gaddam prasad kumar to jump into trs party

Another shock to telangana congress former minister to ride in car

gaddam prasad kumar, trs party, congress, vikarabad prasad congress, vikarabad prasad trs, vikarabad prasad, gaddam prased kumar congress, gaddam prased kumar trs, vikarabad chandrashekar, chandrashekar congress, sabitha reddy, sabitha indra reddy

former minister, vikarabad congress leader gaddam prasad yet to join ruling TRS party soon

కాంగ్రెస్ కు షాక్: కారు షికారుకు మాజీ మంత్రి సిద్దం

Posted: 12/18/2015 12:29 PM IST
Another shock to telangana congress former minister to ride in car

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలేలా వుంది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ త్వరలో కారులో షికారు చేయడానికి సిద్దమయ్యిన్నట్లు వార్తలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వికారాబాద్‌లో పార్టీ ముఖ్యులతో సుదీర్ఘ సమాలోచనలు జరిపిన ప్రసాద్ కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయానికి వచ్చారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరడం, భవిష్యత్తు కార్యాచరణను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరిక లాంఛనప్రాయమేనని తెలుస్తున్నప్పటికీ... ఈ నెల  23లోపు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోవాలని భావిస్తున్న ఆయన.. ఇందుకోసం అధికార పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారని సమాచారం.
 
అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్రసాద్‌కుమార్ కూడా లొంగిపోతారని తాము ఊహించలేక పోయామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. పార్టీలోకి వచ్చిన ఆయనకు పార్టీ అనతికాలంలో సముచిత స్థానం కల్పించి.. మంత్రిగా చేసి గౌరవించిందని, అపథ్కాల సమయంలో పార్టీకి అండగా వుండి.. సైనికుడిలా పోరాడాల్సిన నేతలు.. వలసలు పోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు రుసరుసలాడుతున్నారు. పార్టీ ఆఫర్ చేసిన ఎమ్మెల్సీ సీటును తిరస్కరించిన ప్రసాద్. అంతరంగం ఏంటన్న విషయాన్ని తాము పసిగట్టలేకపోయామని వారు అంటున్నారు.
 
కాగా తన మద్దతుదారులతో చర్చ సందర్భంగా భిన్నభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ విషయంలో మరోమారు ఆయన తన ముఖ్య అనుచరులతో సమావేశం కావాలని.. ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని భావించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌లో తనకిచ్చే ప్రాధాన్యం, పదవులపై స్పష్టమైన హామీని ప్రసాద్ ఇప్పటికే తీసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఎలాగైన తన పార్టీ మార్పు నిర్ణయానికి కట్టుబడివుండనున్నట్లు తెలుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gaddam prasad kumar  trs party  congress  

Other Articles