talasani srinivas yadav warning to andhra film makers

Talsani warns tollywood big shots

talsani warns Tollywood big shots, telanangana governement always suport to cine industry, telangana minister talasani srinivas yadav, andhra film makers, chandrababu, dasari narayan rao, rajendra prasad, Tollywood news, tollywood may day celebrations, warnings, Tollywood, big shots, maa elections

talasani srinivas yadav warning to andhra film makers to stop roaming to chandrababu house

టాలీవుడ్ లో ఎవరికీ.. తలసాని వార్నింగ్..?

Posted: 05/01/2015 11:02 PM IST
Talsani warns tollywood big shots

తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. సభాముఖ్యంగా టాలీవుడ్ పెద్దలకు వార్నింగ్ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఉదయం లేస్తూనే చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగే అలవాటు మానుకోవాలని తలసాని సూచించారు. శుక్రవారం నాడు ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌లో మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌తో పాటుగా సినీ ప్రముఖులు దాసరి నారాయణ రావు, ‘మా’ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ లో వున్నవాళ్లంతా తెలంగాణ వాళ్లేనంటూనే.. తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో లోపాలు వుండని, ఇక్కడ పరిపాలించేది తెలంగాణ ప్రభుత్వమని గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. సినిమా ఇండస్ట్రీపై ఏ ఒక్కరు ఆదిపత్యం ప్రదర్శించాలని చూసినా బాగోదని అన్నారు. అది ఎవరి జాగీర్ కాదని చెప్పారు. ఇక్కడ ఎవరి గుత్తాధిపత్యం నడవదన్నారు. ఇందుకు ఇటీవల జరిగిన మా అధ్యక్ష ఎన్నికలలో గెలిచిన రాజేంద్రప్రసాద్ గెలుపే ఉదాహరణగా ఆయన చెప్పుకోచ్చారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఆయన జారీ చేసిన హెచ్చరికలు ఎవరికి వర్తించనున్నాయన్న అంశంలో మాత్రం ఎవరికి వారు మాకు కాదని బాహాటంగా బయటకు అంటూనే.. లోలోన మాత్రం మమ్మల్ని కాదు కదా..? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉదయం లేచింది మొదలు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిచుట్టూ పచార్లు కోట్టే వారి జాబితాలో తాము లేమంటూనే.. తమను తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేసిందా..? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఓ వైపు సందేహాలను  వ్యక్తం చేస్తూనే.. హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అన్న విషయం మర్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారని, తాము ఉమ్మడి రాజధానిలో వున్నామని ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు. అయితే తలసాని ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యాలు చేశారన్న విషయం అందరికీ తెలిసిందేనని సినీవర్గాలు అంటున్నాయి.

జి మనోహర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : talasani srinivas yadav  warnings  Tollywood  big shots  

Other Articles