TDP party may provide pentions for its party leaders

Tdp party may provide pentions for its party leaders

TDP, Pentions, Ap, Leaders, Membership, chandrababu, Achennaidu, Cabinet

TDP party may provide pentions for its party leaders. In AP cabinet meeting ap minister achennaidu propose to do some thing for party leaders, So the govt propose to give pentions for party leaders.

పచ్చ చొక్కవోళ్లకు పింఛన్లు.. ?!

Posted: 05/07/2015 12:46 PM IST
Tdp party may provide pentions for its party leaders

వడ్డించే వాడు మనవాడు అయితే బంతి చివర్లో కూర్చున్నా మన వాటా మనకు వస్తుంది అని తెలుగులొ ఓ చందం ఉంది. అచ్చంగా ఈ చందానికే అన్నట్లు తెలుగు తమ్ముళ్ల వ్యవహారం ఉంది. అవును పచ్చ చొక్కా వేసుకున్నోళ్లకు పింఛను అనగానే మనం కూడా పక్క చొక్కా వేసుకుందాం చెక్కేద్దాం.. పింఛను కొట్టేద్దాం అనుకుంటున్నారేమో అస్సలు కుదరదు. ఎందకంటే రూల్ ఈజ్ రూల్ కానీ బయటివాళ్లకు మాత్రమేనట. సాధారణంగా బలహీనవర్గాల ప్రజలకు, ఎలాంటి ఆసరా లేనివారికి పింఛన్లు ఇవ్వటం మామూలే.. కానీ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఒక కొత్త సంప్రదాయానికి ఏపీలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం తెరలేపిందని సమాచారం. ఇప్పటికే కార్యకర్తలకు లైప్ ఇన్సూరెన్స్ చేయించిన తెలుగుదేశం పార్టీ, ఇక మీదట పార్టీ కార్యకర్తలకు సైతం పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుందట.

తమ వెంట నడిచే కార్యకర్తలకు ప్రభుత్వపరంగా ఏదో ఒకటి చేయాలని ఏపి మంత్రులు ఎంతోకాలంగా ఆలోచిస్తున్నారట. ఈ విషయాన్ని పార్టీ అధినాయకుడు, ముఖ్యమంత్రి చెవిలో వేసేందుకు సమయంకోసం ఎదురుచూశారని, తాజాగా జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశంలో కార్మిక, యువజన క్రీడలశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తన మనసులో మాటను కేబినెట్ సమావేశంలో చంద్రబాబునాయుడికి చెప్పడంతో ఆయన అంగీకరించారని ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వం ప్రకటించే పలు సంక్షేమ పింఛన్లను పార్టీ కార్యకర్తలకు, వారి బంధువులకు ఇస్తారన్నమాట! ఏపీలో తమకు 54లక్షలు ఉందని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇందులో క్రియాశీల సభ్యులు దాదాపు 31 లక్షల మంది ఉంటారని వారు పేర్కొంటున్నారు. వీరికి తలా వెయ్యి రూపాయల చొప్పున పింఛను ఇచ్చినా.. నెలకు రూ.310 కోట్ల పైమాటే! ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న రాష్ట్రంలో ప్రజా సంక్షేమ నిధులను పార్టీ కార్యకర్తలకు మళ్లించడమేంటనే ప్రశ్న తలెత్తుతున్నది. వాటన్నింటినీ పక్కనపెట్టి.. కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యంగా ఈ వ్యవహారానికి ఆలోచన జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా పచ్చ చొక్క వోళ్లకు పచ్చ నోట్లు పింఛన్ రూపంలో వస్తాయంటూ అప్పుడే కొంత మంది సంబరాలు కూడా చేసుకుంటున్నారట.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  Pentions  Ap  Leaders  Membership  chandrababu  Achennaidu  Cabinet  

Other Articles