Chandrababu to send Nara Lokesh to Rajya Sabha?

Chandrababu to send nara lokesh to rajya sabha

Lokesh, TDP, Rajyasabha, Chandrababu Naidu, Nara Lokesh

Speculations are rife that Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu's son and TDP general secretary Nara Lokesh will be sent to Rajya Sabha. There were rumours that Chandrababu was planning to make his son a minister in AP cabinet, but now the buzz is that he wants to field his son as his voice in Rajya Sabha.

రాజ్యసభకు లోకేశ్..?

Posted: 01/12/2016 01:19 PM IST
Chandrababu to send nara lokesh to rajya sabha

తెలుగుదేశం పార్టీలొ రాజకీయం రసవత్తరంగా మారిందా....? లోకేష్ కు ఇప్పటికే పార్టీలో కీలకంగా వ్యవహరించే స్వేచ్ఛ కల్పించిన చంద్రబాబు మరింత స్వేచ్ఛను  కల్పించనున్నారా...? అందులో భాగంగా లొకేష్ కు నేరుగా బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. నిన్న మొన్నటి దాకా కేవలం పార్టీ పదవులను మాత్రమే అనుభవించిన లోకేష్ ఇక మీదట ప్రజల సభలోకి వెళుతున్నారా అనే అనుమానాలకు దాదాపుగా తెర పడినట్లే చెబుతున్నాయి తెలుగుదేశం వర్గాలు. తాజాగా లోకేష్‌ను రాజ్యసభకు పంపే యోచనలో చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు.

లోకేష్‌ను రాష్ట్ర కేబినెట్‌లోకి తీసుకుని ఐటీ మంత్రిని చేస్తారని తొలుత వార్తలొచ్చాయి. అయితే ఢిల్లీ స్థాయి పదవితో చట్టసభల్లోకి ఎంటరయితే బాగుంటుందన్న అభిప్రాయానికి అధినేత వచ్చారని చెబుతున్నారు. హస్తిన స్థాయిలో పరిచయాలు పెంచుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను నడపడం ఈజీ అవుతుందని భావిస్తున్నారు. కేవలం రాజ్యసభతో సరిపెట్టకుండా కేంద్ర కేబినెట్‌లోకి కూడా చినబాబును చేర్చేలా వ్యూహరచన చేస్తున్నారట. లోకేష్‌ రాజ్యసభకు వెళ్లదలుచుకుంటే ఎవరూ అడ్డుచెప్పే పరిస్థితి లేకపోయినా ఏపీ నుంచి టీడీపీకి దక్కే మూడు రాజ్యసభ స్థానాలను ఎవరెవరితో భర్తీ చేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

కేంద్రమంత్రులు సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్ ఇద్దరి పదవి కాలం ఏప్రిల్‌లో ముగుస్తోంది. కాంగ్రెస్ ఎంపీలుగా ఉన్న జేడీ శీలం, జైరాం రమేష్ పదవి కాలం కూడా అదేసమయంలో ముగుస్తోంది. ఈ నాలుగు స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి వైసీపీకి దక్కుతాయి. మూడుస్థానాల్లో సుజనా, నిర్మల సీతారామన్‌కు రెన్యువల్ తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది. లేకుంటే వారి మంత్రి పదవులకు ఇబ్బంది వస్తుంది. ఒకవేళ లోకేష్‌ను కేంద్ర మంత్రిని చేయాలనుకుంటే సుజనాకు అవకాశం దక్కకపోవచ్చు అంటున్నారు. వీరే కాకుండా ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లేందుకు వెంకయ్యనాయుడు, యనమల రామకృష్ణుడు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నిజంగా లోకేష్‌బాబును రాజ్యసభకు పంపుతారా లేక మరో ఆలోచన చేస్తారా అన్నది తేలాలంటే మరికొద్ది నెలలు ఆగాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lokesh  TDP  Rajyasabha  Chandrababu Naidu  Nara Lokesh  

Other Articles