Kannadiga s are threatened of white sari

Jayalalithaa, 4 years jail, white saree, tamilnadu, bail petition, karnataka high court

Kannadiga's are threatened of 'white sari'

కన్నడీగులను భయపెడుతున్న ‘తెల్లచీర’

Posted: 10/08/2014 02:56 PM IST
Kannadiga s are threatened of white sari

కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రస్తుతం 'తెల్లచీర' భయపెడుతోంది. అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు నిబంధనల ప్రకారం తెల్ల దుస్తులు ధరించాలి. అయితే జయలలిత మాత్రం ఇందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం. నేడో రేపో బెయిల్ వస్తుంది.. అందాక అగండని జైలు అధికారులను ఒప్పించిన జయలలిత.. మరిప్పుడేం చేస్తారు. నిబంధనల ప్రకారం తెల్లచీరను ధరిస్తారా..? లేదా అన్నదే చర్చనీయాంశమైంది.

తమ నాయకురాలికి బెయిల్ రాకపోతే కన్నడీగులకు కష్టాలు తప్పవని పోస్టర్లు వెలిసిన క్రమంలో జయలలితను తెల్లచీర కట్టుకోవాలని ఆదేశిస్తే.. పరిస్థితి ఎలా వుంటుందోనని జైలు అధికారులకు మచ్ఛమటలు పడుతున్నాయి. దోషిగా కోర్టు నిర్థారించిన తరువాత సాధరణ ఖైదీలందరూ జైలులో తెల్లచీరలు కట్టకోవాలని నిబంధలు చెబుతున్నాయి. అయితే ఒక పార్టీ అధినేత్రిగా జయలలిత నిబంధనను అచరిస్తారా..? లేక ఉల్లంఘిస్తారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఈ నేపథ్యంలో మరో రెండు వాదనలు తెరపైకి వచ్చాయి. జయలలిత రిమాండ్ ఖైదీ అని.. అమె తెల్లచీర ధరించాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అయితే జయలలిత రిమాండ్ ఖైదీ కాదని, తెల్లచీరను ధరించాల్సిందేనని పోలీసు వర్గాలు నొక్కి చెబుతున్నాయి. దోషిగా న్యాయస్థానం నిర్థారించిన తరువాత అమె రిమాండ్ ఖైదీ ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నాయి. కర్ణాటక హైకోర్టు కూడా బెయిల్ నిరాకరించిన తరుణంలో జైలులో వున్న జయలలిత తెల్లచీర కట్టుకోవాల్సిందేనంటున్నారు జైలు అధికారులు. కానీ ఎవరు సహసించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో అటు కర్ణాటక సర్కార్తో పాటు ఇటు జైలు అధికారులు తలపట్టుకు కూర్చున్నారు. తెల్ల చీర ధరించేలా జయలలితపై ఒత్తిడి తెస్తే పరిస్థితులు ఎలా మారుతాయోనని హడలి పోతున్నారు.

మరోవైపు జయ ఉన్న జైలు బయట తమిళ తంబీలు, అన్నాడీఎంకే కార్యకర్తలు నిరసనలు, ఆందోళనలతో చెలరేగిపోతున్నారు. వారిని బలవంతంగా అక్కడ నుంచి తరలిస్తే ఎక్కడ ఉద్రిక్తతలు నెలకొంటాయోనని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే పలు విషయాల్లో తమిళనాడు- కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరో అంశాన్ని చేర్చడం ఎందుకని భావిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో… ఆమెపై నిబంధనల ప్రకారం దుస్తులు ధరించాలని ఒత్తిడి చేస్తున్నారంటూ వార్తలు వెలువడితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని జైలు అధికారులు భావిస్తున్నారు. దీంతో, కర్ణాటక అధికారులు పురుచ్చితలైవిని తమిళనాడు జైలుకు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆమె సొంత రాష్ట్రంలోని జైలుకు తరలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కర్ణాటక సర్కారు విన్నవించనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  4 years jail  white saree  tamilnadu  bail petition  karnataka high court  

Other Articles