telangana congress leaders | congress high command | mlc seat

Telangana congress leaders lobby high command for mlc seat

telangana congress leaders lobby high command for mlc seat, 40 congress leaders aspiring for one mlc seat,Congress, MLC seat, 40 members, telangana congress, mlc condidate, congress, delhi tour, telangana congress leaders,| congress high command, mlc seat

telangana congress leaders aspiring mlc seat grows lobbying at delhi with high comand for the same

హస్తినలో ఎవరి ‘హస్త’వాసి ఫలించేనో..?

Posted: 05/19/2015 03:43 PM IST
Telangana congress leaders lobby high command for mlc seat

తెలంగాణ కాంగ్రెస్ నేతలు హస్తినకు క్యూ కట్టారు. తమ హస్తవాసి ఎలా వుందో అక్కడ పరీక్షించుకోనున్నారు. అదేంటి.. హస్తికలో హస్తవాసీ పరీక్షలు జరుగుతున్నాయా అంటే అలాంటిదేమీ లేదు. అయితే.. శాసనసభ్యుల కోటా నుంచి కాంగ్రెస్ పార్టీకి దక్కబోయే ఒకే ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఆశావహుల సంఖ్య భారీగా పెరిగిపోవడం.. దీంతో ఎవరికి వారు ఢిల్లీకి వెళ్లి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అదేనండీ లాభియింగ్ చేసి ఎలాగోలా తమకు  ఎమ్మెల్సీ సీటు లభించేలా ప్రయత్నాలు ప్రారంభించారు.

ఒక్కడానోక్క ఎమ్మెల్సీ స్థానానికి సుమారుగా 40 మంది నేతలు పోటీ పడుతుండటం కాంగ్రెస్ అధిష్టానానికి కూడా ఇబ్బరికర పరిణామాంగా తయారైంది. నామినేషన్లకు మరో 48 గంటల సమయం మాత్రమే గడువు ఉండడంతో ఆశావహులు ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద తమకు ఉన్న పరపతిని ఉపయోగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పోటీచేసి ఓడిపోయిన వారికి అవకాశం ఇచ్చేది లేదని అధిష్టానం యోచిస్తున్నట్టుగా పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.

పార్టీకోసం పూర్తికాలం పనిచేసేవారు, అంకితభావం ఉన్నవారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి మహిళకు అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన కూడా అధిష్టానం వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. అయినా కొందరు  ఎలాగైనా ఎమ్మెల్సీ పదవిని కైవసం చేసుకోవాలని ఢిల్లీలో రెండురోజులుగా మకాం వేశారు. పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య వంటివారు ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులు, సీనియర్లు కొందరు అక్కడే ఉండి ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు.

గత ఎన్నికల్లో పోటీచేయడానికి అవకాశం రానివారు కూడా తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కోరుతున్నారు. మహిళకు అవకాశం ఇవ్వవచ్చనే వార్తల నేపథ్యంలో పలువురు మహిళలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ అధ్యక్షురాలు ఆకుల లలిత, పొన్నాల లక్ష్మయ్య కోడలు వైశాలి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి మహిళా కోటాలో ముందు వరుసలో ఉన్నారు. అయితే, తెలంగాణ రాష్ట్రా కాంగ్రెస్ నేతలు తమ శక్తిమేరకు హస్తినలో పోటాపోటీగా లాబీయింగ్ చేస్తున్నా.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక వ్యవహారంలో అధిష్టానం మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఎవరికి వారు తమకే ఎమ్మెల్సీ సీటు ఖాయం అవుతుందని ధీమాతో వున్నారు. పోటీ తీవ్రంగా వున్న నేపథ్యంలో ఎల్లుండి అనగా గురువారం మధ్యహ్నాం అధిష్టానం పేరును వెల్లడిస్తుందని సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana congress  mlc condidate  congress  delhi tour  

Other Articles