Keep jethmalani away bring harish salve

Jayalalithaa, Ram Jethmalani, Harish Salve, supreme court, bail petition, karnataka high court

Keep jethmalani away, bring Harish salve, jaya says to party men

జఠ్మలానీని పక్కనబెట్టి సాల్వేతో పనికానీయండి..

Posted: 10/09/2014 04:11 PM IST
Keep jethmalani away bring harish salve

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత...ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ పక్కన పెట్టినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసే సమయంలో రామ్ జెఠ్మలానీనీ పక్కనబెట్టి.. మరో ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేతో పని కానించేయమని ఆమె తన అనుఛర గణానికి చెప్పినట్లు తెలుస్తోంది. జయలలిత తరపున ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక హైకోర్టులో రాంజెఠ్మాలనీ వాదనలు వినిపించారు. అయితే న్యాయాస్థానం అమెకు బెయిల్ ను మంజూరు చేయలేదు. బెయిల్ మంజూరు చేయడానికి స్పష్టమైన కారణాలు ఏమీ లేవంటూ న్యాయస్థానం బెయిల్ ను తిరస్కరించింది.

ఈ నేపథ్యంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జయలలిత తరపున న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. అక్కడైనా ఆమెకు బెయిల్ దక్కేనా అన్న చర్చ ఓ వైపు సాగుతుండగానే.. రాంజెఠ్మలానీని కేసు నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. కర్ణాటక హైకోర్టలోనే సాధ్యం కాని బెయిల్.. సుప్రీంకోర్టులో సాధ్యమయ్యేనా అన్న చర్చకు తెరలేచింది. కర్ణాటక హైకోర్టులో నలుగురూ కలసి ఒకే సమయంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినందుకే చుక్కెదురయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జయలలిత తరపు న్యాయవాదుల నిర్లక్ష్యంతోనే బెయిల్ లభించలేదని చర్చించుకుంటున్నారు. అయితే సుప్రీంకోర్టులో తన వాదనలతో న్యాయమూర్తలను ప్రభావితం చేసి బెయిల్ తీసుకురాగల సమర్ధులు రాంజెఠ్మలానీ అని.. జయలలిత సుప్రీంకోర్టులో ఆయనను ఎందుకు తప్పించిందని కూడ చర్చలకు తెరలేచింది. మరోవైపు న్యాయవాది జెఠ్మలానీ వృద్దాప్యంలోకి జారుకోవడం కూడా బెయిల్ లభ్యం కాకపోవడానికి కారణంగా పలువురు చెప్పుకుంటున్నారు.  మరి హరీష్ సాల్వే అయినా అమ్మను జైలు నుంచి బయటకు రప్పిస్తారేమో చూడాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  Ram Jethmalani  Harish Salve  supreme court  bail petition  karnataka high court  

Other Articles