Chandra Babu claims others' achievements

Ap cm chandra babu s worst covering

ap cm chandrababu, delhi tour, press meet, google, nara lokesh, K Taraka rama rao, microsoft, adoption of village, lokesh US tour, KTR america tour, google to set up largest office in hyderabad

AP CM Chandra Babu's worst covering on nara lokesh america trip, says google largest office in hyderabas is his achievements

బాబు గారి బడాయిలు భూమండలమే దాటు..!

Posted: 05/19/2015 03:51 PM IST
Ap cm chandra babu s worst covering

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ మధ్య బడాయిల బాబుగా మారుతున్నారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే.. తన ఇంట్లో ఈతల మోత వెంటాడినా.. బయట మాత్రం పల్లకీల మోతకు తానే కారణమన్నట్లు వుంది. అయితే బాబు గారి బడాయిలు ఇలా ఎందుకు అంతకంతకు పెరుగుతన్నాయన్న విషయంలో పలువురు తెలుగు తమ్ముళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం లేకపోలేదన్న వాళ్లు వున్నారు. ఢిల్లీలో గత రాత్రి ఏర్పాటు చేసిన ప్రతికా సమావేశంలో ఆయన బడాయిలు చూసి.. అయ్య బాబోయ్ .. ఈయన గారి బడాయిలు భూ మండలాన్ని కూడా దాటేస్తున్నాయ్ అంటూ చెవులు కోరుకున్న వాళ్లు లేకపోలేదు.

ఇంతకీ విషయం ఏమింటంటే.. రెండు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ పలువురు జాతీయ నేతలు, కేంద్రమంత్రులతో బిజీబిజీగా గడిపారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థను తీసుకువచ్చింది తానేనని చెప్పుకోచ్చారు. అంతేకాదండోయ్, అదే క్రమంలో ఇప్పుడు గూగుల్ సంస్థ నగరంలో అతిపెద్ద కార్యాలయం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని, అందుకు తాను గతంలో  అనుసరించిన విధానలవల్లే కారణమని చెప్పుకోచ్చారు.
ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టు ఇత్యాదుల గురించి చెబుతారనుకుంటే.. హైదరాబాద్ లో గూగుల్ సంస్థ ఏర్పాటుకు ముందుకు రావడం తన ఘనతేనని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు దక్కాల్సిన క్రెడిట్ ను కోట్టివేయడం ఏమిటని మీడియా ప్రతినిధులే విస్తుపోయారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు అమెరికా పర్యటనలో గూగుల్ సంస్థతో పాటు గూగుల్ లో హైదరాబాద్ వీధులను వీక్షించే ఒప్పందాలతో పాటు మరెన్నో ప్రాజెక్టులను తీసుకురావడంతో.. ఆ క్రెడిట్ అంతా తమదని ఎక్కడ చెప్పుకుంటారోనని ఆయన ముందుగానే తన విధానాలే ఇందుకు దోహదపడ్డాయని ప్రతికా ప్రకటన ఇచ్చేశారు.

అది కాదు అసలు విషయం ఏమిటంటే.. తన కుమారుడు నారా లోకేష్ బాబు కూడా అమెరికా వెళ్లి 2500 గ్రామాలను దత్తత తీసుకునేలా చేసుకుని తిరిగి వచ్చారని, ఇన్నాళ్లు బడాయిలు చెప్పుకున్న టీడీపీ శ్రేణులు.. లోకేష్ కంటే కేటీఆఱ్ నయం ఆయన ఏకంగా ప్రాజెక్టులనే పట్టుకోచ్చరని చెప్పుకోకూడదని.. బాబు గారు తన ఘనత చెప్పుకుంటే అక్కడితో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తనయుల మధ్య ఎవరు గోప్ప అన్న విషయం అక్కడితో ఆగిపోతుందని బాబు గారు ఇలా చెప్పుకోచ్చారని మరికోందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. ఇక మరికోందరు అంత బడాయిలు చెప్పుకుంటున్న బాబు నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cm chandrababu  delhi tour  press meet  

Other Articles