకు స్పందించినా.. సమాచరం మాత్రం అస్తవ్యస్తంగా ఎందుకు, ఎవరిచ్చారన్న ప్రశ్నలు తలెత్తతున్నాయి. దేశవ్యాప్తంగా ఏబివిపీని ఫటిష్టం చేయడానికి మంత్రివర్యులే ఇలా తప్పుడు సమాచారాన్ని ప్రకటించారా..? లేక తాము చెప్పింది నిజమని దేశప్రజల చేత నమ్మించే ప్రయత్నమా..? తప్పు తమపై కాకుండా.. దోషులెవరన్నది తేల్చకుండా.. కర్ర విరగదు పాము చావదు అన్న చందంగా అంశానికి పుల్ స్టాఫ్ పెట్టే యత్నం జరిగిందా..? అన్నది మంత్రివర్యులకే తెలియాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohith Vemula  Hyderabad Central University (HCU)  Smriti Irani  Dalit Professors  

Other Articles