School dropout Baba Ramdev may soon get PhD degree from Haryana Agriculture University

Baba ramdev may soon get phd degree from haryana

ramdev, phd, yoga guru, doctorate degree manohar lal khattar, haryana agriculture university, former prime ministers Chaudhary Charan Singh, Narasimha Rao, Manmohan Singh, former deputy PM Chaudhary Devi Lal, former Haryana CMs Bansi Lal and Bhupinder Singh Hooda, Haryana Chief Minister Manohar Lal Khattar, Haryana Governor Kaptan Singh Solanki

Yoga guru Baba Ramdev a school dropout will reach Hisar in Haryana on July 26, may soon get an honourary doctorate degree from Haryana Agriculture University on ts 24th convocation.

బిజేపి స్వామి భక్తి.. బాబా రాందేవ్ కు డాక్టరేట్..?

Posted: 07/19/2015 12:40 PM IST
Baba ramdev may soon get phd degree from haryana

మునుపెన్నడూ లేని విధంగా బిజేపి తన స్వామి భక్తిని చాటుకుంటూ ముందుకు సాగుతోంది. దాదాపుగా మూడు దశాబ్ధాల అనంతరం ఏకఫక్ష మోజారిటీతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ ప్రభుత్వం.. ఇందుకు కారణమైన వారిని విస్మరిచకుండా వారికి గౌరప్రదమైన అవార్డులను అందజేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే తొలిసారిగా నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో జాబితాలోనూ పలువరు ఆద్యాత్మిక వేత్తలు, గురుజీలు వుండటం వివాదాస్పదంగా మారగా.. కేంద్రం జాబితాను కుదించింది.

ఆ తరువాత మరోమారు ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం  అదేంటంటారా..? ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ కు డాక్టరేట్ పట్టాను అందించనున్నారు. అయితే దీనికి పూనుకుంది మాత్రం హర్యానా రాష్ట్రప్రభుత్వమని తెలుస్తుంది. ఈ నెల 26న హర్యానాలోని హిస్సార్ లో గల హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి హర్యానా రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా వున్న బాబా రాందేవ్ ను ముఖ్య అతిధిగా అహ్వానించారు. కాగా ఈ కార్యక్రమంలోనే ఆయనకు డాక్డరేట్ పట్టాను అందించనున్నారని తెలుస్తుంది.

ఈ కార్యక్రమానికి మరో ముఖ్యఅతిధిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ చేతుల మీదుగా డాక్టరేట్ ను స్వీకరించనున్నారని సమాచారం. డాక్టరేట్ ప్రధానం కసం బాబా రాందేవ్ అనుమతి కోరుతూ ఆయనకు విశ్వవిధ్యాలయం అధికారులు లేఖ కూడా రాసినట్లు తెలిసింది. అయితే ఈ విశ్వవిద్యాలయం నుంచి ఇప్పటకే పలువరు మాజీ ప్రధానులు, చౌదరి చరణ్ సింగ్, పివీ నర్సింహా రావు, మన్మోహన్ సింగ్ లతో పాటు మాజీ డిప్యూటీ ప్రధాని చౌదరి దేవీలాల్ తదితరులు గౌరవ డాక్టరేట్ లు ప్రధానం చేశారు. కాగా విద్యాభ్యాసాన్ని మధ్యలోనే వదిలేసిన బాబా రాందేవ్ డాక్టరేట్ పట్టాను అందించనున్నారన్న వార్తలపై విద్యావంతులు మండిపడుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yoga guru  baba ramdev  doctorate  manohar lal khattar  haryana agriculture university  

Other Articles

 • N korea s kim jong un appears in public amid health rumours

  ప్రజల ముందుకొచ్చినా.. కిమ్ విషయంలో తెరపడని అనుమానాలు.?

  May 02 | ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మృతిపై ప్రపంచదేశాల మీడియాకు అనుమానాలు వీడటం లేదు. పలు దేశాల మీడియా ఆయన అరోగ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మరణించాడంటూ ఓ వీడియో కూడా... Read more

 • Why ruling party activists obstruct oppositions from contesting elections

  బ్రహ్మరథం పడితే అడ్డుకోవడాలెందుకనో సీఎంగారూ.?

  Mar 11 | స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిపించాలని.. అందుకు ఎన్నికల అధికారులు కూడా అన్ని విధాలా సహకరించాలని సాక్ష్యాత్తు రాష్ట్రోన్నత న్యాయస్థానం అదేశాలు ఇచ్చిన గంటల వ్యవధిలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల పర్వం అధికార... Read more

 • Yes bank crisis center actions create tension in account holders

  యస్ బ్యాంకు సంక్షోభం: సేఫ్ అంటూనే టెన్షన్.. టెన్షన్..

  Mar 07 | యస్ బ్యాంకు తీవ్ర ఆర్థిక సంక్షోబంలోకి నెట్టివేయబడింది. సరిగ్గా బీజేపి అధికారంలోకి వచ్చి ఆరేళ్లు కావస్తున్న తరుణంలో.. ఈ ఆరేళ్ల నుంచే ఈ బ్యాంకు నష్టాలు అంతకంతకూ పెరుగుతూ.. ఏకంగా రెండు లక్షల కోట్ల... Read more

 • Constable sridhar reddy transfered for kicking father of deceased student

  కనికరం లేని కానిస్టేబుల్ పై బదిలీ వేటుతో సరా..?!

  Mar 07 | సంగారెడ్డి జిల్లా పోలీసుశాఖకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకునేనా.? అంటే ఘటన సద్దుమణిగేంత వరకు మాత్రమే ఈ చర్యల ప్రభావం వుంటుందన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. అతడిపై తాత్కాలికంగా హెడ్ క్వార్టర్... Read more

 • Ysrcp confirms rajya sabha ticket to ex apcc chief

  రఘువీరా రెడ్డికి రాజ్యసభ.. వైసీపీ నయా ఫ్లాన్.?

  Feb 26 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నింటా తమ ముద్ర వేసుకునేందుకు రాజీలేని ప్రయత్నాలతో ముందుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నాలుగు రాజ్యసభ ఎంసీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఈ స్థానాలకు... Read more

Today on Telugu Wishesh