Chandrababu naidu | Employees | TDP

Chandrababu naidu may face defence by the govt employees

Chandrababu naidu, TDP, Revanth Reddy, Govt Employees, AP

Chandrababu Naidu may face defence by the govt employees. TDP Leaders giving waning to govt employees several times.

చంద్రబాబుకు వాళ్లే గండంగా మారతారా...?

Posted: 09/10/2015 04:51 PM IST
Chandrababu naidu may face defence by the govt employees

ఉరిమి ఉరిమి మంగళం మీద పడిందన్నట్లు… రాజకీయ నాయకులూ వాళూ వీళ్లు గొడవపడి ఫైనల్ గా అధికారులపై పడుతుంటారు. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అనేమీ తేడా లేదు. అధికారంలో ఉన్నవారు వాడుకుంటారు, ప్రతిపక్షంలో ఉన్నవారు బెదిరిస్తుంటారు. మొన్నీ మధ్యన వైసీపీ నాయకులు.. తాజాగా తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి అధికారులనే టార్గెట్ గా చేస్తూ మాట్లాడటం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కత్తెరలో పోకలా తమను అందరూ బెదిరించే వారేనని అధికారులు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినా ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోవాలి కానీ... తర్వాత మీ సంగతి చూసుకుంటాం అంటూ హెచ్చరించడం ఏంటని మండిపడుతున్నారు.

‘‘జీ.హెచ్.ఎం.సీ. కమీషనర్ సోమేష్ కుమార్ అంట.. కమీషనర్.. ఎక్కడెక్కడైతే టీడీపీ నేతలు పచ్చతోరణాలు కట్టినారో ఇవాళ వాటన్నింటినీ తీయించే పని చేస్తున్నారు.. బిడ్డా సోమేష్ కుమారు గుర్తుపెట్టుకో… నువూ ఇక్కడ కాదు మరలా రావలసింది మా దగ్గరికే… నువ్వు ఇయ్యాల‌ తెరాస కార్యకర్తగా మారి.. తెలుగు దేశం ఫ్లెక్సీలు తొలగిస్తున్నావ్ బిడ్డా.. అదే మేమనుకుంటే.. ఈ ట్విన్ సిటీస్ లో ఏ ఒక్క టీఆరెస్ జెండా కనిపించకుండా తీసి తగలుబెట్టేస్తా’’ మని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రజా ప్రతినిధి అయ్యి ఉండి ఇలా అధికారులను బెదిరించడమేమిటని పలువురు రేవంత్ ను ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం కాదని హితవు పలుకుతున్నారు!

మాగంటి బాబు, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, కెఈ కృష్ణమూర్తి ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డిలు మొత్తంగా టిడిపి నేతలు అందరూ ఉద్యోగులను బెదిరించడం పార్టీ మనుగడకు ఎంత మాత్రం మంచిది కాదు. అయితే చంద్రబాబు నాయుడుకు  గతంలో ఉద్యోగుల దెబ్బ రుచి తెలిసినా కూడా తన పార్టీకి చెందిన ముఖ్యులు మాట్లాడుతుంటే మాత్రం అడ్డుచెప్పలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడుకు ఉద్యోగ సంఘాలు గతంలో చుక్కలు చూపించాయి. అయినా మారకపోతే మాత్రం ఖచ్చితంగా పోయేకాలం దగ్గరే ఉందంటున్నారు శిశ్లేషకులు. తాను తప్పు చేసినా... తన వాళ్లు తప్పు చేసినా కానీ చివరకు అది చంద్రబాబు నాయుడుకే గండంగా మారుతుంది అంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  TDP  Revanth Reddy  Govt Employees  AP  

Other Articles