Lokesh may set fro key role in central govt

Lokesh may set fro key role in central govt

Nara Lokesh, nara chandrababu naidu, TDP, Rajyasabha, Nara Lokesh for Rajyasabha, Lokesh

Lokesh may set fro key role in central govt. In the beginning, there are speculations that, Lokesh would be a minister in AP cabinet, but from the close sources, it is now found out that, Naidu is willing to make his son, Lokesh, sit in Rajya Sabha, expecting that, step would boost up his political career in Delhi.

కేంద్రంలో చక్రం తిప్పేందుకు లోకేశ్ సిద్దం..!

Posted: 01/13/2016 04:47 PM IST
Lokesh may set fro key role in central govt

ఏపి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో తలపండిన వ్యక్తి అని అందరికీ తెలుసు. రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా తనకు కావాల్సిన వ్యవహరాన్ని చకచకలా చేసుకోగల వ్యక్తి. కేంద్ర రాజకీయాల్లో చక్రంతిప్పగల సత్తా ఉన్న నేత. అయితే తాజాగా తన వారసుడు నారా లోకేశ్  కెరీర్ మీద లోకేశ్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం కీలకంగా మారిన లోకేశ్ ఇక మీదట కేంద్రంలో కీలకంగా వ్యవహరించేలా చేసేందుకు తండ్రి చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వచ్చే నాలుగు నెలల్లో నారా లోకేశ్ ను కేంద్రంలోకి పంపించేందుకు చంద్రబాబు ప్లాన్ సిద్దం చేశారట.

ఏపిలో ప్రస్తుతం 11 రాజ్యసభ స్థానాలున్నాయి. అందులో నాలుగు స్థానాలు తొందరలోనే ఖాళీ కానున్నాయి. నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, జెడి శీలం,జైరాం రమేష్ ల పదవీ కాలం తొందనలోనే ముగియనుంది. అయితే నిర్మలా సీతారామన్ ను మరోసారి పదవిలో కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మిగితా స్థానంలో లోకేశ్ ను దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే లోకేశ్ కేంద్రంలో ఉంటే ఏపికి కూడా లాభం చేకూరుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో మూడు సంవత్సరాల కాలంలో లోకేశ్ కు కేంద్రంలో మంచి పరిచయాలు ఏర్పడతాయని... అలాగే రాజకీయ అనుభవం కూడా ఏర్పడుతుందని చంద్రబాబు అనుకుంటున్నారట. అందుకే జూన్ లో లోకేశ్ కు రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టి దిల్లీకి మార్గం సుగమం చెయ్యడానికి చంద్రబాబు అంతా సిద్దం చేశారట. మరి చూడాలి చినబాబును దిల్లీకి పంపి.. కేంద్రంలో చంద్రబాబు ఎలా చక్రం తిప్పిస్తారో అని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Lokesh  nara chandrababu naidu  TDP  Rajyasabha  

Other Articles