Harisha rao | TRS | KCR | KTR

Is it harisha rao chapter closed in trs party

harisha rao, kcr, ktr, TRS, party, irrigation, plenary, hyderabad

Is it Harisha rao chapter closed in TRS Party? Since one year harisha rao maintains gap between the TRS and kcr. Kcr son ktr getting more effect after kcr.

టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావ్ కథ ముగిసిందా..?

Posted: 04/25/2015 10:08 AM IST
Is it harisha rao chapter closed in trs party

టిఆర్ఎస్ పార్టీలో కూడా వారసత్వ పోరు నడుస్తోందా.. కేసిఆర్ తన కొడుకు కేటిఆర్ కే ప్రాధాన్యత ఇస్తున్నాడా.. అందుకే హరీష్ రావ్ ను తొక్కేస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఇదే విషయాలను అద్దం పడుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుండి మేనమామకు అండగా నిలిచిన హరీష్ రావ్ పార్టీలో ఇప్పుడు ఎందుకు వెనుకబడ్డారు.. వెనుక బడ్డారా లేక కెటిఆర్ వల్ల వెనక్కి నెట్టారో తెలియదు. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీలో హరీష్ రావ్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. కానీ గత కొంత కాలంగా పార్టీలో నెంబర్ టూ స్థానం నుండి చాలా దూరం వెళ్లిపోయారు. ప్రతిపక్షాలను తన మాటలతో కట్టడి చెయ్యగల హరీష్ రావ్ గత కొంత కాలంగా కొన్ని మాటలకు మాత్రమే పరిమితమవుతున్నారు. అసలు హరీష్ రావ్ మౌన ముద్ర వెనుక ఆంతర్యం ఏంటీ అనే ప్రశ్నలకు సమాధానం.

టీఆర్‌ఎస్ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరించే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఈ ప్లీనరీ ఏర్పాట్లలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ప్లీనరీ కోసం ఏర్పాటు చేసిన ఏడు కమిటీల్లో ఎందులోనూ ఆయన లేరు. హరీష్ రావ్ ప్లీనరీ వేదికపై కనిపించక పోవడంతో అసలు ప్లీనరీకి హాజరయ్యారా..? లేదా అంటూ కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది. హరీశ్ ఏడీ..? ఎక్కడా అంటూ మీడియా ప్రతినిధులూ ఒకరినొకరు వాకబు చేసుకున్నారు. చివరకు ఆయన వేదికపైనే, వెనుక వరుసలో ఉన్నారన్న సమాచారం అందడంతో, ముందు వరుసలో ఉండాల్సిన ఆయన వెనుకకు ఎందుకు వెళ్లారన్న చర్చా జరిగింది.

సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ అంశాలపై తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు హరీశ్‌రావు మైక్ ముందుకు రాగానే, ప్రతినిధుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. సుమారు మూడు.. నాలుగు నిమిషాల సేపు కేకలతో ఉత్సాహం ప్రకటించారు. హరీశ్ ప్రసంగం మొదలు పెట్టినా, కేకలు ఆపలేదు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అని మధ్యలో నినాదం చేసి హరీశ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కార్యకర్తల నుంచి కేకలు నిలిచిపోయాయి. ఈ సమయంలో సభా వేదికపై ఉన్న నేతలంతా కార్యకర్తల వైపు, హరీశ్ వైపు చూస్తూ ఉండిపోయారు.

మొత్తానికి టిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలిచిన హరీష్ రావ్ ను పార్టీ ఎందుకు దూరంగా ఉంచుతోంది.. కెటిఆర్ విదేశాల నుండి తిరిగి వచ్చిన దగ్గరి నుండి హరీష్ రావ్ దూకుడు తగ్గించారు. అంతవరకు మాటల తూటాలు పేలుస్తూ.. కెసిఆర్ తర్వాత టిఆర్ఎస్ పార్టీ గొంతు అన్న ముద్ర వేసుకున్న హరీష్ రావ్ మౌనం పార్టీలో ఎన్నో ప్రశ్నలకు రేకెత్తిస్తోంది. అందరూ అనుకుంటున్నట్లు హరీష్ రావ్ ను కేటిఆర్ తొక్కేస్తున్నాడా.. కేసిఆర్ తన కొడుకునే వారసుడిగా ప్రకటించాలని అనుకుంటున్నాడా.. ఇలా టిఆర్ఎస్ పార్టీలో సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ మధ్య కేటిఆర్ కు హరీష్ రావ్ కు మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దాంతో హరీష్ వేరు కుంపటి పెడుతున్నారు అన్న వార్తలూ వచ్చాయి. కానీ తరువాత మళ్లీ హరీష్ టిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలంగా మారారు. మరి ఈ సారి కెటిఆర్ దెబ్బకు హరీష్ రావ్ నిజంగా వేరు కుంపటి పెట్టాల్సి వస్తుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. మరి ఆ వార్తలు నిజమవుతాయో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : harisha rao  kcr  ktr  TRS  party  irrigation  plenary  hyderabad  

Other Articles