BJP | Modi | Kishan Reddy | Nagam

Telangana bjp leaders arr waiting to change the party

BJP, Modi, Kishan Reddy, Nagam, Telangana

Telangana BJP leaders arr waiting to change the party. Some BJP leaders already joined into TRS party. After formation of Telangana state. BJP Party hope to handover power in telangana.

తెలంగాణ కమలంలో లుకలుకలు

Posted: 05/02/2015 10:31 AM IST
Telangana bjp leaders arr waiting to change the party

దేశ మంతా మోడీమయం… పది కోట్లకు పైగా సభ్యత్వం…. సింగిల్ హ్యాండ్ అధికారం… ఇక పార్టీకి తిరుగులేదనుకున్నారు బీజేపీ నేతలు. కానీ కొత్తగా పార్టీలోకి వచ్చే వారి మాట అటుంచితే.. పాత వారిని కాపాడుకోలేని పరిస్థితి తయారయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ముందు కొందరు పార్టీకి గుడ్ బై చెప్పగా.. ఇప్పుడు మరికొంతమంది అదే రూట్ లో వెళ్లేందుకు రెడీ అవుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. కొత్త, పాత నేతల మధ్య కొట్లాటలే దీనికి కారణంగా తెలుస్తోంది.

ఇప్పటికే జిల్లాస్థాయి నేతలు ఒకరిద్దరు కమలం నుంచి బయటకు జంప్ చేశారు. ఇప్పుడు స్టేట్ లెవల్ లీడర్స్ కొందరు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా వినిపిస్తున్నది నాగం జనార్థర్ రెడ్డి పేరే. పార్టీ కార్యాలయంలో కాకుండా వేరే ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం కూడా దీని ఎఫెక్టే అంటున్నారు నేతలు. నాగం మాత్రం అదేం లేదంటున్నారు. నేతలు పార్టీని వీడేందుకు ప్రయత్నిస్తున్నా… పార్టీ పెద్దలు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలులేకపోలేదు. అలా నాగం జనార్దన్ రెడ్డి ఒక్కడే కాదు చాలా మందే క్యులో ఎఉన్నట్లు సమాచారం. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి వస్తామని నమ్ముతున్న బిజెపికి ఇది పెద్ద దెబ్బే. ఐతే.. పార్టీ నిర్ణయాలు నియమ నిబంధనల ప్రకారం నడుచుకుంటేనే ఫ్యూచర్ ఉంటుందని చెబుతున్నారు బీజేపీ నేతలు. వచ్చే ఎలక్షన్ నాటికి పూర్తిస్థాయి శక్తి వంతంగా తయారువుతామని చెప్పుకుంటున్న నేతల మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. పార్టీ అద్యక్షుడే స్వయంగా చెప్పినా నేతల్లో మార్పు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Modi  Kishan Reddy  Nagam  Telangana  

Other Articles