Telangana Minister Talasani Srinivas indirectly help the TDP and congress to be friends

Telangana minister talasani srinivas indirectly help the tdp and congress to be friends

Talasani, TDP, Congress, Telangana, Governor, KCR, Telangana govt

Telangana Minister Talasani Srinivas indirectly help the TDP and congress to be friends. In the Talasani Resignation issue the TDP and congress leaders close hands to oppose the issue.

టిడిపి, కాంగ్రెస్ మధ్యలో తలసాని

Posted: 07/20/2015 07:01 PM IST
Telangana minister talasani srinivas indirectly help the tdp and congress to be friends

శత్రువుకు శత్రువు అంటే మిత్రుడు అని వినే ఉంటారు. అయితే రాజకీయాల్లోనూ ఇది బాగా పనికి వస్తుంది. ఎందుకు అంటారా..? ఇద్దరు వ్యక్తులకు ఒకే శత్రువు ఉంటే కనీస పరిచయం  లేకున్నా కూడా ఇద్దరు కలిసి ఎదుటి తమ శత్రువును దెబ్బకొడతారు ఇది యుద్దనీతి. అయితే యుద్ద నీతి కన్నా కూడా రాజకీయ నీతి ఇంకా దారుణంగా ఉంటుంది. కానీ ఇలా అనే కన్నా నీతి అనేది లేకుండా ఉండేదే రాజకీయం అంటే బెటరేమో. ఇంతకీ విషయం ఏంటీ అంటే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ తాజాగా కనీసం రాజీనామా కూడా చెయ్యలేదు అని తేలింది. అయితే ఈ వార్తతో ఒక్కసారిగా టిడిపి, కాంగ్రెస్ నాయకులు అంతెత్తుకు ఎగిసిపడ్డారు.

తలసానిని బర్తరఫ్ చేస్తారా లేదా..? కేసీఆర్ కనీస చర్యలకు దిగుతారా లేదా..? గవర్నర్ ఎందుకు ఊరుకుంటున్నారు..? స్పీకర్ ఎందుకు నోరు విప్పడం లేదు..? తెలంగాణలోని కాంగ్రెస్, టీడీపీ నేతలు అడుగుతున్న ప్రశ్నలు. మీడియా మైకుల ముందు సమాచార హక్కు చట్టం కింద ధరఖాస్తు చేసి తెచ్చుకున్న సమాధాన పత్రాల సాక్షిగా చెబుతున్న మాటలు ఇవి. ఓటుకునోటు కేసులో ప్రజాస్వామ్యం తలదించుకునే పరిస్థితి వస్తే ఒక్క ఆంధ్రా మీడియా మాట్లాడలేదు. మాట్లాడకుంటే పాయె సిగ్గూ, ఎగ్గూ లేకుండా ఆంధ్రా బాబుకు, ఆయన వంధిమాగధులకు మద్దతు ఇచ్చి ..మద్దతు ఇస్తూ జర్నలిజం విలువలకే కళంకం తెచ్చాయి.

ఇప్పుడు తలసాని రాజీనామా గురించి టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఏకమై నెత్తినోరు బాదుకుంటున్నారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పంచన చేరిన నేతల గురించి నోరు మెదపలేని నాయకులు, తెలంగాణలో జనాల ముందు మొహాలు చెల్లక మీడియాకు పరిమితమయిన నాయకులు తలసాని రాజీనామా గురించి తండ్లాడుతున్నారు. దమ్ముంటే రాజీనామా చేయించాలని కేసీఆర్ కు, మంత్రి పదవిలో ఎలా ఉంచుతారంటూ గవర్నర్ కు సవాళ్లు, డిమాండ్లు విసురుతున్నారు. మొత్తానికి తలసాని కాంగ్రెస్, టీడీపీ నాయకులను ఓ తాటి మీదకు తేవడంలో సఫలం అయ్యారని చెప్పాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Talasani  TDP  Congress  Telangana  Governor  KCR  Telangana govt  

Other Articles