Naralokesh | Nara chnadrababu | TDP, President,

Nara lokesh may announced as tdp party president

Naralokesh, Nara chnadrababu, Capital city, TDP, President,

Nara lokesh may announced as tdp party president. Telugu desam party president nara chandrababu naidu very busy in ap capital city, so he think to appoint lokesh as tdp president.

టిడిపి అధ్యక్షుడిగా నారా లోకేష్..?

Posted: 05/07/2015 05:09 PM IST
Nara lokesh may announced as tdp party president

తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారా? ఒక పక్క ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా చంద్రబాబునాయుడు.. తరతరాలు గుర్తుంచుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టేందుకు టీడీపీ ఏపీ బాధ్యతలు కొత్తదళపతికి అప్పగిస్తారా.. అన్న వార్తలు అటు అమెరికా నుంచి ఇటు రాష్ట్రంలోనూ హల్ చల్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఈ నెలలో జరిగే మహానాడులో తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించి.. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించడంతో పాటు.. ఏపీ తెలుగుదేశం పార్టీ బాధ్యతలను చినబాబుకు అప్పగించవచ్చని.. ప్రచారం జరుగుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న నారా లోకేష్ అక్కడ పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడుగా మీరు ఉంటే బాగుంటుంది గదా అని కొందరు ఎన్ ఆర్ ఐలు ప్రస్తావించగా ... ఇప్పటికే లైన్ క్లియర్ అయిందని త్వరలోనే మీరు ప్రకటన చూస్తారని లోకేశ్ .. చల్లగా చెప్పారట. ఇది తెలుసుకున్న ఎన్.ఆర్.ఐలు ఇప్పుడు లోకేష్ చుట్టూ తిరుగుతున్నారట. కాబోయే అధ్యక్షుడ్ని ప్రసన్నం చేసుకునే యత్నంలో ఉన్నారట.

యువనేత పార్టీ అధ్యక్షుడైతే చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షుడి బాధ్యతలు, ముఖ్యమంత్రి పదవికి అవుతారు. దీంతో లోకేష్ అధినేత అయితే తమ తలనొప్పి అని భావిస్తున్నారు కొందరు సీనియర్లు తెగ బాధ పడిపోతున్నారు. చంద్రబాబు ఎదుట ఈ విషయాన్ని ప్రస్తావించాలా వద్దా తెలియక మీమాంసలో పడిపోతున్నారట. ములాయం సింగ్ అఖిలేశ్ ను ఏకంగా యూపీ సీఎం చేశారు. సోనియా నేడో రేపో రాహుల్ కు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించేలా ఉన్నారు. అందువల్ల ఎవరు ఏమనుకున్నా, కాదన్నా లోకేష్ ను పార్టీ అధ్యక్ష పీఠం మీద కూర్చోపెట్టాలన్నదే బాబు కోరికట. అందుకే సారధ్య బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే నారాలోకేశ్ ఏపీ పగ్గాలు చేపడతారులేదా. అన్న నందమూరి తారక రామారావు 1982, మార్చి 29న ప్రారంభించిన తెలుగుదేశం పార్టీకి మూడో అధ్యక్షుడిగా లోకేష్ పగ్గాలు అందుకుంటారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naralokesh  Nara chnadrababu  Capital city  TDP  President  

Other Articles