Where is motkupalli narasimhulu

motkupalli narasimhulu, motkupalli narasimhulu wiki, motkupalli narasimhulu profile, motkupalli narasimhulu on kcr, motkupalli on kcr, motkupalli on trs, motkupalli narasimhulu comments, motkupalli comments, trs on motkupalli narasimhulu, tdp, telugu desam party, telangana, chandrababu naidu, latest news, politics, kcr, trs, chandrababu naidu

after telangana state formed tdp leader motkupalil not responding seriously on motkupalli : there is a discussion about motkupalli that he is not appearing before media like six months back

ఏడనున్నవో.. కానరావేమయ్యా..?

Posted: 09/27/2014 09:08 AM IST
Where is motkupalli narasimhulu

టీఆర్ఎస్ ను తిట్టే నేతలు అనగానే ముందుండేది మోత్కుపల్లి నర్సింహ్ములు. అది ఒకప్పటి మాట. ఇప్ప్పుడు నర్సన్న గులాబి దండుపై దండెత్తటం లేదు. కేసీఆర్ ను ఎలా తిట్టాలో ప్రపంచానికి చూపించిన మాజి ఎమ్మెల్యే.., భవిష్యత్తులో గవర్నర్, రాజ్యసభ సీటు ఆశావహుడు ఇప్పుడు నోరు మెదపటం లేదు. రాష్ర్టం ఏర్పడక ముందు నిత్యం మీడియాలో ఆయన వెలిగిపోయేవారు.. కాని ఇప్పుడు చూద్దామన్నా కనీసం ఆయన పేరుపై స్క్రోలింగ్ కూడా రావటం లేదు. టీడీపీలో చంద్రబాబు ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోని మోత్కుపల్లి బయటకు రావటం లేదని వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీని అన్ని పార్టీలు తిట్టిపోస్తుంటే.., ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి టీఆర్ఎస్ ను తిట్టడంలో ముందుండేవారు. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచి మైకు ఉన్నా.., లేకున్నా విమర్శలు మొదలు పెట్టేవారు. మోత్కుపల్లి నోట కేసీఆర్ పేరు తర్వాత వచ్చే పదం అయితే తిట్టు.., లేకపోతే వ్యంగ్య కామెంటే. ఇలా ప్రస్తుత ముఖ్యమంత్రిని విమర్శిస్తూ మీడియా దృష్టినే కాకుండా ప్రజలను కూడా ఆకర్షించారు మోత్కుపల్లి. ప్రధానిని సైతం నేరుగా విమర్శించే టీఆర్ఎస్ నేతలకు మోత్కుపల్లి కామెంట్లకు మాత్రం ధీటుగా సమాధానం చెప్పేవారు కాదు. కారణాలు మాటలు రాక అని కాదులేండి మరొకటి ఉంది.

ఇలా నిత్యం విమర్శలు చేయటానికి మోత్కుపల్లికి టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ ఒకటి వచ్చినట్లు అప్పట్లో మీడియాలో తెగ ప్రచారం జరిగింది. అదేమంటే రాజ్యసభ సీటు. టీడీపి నుంచి అప్పట్లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీటును మాజి మంత్రి ఆశించారు.  ఢిల్లీకి వెళ్లి కూర్చోవాలని కలలు కని.., బాబు మెప్పు కోసం ఆయనపై విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ దండుపై ఒంటిచేత్తో యుద్ధం చేశారు. అయితే రాజకీయ చాణిక్యుడు తిప్పిన చక్రంలో మోత్కుపల్లి పేరు లేదు. దీంతో పెద్దలసభకు వెళ్లి అద్యక్షా అనాలి అనుకున్న కల... కలగానే మిగిలిపోయింది. బాబు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవటానికి మోత్కుపల్లికి చాలా సమయం పట్టిందని ఆయన సన్నిహితులు తెలిపారు.


గవర్నర్ ఎప్పుడో..,

రాజ్యసభ పదవిని ఆశించి భంగపడ్డ మోత్కుపల్లి నర్సింహ్ములు పార్టీ అధినేత వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత కష్టపడ్డా.., తనను గుర్తించలేదని బాధపడ్డారు. విషయం తెలుసుకన్న చంద్రబాబు.., ప్రత్యేకంగా ఒక్కరికోసం ఓదార్పుయాత్ర మొదలుపెట్టి మోత్కుపల్లిని బుజ్జగించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఖతం అవుతుందని ముందే ఊహించిన చంద్రబాబు.. ఎన్డీయేతో చేతులు కలుపుతాం కాబట్టి. తనకున్న పలుకుబడితో ఏదో ఒక రాష్ర్టానికి గవర్నర్ చేస్తానని హామి అయితే ఇచ్చారు.

ఈ ప్రకటనతో మోత్కుపల్లి అలకపాన్పువీడినట్లు వార్తలు వచ్చినా.., మీడియా ముందుకు రావటానికి అంతగా ఆసక్తి చూపటం లేదు. దీనికి తోడు ఈ మద్య గవర్నర్ల మార్పులు జరిగాయి. తెలంగాణ బీజేపీ నేత విద్యాసాగర్ రావు మహారాష్ర్ట గవర్నర్ అయ్యారు. ఆయనతో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా పలు రాష్ర్టాలకు రాజ్యాంగ అధినేతలు అయ్యారు. అయితే మోత్కుపల్లి టికెట్ మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.. స్టిల్ ఆన్ వెయిటింగ్ లిస్ట్. పార్టీ సమావేశాల్లో అయితే పాల్గొంటున్నారు కానీ.., మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదు. అటు ఈయన పోవటంతో పార్టీ మరో ఫైర్ బ్రాండ్ ను తయారు చేసుకుంది. ఆయన ఎవరో మనందరికి తెలుసే. ఏదయితేనేం.. పార్టికోసం కష్టపడి పనిచేసి.. సీనియర్ నేతగా ఎదిగిన మోత్కుపల్లికి జరిగిన అన్యాయాన్ని బాబు ఎలా, ఎప్పుడు భర్తీ చేస్తారో చూడాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : motkupalli narasimhulu  kcr  chandrababu naidu  telangana  

Other Articles